అన్వేషించండి

'కస్టడీ'కి 'శివ' టైటిల్ పెడదామన్న డైరెక్టర్ - 'నో' చెప్పిన నాగచైతన్య, ఎందుకంటే?

అక్కినేని నాగచైతన్య నటించిన 'కస్టడీ' సినిమా ఈ నెల 12న విడుదల రాబోతోంది. అయితే ఈ చిత్రానికి 'శివ' అనే టైటిల్ పెట్టాలని దర్శకుడు భావించినా, చైతూ వద్దని చెప్పాడని తాజాగా ప్రెస్ మీట్ లో వెల్లడించారు.

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కస్టడీ'. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ ద్విభాషా చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 12న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా బుధవారం హైదరాబాద్ లో చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తిరమైన విషయాలు వెల్లడించారు. 

'కస్టడీ' మూవీలో చైతన్య కానిస్టేబుల్ శివ పాత్రలో కనిపించబోతున్నాడు. అక్కినేని నాగార్జున కెరీర్ లో కల్ట్ క్లాసిక్ సినిమా, పాత్ బ్రేకింగ్ మూవీ 'శివ'. ఇప్పుడు చైతూ క్యారెక్టర్ నేమ్ అదే అవ్వడంతో.. సినిమా టైటిల్ గా పెట్టాలని దర్శకుడు వెంకట్ ప్రభు భావించారట. అయితే దీనిని ససేమిరా అన్న నాగచైతన్య.. ఫ్యాన్స్ వచ్చి మనల్ని కొడతారని దర్శకుడితో చెప్పారట. ఇదే విషయాన్ని ప్రెస్ మీట్ లో చై వెల్లడించారు. 

చైతన్య మాట్లాడుతూ.. "కస్టడీ సినిమాలో నా క్యారక్టర్ పేరు శివ. సెంటిమెంట్ కోసం ఆ పేరు పెట్టలేను. ‘శివ’ అనే పేరు వెనక చాలా పవర్ ఉంది. కస్టడీలో శివ పాత్ర వెనక కూడా అలాంటి లేయర్స్ ఉన్నాయి. కానీ శివ సినిమాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. అందుకే శివ అనే టైటిల్ పెట్టలేదు. కేవలం జిమ్మిక్ కోసం ఓ సూపర్ హిట్ టైటిల్ ను ఉపయోగించకూడదు. ఒరిజినల్ ను ఒరిజినల్ గానే ఉంచుదాం" అని అన్నారు.

"నిజం తన చేతుల్లో ఉన్నప్పుడు హీరో ఎంత దూరం ప్రయాణం చేశాడనేది ఈ కథ. ఒక కానిస్టేబుల్ పాత్రని ఇలా స్క్రీన్ మీదకి తీసుకురావడం ఈమధ్య కాలంలో నేను చూడలేదు. ఈ స్టోరీకి నేనే ఎందుకు అని వెంకట్ ప్రభుని అడిగాను. 'లవ్ స్టోరీ' సినిమాలో తన నటన చాలా బాగా నచ్చిందని.. ఈ సినిమాలో పక్కిండి కుర్రాడి తరహా పాత్రకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతావని చెప్పాడు. నన్ను నమ్మి ఇలాంటి కథను తీసుకొచ్చినందుకు దర్శకుడికి థ్యాంక్స్" అని నాగచైతన్య అన్నారు.

ఇంకా మాట్లాడుతూ.. ''ఎప్పటి నుంచో తమిళంలో సినిమా చేయాలని అనుకుంటున్నాను. నా స్కూలింగ్ అంతా చెన్నైలోనే సాగింది. దర్శకుడికీ తెలుగులో సినిమా చేయాలనే కోరిక ఉండేది. ఇద్దరికీ కలిసొచ్చింది. జనరల్ గా నేను కథ విన్న తర్వాత ఎక్కువగా రియాక్ట్ అవ్వను. కానీ ‘కస్టడీ’ కథ చెప్పడం పూర్తయ్యాక, ఆనందంతో వెంకట్ ప్రభుని హగ్ చేసుకున్నా. అంత బాగా నచ్చింది ఈ కథ" అని చైతూ తెలిపారు. ఈ సందర్భంగా 'కస్టడీ' సినిమా మెయిన్ పాయింట్ ఏంటనేది బయటపెట్టాడు చైతన్య. 

"ఏ సినిమాలోనైనా హీరో చేతిలో విలన్ చనిపోతాడు. కానీ 'కస్టడీ' సినిమాలో మాత్రం విలన్ ను హీరో చంపడు. చంపే ఛాన్స్ వచ్చినప్పటికీ, విలన్ బతికుండేలా చేస్తాడు. అదే ఈ సినిమాలో కొత్త పాయింట్. అది ఎందుకనేది సినిమాలో చూడాలి. వెంకట్ ప్రభు ఇది చాలా చిన్న కథ అని అన్నాడు. కానీ ఇది చిన్న కథ కాదు. ఇదొక కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్. వెంకట్ ప్రభు టిపికల్ స్క్రీన్ ప్లేతో ఇంటెన్స్ యాక్షన్ అండ్ ఎమోషన్స్ తో తెరకెక్కింది" ఆని చెప్పారు నాగచైతన్య. 

మేం బౌన్స్ బ్యాక్ అవుతాం: నాగచైతన్య 

ఇటీవల కాలంలో అక్కినేని హీరోలు నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. థ్యాంక్యూ, ది ఘోస్ట్, ఏజెంట్ వంటి చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. దీనిపై నాగచైతన్య మాట్లాడుతూ.. "ఫ్యాన్స్ కి ఎప్పుడూ మంచి సక్సెస్ ఇవ్వాలనే అనుకుంటాం. వాళ్ళు మాపై ఎంతో ప్రేమ చూపిస్తారు. అన్ కండిషనల్ సపోర్ట్ ఇస్తారు. వాళ్ళకు మేము తిరిగి ఇచ్చేది మంచి సినిమా మాత్రమే. అఫ్ కోర్స్... లాస్ట్ రెండు మూడు రిలీజులు మేము అనుకున్నట్టు వర్కవుట్ అవ్వలేదు. ఆశించిన రిజల్ట్ రాలేదు. ఈ సినీ కెరీర్ లో ఎత్తు పల్లాలు సహజమే. అందరూ వాటిని చూశారు. వాటితోనే అందరూ ట్రావెల్ అవ్వాలి. ఆ బ్యాడ్ టైమ్ త్వరగా పాస్ అయిపోతుంది. కచ్ఛితంగా మేం త్వరలో విజయాలతో తిరిగి వస్తాం. నేను 'కస్టడీ' మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఫ్యాన్స్ కి కావాల్సిన రిజల్ట్ రాబోతుందని నేను బాగా నమ్ముతున్నాను'' అని చెప్పుకొచ్చారు.

Also Read: అన్నపై తమ్ముడి ఎఫెక్ట్ - 'కస్టడీ' బిజినెస్‌‌కు ‘ఏజెంట్’ గండం?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget