News
News
వీడియోలు ఆటలు
X

Mother's Day Special: వెండితెరపై అమ్మ ప్రేమ.. మదర్ సెంటిమెంట్‌తో హిట్ కొట్టిన సినిమాలు ఇవే!

వెండితెరపై తల్లి ప్రేమను ఆవిష్కరించిన సినిమాలకు ఎల్లప్పుడూ ప్రేక్షకాదరణ ఉంటుంది. తెలుగులో మదర్ సెంటిమెంట్‌ తో వచ్చి హిట్ కొట్టిన సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

FOLLOW US: 
Share:

సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం 'అమ్మ'.. ప్రత్యక్ష దైవం 'అమ్మ'.. దైవాన్ని మించిన దైవం 'అమ్మ'.. ప్రపంచంలోకెల్లా తీయనైన పదం 'అమ్మ'. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ మరెక్కడా లేదు. తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది. అమ్మ గురించి చెప్పాలంటే భాష చాలదు. అంతటి ప్రాముఖ్యత కలిగిన 'అమ్మ' పాత్ర‌ నిజ జీవితంలోనే కాదు.. సినిమాల్లోనూ చిర‌స్మ‌ర‌ణీయం. వెండితెరపై అమ్మ ప్రేమను ఆవిష్కరించిన ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. మదర్ సెంటిమెంట్ తో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. 'మదర్స్ డే' సందర్భంగా తెలుగులో అమ్మ సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!

అమ్మ రాజీనామా (1991):
దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన కుటుంబ కథా చిత్రం 'అమ్మ రాజీనామా'. జీవితాంతం కుటుంబం కోసం కష్టపడే తల్లి, తన విలువను గుర్తించని కుటుంబ సభ్యుల మధ్య తన బాధ్యతలు మానేస్తే ఏమవుతుందో తెలిపే సినిమా ఇది. ఇందులో అమ్మ పాత్రలో సీనియర్ నటి శారద అద్భుతమైన నటన కనబర్చింది. కైకాల సత్యనారాయణ, సాయి కుమార్, బ్రహ్మానందం ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలోని 'ఎవరు రాయగలరు' అనే పాట ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. 2001 లో ఈ సినిమాని 'అమ్మ' పేరుతో కన్నడలో రీమేక్ చేసారు. దీంట్లో లక్ష్మి ప్రధాన పాత్ర పోషించింది.

మాతృదేవోభవ (1993):
మదర్ సెంటిమెంట్ అనగానే తెలుగులో అందరికీ టక్కున గుర్తొచ్చే సినిమా 'మాతృదేవోభవ'. భర్తను కోల్పోయిన ఒక స్త్రీ, క్యాన్సర్ తో తను కూడా కొద్ది రోజుల్లో మరణిస్తానని తెలుసుకొని.. తన ముగ్గురు బిడ్డల భవిష్యత్తు కోసం పడే తపన, ఆరాటమే ఈ చిత్రం. కె. అజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఇందులో మాధవి, నాజర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో ఎం. ఎం. కీరవాణి స్వరపరిచిన 'రాలిపోయే పువ్వా', 'వేణువై వచ్చాను' పాటలు ఆల్ టైం చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. వేటూరి సుందర్రామ్మూర్తి రాసిన 'రాలిపొయ్యే పువ్వా' పాటకు జాతీయ పురస్కారం లభించింది. మాతృదేవోభవ అనేది 'ఆకాశదూత' అనే మలయాళ చిత్రానికి రీమేక్. అదే సినిమాని కన్నడలో 'కరుళిన కూగు' పేరుతోను, హిందీలో 'తులసి', మరాఠీలో 'చిమని పఖరే' పేరుతోను రీమేక్ చేసారు. అయితే ఈ సినిమాలన్నీ 1983లో వచ్చిన 'హూ విల్ లవ్ మై చిల్డ్రన్?' అనే అమెరికన్ మూవీ ఆధారంగా నిర్మించబడ్డాయని భావిస్తారు. 

యమలీల (1994):
ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన సోషియో ఫాంటసీ కామెడీ చిత్రం 'యమలీల'. తల్లి ప్రాణాలు కాపాడుకోడానికి ఓ సాధారణ యువకుడు ఏకంగా యముడినే ముప్పుతిప్పలు పెట్టడాన్ని ఫన్నీగా ఎమోషనల్ గా ఈ సినిమాలో చూపించారు. ఇందులో కమెడియన్ ఆలీ హీరోగా నటించాడు. ఇంద్రజ, మంజు భార్గవి ఇతర ప్రధాన పాత్రల్లో నటించగా.. కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, గుండు హనుమంతరావు ముఖ్య పాత్రల్లో నటించారు. సినిమాలోని 'సిరులొలికించే' పాట పిల్లల మీద అమ్మ ప్రేమ గురించి గొప్పగా వివరిస్తుంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్టైన ఈ చిత్రాన్ని హిందీలో 'తక్‌ దీర్‌ వాలా' పేరుతో, తమిళంలో 'లక్కీ మ్యాన్' (1995)గా రీమేక్ చేసారు. ఇక యమలీల కు సీక్వెల్ గా ఎస్వీ కృష్ణారెడ్డి 2014లో 'యమలీల 2' చిత్రాన్ని తీశారు. అలానే 'యమలీల.. ఆ తరువాత' పేరుతో 2020లో సీరియల్ రూపొందించారు.

సింహరాశి (2001):
సీనియర్ హీరో డా. రాజశేఖర్, సాక్షి శివానంద్ నటించిన సినిమా 'సింహరాశి'. ఆర్. బి. చౌదరి నిర్మాణ సారథ్యంలో వి. సముద్ర దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. మదర్ సెంటిమెంట్ ను టచ్ చేస్తూ రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందింది. ముఖ్యంగా తల్లీ కొడుకుల ఎపిసోడ్ ఎంతో ఎమోషనల్ గా ఉంటుంది. ఇది తమిళంలో వచ్చిన 'మాయి' చిత్రానికి రిమేక్.

అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి (2003):
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ, అసిన్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి'. కిక్ బ్యాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తల్లి సెంటిమెంట్ ని టచ్ చేస్తూ ఈ మూవీ తీశారు. ఇందులో ప్రకాష్ రాజ్, జయసుధ కీలక పాత్రలు పోషించారు. జయసుధ, రవితేజకి మధ్య వచ్చే సీన్స్ చాలా సహజంగా ఉండేలా తీసారు పూరి. సినిమాలోని 'నీవే నీవే' పాట తల్లీ కొడుకుల మధ్య ప్రేమ అనుబంధాలను తెలియజేస్తుంది.

ఛత్రపతి (2005):
దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన యాక్షన్ డ్రామా 'ఛత్రపతి'. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించారు. కమర్షియల్ సినిమా అయినా కూడా మెయిన్ కాన్సెప్ట్ మాత్రం మదర్ సెంటిమెంట్ చుట్టూ నడుస్తుంది. ఇది అప్పట్లోనే రూ. 30 కోట్లు వసూలు చేసి, డార్లింగ్ కెరీర్ లో అతి పెద్ద హిట్ గా నిలిచింది. ఇందులో శ్రీయ హీరోయిన్ గా నటించగా, భానుప్రియ తల్లి పాత్రలో నటించింది. ఈ సినిమా పలు ఇతర భాషల్లోకి రీమేక్ కాబడింది. 18 ఏళ్ళ తర్వాత అదే పేరుతో హిందీలో రీమేక్ చేయబడింది. వి వి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించాడు. 

అమ్మ చెప్పింది (2006):
శర్వానంద్ హీరోగా గుణ్ణం గంగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'అమ్మ చెప్పింది'. ఇందులో సుహాసిని తల్లి పాత్రలో నటించింది. శ్రీయా రెడ్డి, నాగేంద్రబాబు, సుమన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మానసికంగా ఎదుగుదల లేని ఓ అబ్బాయి.. తన ప్రాణాలను పణంగా పెట్టి, టెర్రరిస్టుల ఉగ్రదాడి నుంచి ప్రజలను ఎలా రక్షించాడనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందించారు.

యోగి (2007):
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన యాక్షన్ డ్రామా 'యోగి'. వి వి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. తల్లికి చెప్పకుండా ఉద్యోగం కోసం సిటీకి పారిపోయిన యువకుడు.. అతన్ని వెతుక్కుంటూ వచ్చిన తల్లి చివరకు కొడుకును కలవకుండానే చనిపోవడం అనే విషాదాంత కథతో ఈ మూవీ తెరకెక్కింది. ఇది జోగి అనే కన్నడ చిత్రానికి అధికారిక రీమేక్. 

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (2012):
డైరక్టర్ శేఖర్ కమ్ముల స్వీయ నిర్మాణంలో రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'. దర్శకుడు ఇందులో మదర్ సెంటిమెంట్ ని కూడా టచ్ చేసారు. స్టోరీ వేరే ట్రాక్ లో నడిచినా, అసలు మొదలయ్యేది మాత్రం అమ్మ అనే పాయింట్ తోనే. తల్లి పాత్రలో అమల అక్కినేని నటించగా.. అభిజిత్, శ్రియ, అంజులా ఝావేరి ఇతర పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి, శ్రీ విష్ణు, శ్రీముఖి వంటి వారు ఈ సినిమాలో చిన్న రోల్స్ చేసారు.

రఘువరన్ బీటెక్ (2015):
ఈ జెనెరేషన్ ఆడియన్స్ కి మదర్ సెంటిమెంట్ సినిమా అనగానే వెంటనే స్ట్రైక్ అయ్యే మూవీ 'రఘువరన్ బీటెక్'. వేల్‌ రాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ధనుష్ హీరోగా నటించాడు. అమలా పాల్, సురభి, శరణ్య పొనవన్నన్, సముద్రఖని, వివేక్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. జీరో టు హీరో కథాంశానికి మదర్‌ సెంటిమెంట్‌, లవ్‌ ట్రాక్‌, యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ అన్నీ జోడించిన పక్కా కమర్షియల్‌ సినిమా ఇది. తమిళ్ లో ‘వేలై ఇళ్ళ పట్టదారి’ పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘రఘువరన్ బి.టెక్’ పేరుతో స్రవంతి మూవీస్ వారు రిలీజ్ చేసారు. 

బిచ్చగాడు (2016):
తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన సినిమా 'బిచ్చగాడు'. వాస్తవ సంఘటనల ఆధారంగా శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఘన విజయం సాధించింది. డబ్బింగ్ సినిమా అయినా కూడా తెలుగులోనూ మంచి సక్సెస్ అయ్యింది. ఇందులో మదర్ సెంటిమెంట్ ని అద్భుతంగా ఆవిష్కరించారు. సినిమాలోని 'వంద దేవుళ్ళే కలిసొచ్చినా' పాట ఇప్పటికీ ఎవరో ఒకరి ఫోన్ లో రింగ్ టోన్ లేదా కాలర్ ట్యూన్ గా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏడేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ గా విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో 'బిచ్చగాడు-2' వస్తోంది. సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన ఈ మూవీ మే 19న విడుదల కాబోతోంది. 

KGF:
ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్ హీరోగా నటించిన సినిమా 'కేజీఎఫ్'. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా 'కేజీఎఫ్ 2' బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టి సంచలనం సృష్టించింది. ఇది మదర్‌ సెంటిమెంట్‌ నేపథ్యంలో తెరకెక్కిన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. అమ్మ చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని ప్రపంచంలోనే ధనవంతుడు అవ్వాలనుకునే రాకీ భాయ్ కథను ఈ సినిమాలో చూపించారు. 'ఎదగరా.. ఎదగరా' వంటి పాటలు, 'ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరు లేరు' వంటి డైలాగ్స్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. 

'ఒకే ఒక జీవితం':
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందించిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'ఒకే ఒక జీవితం'. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఓ యువకుడు.. టైం మెషిన్ సహాయంతో గతంలోకి వెళ్లి తన తల్లిని కలుసుకొని, అప్పుడు జరిగిన తప్పులను సరిచేయాలని ప్రయత్నించడమే ఈ సినిమా కథ. ఇందులో అమల అక్కినేని, శర్వానంద్ తల్లీ కొడుకులుగా నటించారు. శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రీతూ వర్మ, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. 

ఇవే కాకుండా మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన చాలా సినిమాలు కుటుంబ ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్‌, కృష్ణ‌, శోభ‌న్ బాబు, కృష్ణంరాజు దగ్గర నుంచి.. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వరకూ అందరూ అమ్మ సెంటిమెంట్ తో హిట్లు కొట్టారు. చిరు నటించిన 'ముగ్గురు మొనగాళ్లు' 'రాక్షసుడు' 'అడ‌విదొంగ‌'.. బాలయ్య 'భైర‌వ‌ద్వీపం' 'వంశానికొక్కడు'.. నాగ్ 'మనం'.. వెంకీ 'అబ్బాయి గారు' 'ధృవ నక్షత్రం' సినిమాలు అమ్మ చుట్టూ అల్లుకున్న కథలతో తెరకెక్కాయి. నాని, చిరుత, లోఫర్, కొమ‌రం పులి చిత్రాలు కూడా ఇదే కోవకు చెందుతాయి.

Published at : 14 May 2023 06:28 AM (IST) Tags: Mother's Day KGF Mother Sentiment Movies Matru Devo Bhava Amma Cheppindi Amma Rajinama Bichagadu

సంబంధిత కథనాలు

మంచువారి రూ.100 కోట్ల సినిమా, మెగా ఇంట పెళ్లి భాజాలు - ఇంకా మరెన్నో సినీ విశేషాలు

మంచువారి రూ.100 కోట్ల సినిమా, మెగా ఇంట పెళ్లి భాజాలు - ఇంకా మరెన్నో సినీ విశేషాలు

Ram Charan: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం - రామ్ చరణ్ స్పెషల్ ట్వీట్

Ram Charan: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం - రామ్ చరణ్ స్పెషల్ ట్వీట్

Narasimha Naidu Re Release : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్

Narasimha Naidu Re Release : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్

Bhola Mania Song Promo : భోళా శంకరుడి మేనియా షురూ - ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

Bhola Mania Song Promo : భోళా శంకరుడి మేనియా షురూ - ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

Samantha: అవును, అది నిజమే - ప్రియాంక చోప్రా ‘సిటాడెల్’లో పాత్రపై స్పందించిన సమంత

Samantha: అవును, అది నిజమే - ప్రియాంక చోప్రా ‘సిటాడెల్’లో పాత్రపై స్పందించిన సమంత

టాప్ స్టోరీస్

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ - సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే !

YS Viveka Case  : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ -  సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే   !

Top 5 160 CC Bikes: బెస్ట్ 160 సీసీ బైక్ కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

Top 5 160 CC Bikes: బెస్ట్ 160 సీసీ బైక్ కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!