Mr Bachchan Trailer: మిస్టర్ బచ్చన్ ట్రైలర్ వచ్చిందోచ్... రవితేజ మాస్, హరీష్ శంకర్ డైలాగ్స్‌లో ఫైర్
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన 'మిస్టర్ బచ్చన్' ట్రైలర్ ఈ రోజు విడుదల చేశారు. అది ఎలా ఉంది? అందులో ఏముంది? అనేది చూడండి.
![Mr Bachchan Trailer: మిస్టర్ బచ్చన్ ట్రైలర్ వచ్చిందోచ్... రవితేజ మాస్, హరీష్ శంకర్ డైలాగ్స్‌లో ఫైర్ Mr Bachchan Movie Trailer Review In Telugu Ravi Teja Bhagyashri Borse Mr Bachchan Trailer: మిస్టర్ బచ్చన్ ట్రైలర్ వచ్చిందోచ్... రవితేజ మాస్, హరీష్ శంకర్ డైలాగ్స్‌లో ఫైర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/07/2c43a583f81873abbee0234168421a881723036228557313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mr Bachchan Trailer Review: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా హరీష్ శంకర్ తెరకెక్కించిన తాజా సినిమా 'మిస్టర్ బచ్చన్'. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. అది ఎలా ఉందో చూడండి.
కథ ఏంటో చెప్పిన హరీష్ శంకర్!
Mr Bachchan story revealed in trailer: 'మిస్టర్ బచ్చన్' ట్రైలర్ కంటే ముందు ఈ సినిమాలో సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. అంత కంటే ముందు సినిమా షో రీల్ రిలీజ్ చేశారు. మధ్యలో టీజర్ కూడా విడుదల చేశారు. ఇప్పటి వరకు విడుదల చేసిన వీడియోలు చూస్తే... పాటల్లో రవితేజ, భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ ఎంత బావుందో? అంత కంటే ఎక్కువ రవితేజ మాస్ కూడా చూపించారు హరీష్ శంకర్. ఇప్పుడు ట్రైలర్ ద్వారా ఆయన కథ రివీల్ చేశారు.
అటు రొమాన్స్, ఇటు యాక్షన్ ప్యాక్డ్ ఎలిమెంట్స్... రెండింటినీ బ్లెండ్ చేస్తూ 'మిస్టర్ బచ్చన్' తెరకెక్కించారు. పీరియడ్ బ్యాక్‌డ్రాప్ సినిమా కావడంతో నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ ఎక్కడా రాజీ పడలేదని అర్థం అవుతోంది. పంచ్ డైలాగ్స్ రాయడంలో హరీష్ శంకర్ స్పెషలిస్ట్. 'మిస్టర్ బచ్చన్'లోనూ ఆ పంచ్ డైలాగులకు ఎటువంటి లోటు లేదని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.
Also Read: తమన్నా డబుల్ బొనాంజా - బాలీవుడ్ కెరీర్‌కు కొత్త బిగినింగా? ఎండ్ కార్డా?
Bachchan Saab is here with tons of entertainment ❤️🔥❤️🔥#MrBachchan MASS MAHA TRAILER out now 💥💥
— People Media Factory (@peoplemediafcy) August 7, 2024
▶️ https://t.co/Doa4HD4k21
GRAND RELEASE WORLDWIDE ON AUGUST 15th.#MassReunion
Mass Maharaaj @RaviTeja_offl #BhagyashriBorse @harish2you @vishwaprasadtg @peoplemediafcy @TSeries… pic.twitter.com/2iOWS80NH2
అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కిన 'రైడ్' స్ఫూర్తితో 'మిస్టర్ బచ్చన్' తెరకెక్కింది. ఆ సినిమా, ఇప్పుడీ ట్రైలర్ చూస్తే... రెండిటి మధ్య ఎంతో వ్యత్యాసం కనబడుతుంది. లక్నోలోని ఓ ఎంపీ ఇంటి మీద జరిగిన ఇన్‌కమ్ ట్యాక్స్ రైడ్ (IT Raid) ఆధారంగా 'రైడ్' తీశారు. ఆ పాయింట్ తీసుకుని కమర్షియల్ పంథాలో 'మిస్టర్ బచ్చన్' ఫిల్మ్ తెరకెక్కించారు.
Also Read: శివుడి మీద కాంట్రవర్సీ లేకుండా సినిమా - ముస్లిం దర్శకుడు అప్సర్ మీద ప్రశంసలు
Mr Bachchan Movie Cast And Crew: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన 'మిస్టర్ బచ్చన్'లో జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, సత్య, నెల్లూరు సుదర్శన్ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు: ఉజ్వల్ కులకర్ణి, ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, ఛాయాగ్రహణం: అయనంక బోస్,సంగీతం: మిక్కీ జె మేయర్, సమర్పణ: పనోరమా స్టూడియోస్ - టీ సిరీస్,నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్, రచన - దర్శకత్వం: హరీష్ శంకర్.
Also Read: 'వెంకీ' వర్సెస్ 'విశ్వం'... ఆ ట్రైన్ సీక్వెన్స్, శ్రీను వైట్ల మీద అందరి చూపు, ఏం చేస్తారో మరి?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)