Meenakshi Chaudhary: లక్కీ ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి చౌదరీ - సీనియర్ హీరో సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్
Meenakshi Chaudhary: క్రేజీ ప్రాజెక్ట్స్‌ను వెనకేసుకుంటున్న యంగ్ హీరోయిన్ల లిస్ట్‌లో మీనాక్షి చౌదరీ కూడా ఒకరు. యంగ్ హీరోలతో మాత్రమే సీనియర్ హీరోల సినిమాల్లో కూడా మీనాక్షి ఛాన్సులు కొట్టేస్తోంది.
Meenakshi Chaudhary Upcoming Movies: ఈరోజుల్లో యంగ్ హీరోయిన్లు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒకట్రెండు హిట్స్ కొడితే చాలు.. నిర్మాతలు వారి కాల్ షీట్స్ కోసం క్యూ కడుతుంటారు. సీనియర్ హీరోలు సైతం ఇలాంటి యంగ్ హీరోయిన్స్‌తో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాంటి హీరోయిన్స్‌లో ఒకరు మీనాక్షి చౌదరీ. తెలుగులో తన డెబ్యూ మూవీ అంతగా హిట్ అవ్వకపోయినా కూడా మీనాక్షి చేతిలో ప్రస్తుతం దాదాపు అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి మరో మూవీ కూడా యాడ్ అయ్యింది. ఏకంగా ఒక టాలీవుడ్ సీనియర్ హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసిందట ఈ భామ.
క్రేజీ ప్రాజెక్ట్స్..
2024ను మహేశ్ బాబుతో కలిసి నటించిన ‘గుంటూరు కారం’తో గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది మీనాక్షి చౌదరీ. అందులో మెయిన్ హీరోయిన్ శ్రీలీల అయినా కూడా సెకండ్ హీరోయిన్‌గా నటించిన శ్రీలీల అప్పీయరెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ‘గుంటూరు కారం’ విడుదలయిన కొన్నిరోజుల్లోనే తమిళంలో ‘సింగపూర్ సెలూన్’ అనే మూవీలో నటించింది మీనాక్షి. వచ్చే ఏడాది కోసం మాత్రం దాదాపు అరడజను సినిమాలతో సిద్ధంగా ఉంది ఈ యంగ్ బ్యూటీ. వరుణ్ తేజ్, విశ్వక్ సేన్ లాంటి యంగ్ హీరోలతో నటిస్తూనే విజయ్, చిరంజీవి లాంటి సీనియర్ హీరోలతో నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది. ఇంతలోనే మరో సీనియర్ హీరో అయిన వెంకటేశ్ సినిమాలో కూడా మీనాక్షి చౌదరీ హీరోయిన్‌గా ఎంపికయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి.
మూడు నెలల్లో..
వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఇప్పటికే ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’లాంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కాయి. ఇక ఈ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కడానికి సిద్ధమవుతోంది. ఇది ‘ఎఫ్ 3’ సీక్వెల్ అని చాలామంది అనుకున్నారు కానీ కాదని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో వెంకటేశ్ సరసన నటించడానికి ఇప్పటికే మీనాక్షి చౌదరీకి లుక్ టెస్ట్ కూడా నిర్వహించారట మేకర్స్. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపుగా పూర్తవ్వడంతో జులైలోనే షూటింగ్‌కు ప్రారంభించాలని సన్నాహాలు మొదలుపెట్టారు. మూడు నెలల్లో షూటింగ్‌ను పూర్తి చేసేయాలని మూవీ టీమ్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
మాజీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో..
అనిల్ రావిపూడి, వెంకటేశ్, మీనాక్షి చౌదరీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీని దిల్ రాజు తన సొంత బ్యానర్ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై నిర్మించనున్నారు. సంగీత దర్శకుడిగా భీమ్స్ ఎంపికయ్యాడు. ఈ మూవీలో వెంకటేశ్ ఒక మాజీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా కోసం పలు టైటిల్స్‌ను పరిగణలోకి తీసుకోగా ఇంకా దేనిని ఫైనల్ చేయలేదు అనిల్. వెంకటేశ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవిలాంటి సీనియర్ హీరోతో కూడా నటించే అవకాశం కొట్టేసింది మీనాక్షి. చిరు అప్‌కమింగ్ మూవీ ‘విశ్వంభర’లో మెయిన్ హీరోయిన్‌గా త్రిష నటిస్తున్నా కూడా సెకండ్ హీరోయిన్‌గా మీనాక్షి చౌదరీ కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: ఆటోలో షూటింగ్ వెళ్లిన శృతి హాసన్ - మరీ ఇంత డెడికేషనా? అంటూ నెటిజన్ల ప్రశంసలు