Naga Chaitanya Sobhita : నాగ చైతన్య రియల్ లైఫ్‌లో బుజ్జి తల్లి శోభితానే అట.. తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పేశాడుగా
Naga Chaitanya : నాగ చైతన్య తండేల్ ఈవెంట్స్‌లో, ఇంటర్వ్యూలలో శోభితా ప్రస్తావన ఈ మధ్య ఎక్కువగానే వినిపిస్తోంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చై.. శోభితా గురించి ఇంట్రెస్టింగ్ విషయం తెలిపాడు.

Thandel Pre Release Event Highlights : తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. అయితే ఈ ఈవెంట్లో నాగ చైతన్య (Naga Chaitanya) తన వైఫ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా యాంకర్ సుమ(Anchor Suma).. వైరల్ వేవ్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు చూపిస్తూ.. ఒక్కొక్కరిని ప్రశ్నలు అడిగారు. అలా చైతన్య విషయంలో వైరల్ అవుతున్న ఫోటోను చూపించి.. సుమ ప్రశ్నించగా.. చైతన్య ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు.
నా బుజ్జి తల్లి తనే..
నాగ చైతన్య, శోభిత (Sobhita Dhulipala)పెళ్లి ఫోటోల్లో అరుంధతిని చూస్తోన్న ఫోటోను చూపించి.. ఇది బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో.. ఇప్పుడు మీరు శోభితాకు ఓ డైలాగ్ కానీ.. పాటను కానీ డెడికేట్ చేయాలంటూ సుమ కోరారు. ఫోన్ చేసినా పర్లేదు కంటెంట్ వైరల్ అవుతుందంటే.. అయితే బుజ్జి తల్లి సాంగ్‌ని డెడికేట్ చేస్తాను.. ఎందుకంటే నా రియల్ లైఫ్ బుజ్జి తల్లి శోభితానే. తనని ఇంట్లోనే అలానే పిలుస్తాను. ఈ విషయం డైరక్టర్ చందుకు కూడా తెలుసు అంటూ చెప్పాడు.
చందు మాట్లాడుతూ.. అవును.. చైతన్య, శోభితా పెళ్లికి వెళ్లినప్పుడు.. శోభితా ఈ విషయం చెప్పారు. నా పేరు బుజ్జి తల్లి. సరే సినిమా వరకు ఊరుకున్నాను. మీరు పాటలో కూడా నా పేరు వాడుకున్నారంటూ ఫీల్ అయ్యారని చందు చెప్పగా.. చై మాట్లాడుతూ.. పాట వచ్చాక శోభిత చాలా ఫీల్ అయింది. ఎందుకంటే.. అది తన సిగ్నేచర్ పేరు బుజ్జి తల్లి అని. మీరు ఇలా సినిమాలో వాడేసుకున్నారని చాలా ఫీల్ అయినట్లు చై చెప్పారు.
శోభితాను సలహా అడుగుతా..
తాజాగా తండేల్ గురించి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. యాంకర్.. మీరు శోభితాతో స్టోరీల గురించి మాట్లాడుతారా? ఇన్పుట్స్ ఏమైనా తీసుకుంటారా అంటూ చైతన్యను ప్రశ్నించారు. దీనికి చై రిప్లై ఇస్తూ.. అవును కచ్చితంగా నేను తనని అడుగుతాను. మేము ఇద్దరం ఒపీనియన్స్ షేర్ చేసుకుంటాము. పైగా శోభితా చాలా న్యూట్రల్‌గా సమాధానం ఇస్తుంది. తన ఆలోచన విధానం చాలా బాగుంటుంది అంటూ తెగ మెచ్చేసుకున్నాడు చై.
వైజాగ్ అమ్మాయి..
రీసెంట్గా వైజాగ్‌లో జరిగిన ఓ ఈవెంట్లో కూడా.. నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం. నేను వైజాగ్ అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగ్దే అంటూ కూడా తండేల్ ఈవెంట్లో చెప్పాడు చైతన్య. సమంతతో విడాకుల తర్వాత శోభితాతో చై డేటింగ్ రూమర్స్ వినిపించాయి. తర్వాత ఆగస్టు 8వ తేది 2024లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున సోషల్ మీడియాలో తెలిపారు. అనంతరం అన్నపూర్ణ స్టూడియోలో డిసెంబర్ 4వ తేదీన 2024లో చై, శోభితా అంగరంగ వైభవంగా.. సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు ఈ జంట. తమ ప్రేమ ఇన్‌స్టా నుంచి మొదలైందని.. పెళ్లి తర్వాత రివీల్ చేశారు.
Also Read : 'తండేల్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అల్లు అర్జున్ డుమ్మా... కారణం ఏంటో తెలుసా?






















