Manchu Vishnu: మంచు మనోజ్‌తో గొడవలు.. తమ్మారెడ్డి సలహాలు - మంచు విష్ణు చెప్పినట్లు చేస్తారా?
Vishnu Manchu: 'కన్నప్ప' మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు మంచు విష్ణు. ఈ సందర్భంగా తాజాగా ఇంటర్వ్యూలో మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇటీవల ఫ్యామిలీ వివాదాలపైనా స్పందించారు.

Manchu Vishnu About Kannappa And His Family Disputes: 'కన్నప్ప' సినిమా వల్ల తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని.. అనుకున్న టైంకే రిలీజ్ చేసేందుకు తనతో పాటు టీం ఎంతో శ్రమిస్తుందన్నారు మంచు విష్ణు. మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆయన్ను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
అదే నేను చేసిన మిస్టేక్
వీఎఫ్ఎక్స్ వర్క్స్ వల్లే 'కన్నప్ప' సినిమా ఆలస్యమైందని మంచు విష్ణు తెలిపారు. 'నాకు కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయడం చాలా ఇష్టం. ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్‌లో సరైన స్కిల్స్ లేని వ్యక్తిని తీసుకున్నా. అదే నేను చేసిన తప్పు. అందుకే ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. అనుకున్న టైంకు మూవీ రిలీజ్ చేసేందుకు టీం ఎంతగానో శ్రమిస్తోంది. టీంలో పనిచేసిన ప్రతీ ఒక్కరూ నాకెంతో సపోర్ట్‌గా నిలిచారు.' అని చెప్పారు.
Also Read: పూరీ జగన్నాథ్‌తో మూవీ - ప్రతీ ఆడియన్ ఇష్టపడేలా 'భైరవం'.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంటర్వ్యూ
శివుడి ఆజ్ఞ.. నా తండ్రి సపోర్ట్..
శివుడి ఆజ్ఞ.. తన తండ్రి ఇచ్చిన సపోర్ట్‌తోనే ఈ మూవీ చేయగలుగుతున్నానని మంచు విష్ణు అన్నారు. '2014లో తనికెళ్ల భరణి గారు 'కన్నప్ప' ఐడియా చెప్పారు. అది నచ్చడంతో విదేశాల నుంచి నిపుణులను పిలిపించి డెవలప్ చేయించా. దీన్ని భారీ స్థాయిలో చేయాలన్న భరణి గారి సలహాతో.. ఆ కథ తీసుకుని నాదైన వెర్షన్‌లో రెడీ చేయించా. రూ.100 కోట్ల లోపే బడ్జెట్ అవుతుందనుకుంటే దాని కంటే ఎక్కువగానే ఖర్చువుతోంది.
'మహాభారతం' చూసి డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తే బాగుంటుందని నాన్నే చెప్పారు. ప్రభాస్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాన్నకు ప్రభాస్‌కు మధ్య ఉండే సీన్ మూవీకే హైలెట్‌గా నిలుస్తుంది.' అని పేర్కొన్నారు.
మంచు మనోజ్‌తో వివాదంపై
ఈ సందర్భంగా మంచు మనోజ్‌తో గొడవలపై తమ్మారెడ్డి అడిగిన ప్రశ్నకు విష్ణు స్పందించారు. ఈ వివాదాలు చూస్తుంటే తనకెంతో బాధగా ఉందని.. 'కన్నప్ప' రిలీజ్ అయ్యాక కుటుంబసభ్యులందరూ ఓ చోట కూర్చుని సమస్య పరిష్కరించుకోవాలని తమ్మారెడ్డి విష్ణుతో అన్నారు. కావాలంటే తాను పెద్దరికం తీసుకుంటానని చెప్పారు. దీనిపై స్పందించిన విష్ణు.. మీ మాటలు తాను గౌరవిస్తానని అన్నారు. 'ఫ్యామిలీలో గొడవలు జరిగిన కొన్ని రోజులకే మీరు నాకు ఫోన్ చేశారు. ఏం జరుగుతుందని అడిగారు. దాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. ఇండస్ట్రీ ఓ ఫ్యామిలీ. భేదాభిప్రాయాలు ఉండొచ్చు. మీ సలహాలు తీసుకుంటాను. మీ మాటలు నేను ఫాలో అవుతా.' అని చెప్పారు.
జూన్ 27న 'కన్నప్ప' రిలీజ్
'కన్నప్ప' మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు టీం సన్నాహాలు చేస్తోంది. ఈ మూవీలో ప్రధాన పాత్రలో మంచు విష్ణు నటిస్తుండగా.. ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా.. మోహన్ బాబు నిర్మిస్తున్నారు.సినిమాలో పరమశివుని పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. పార్వతిగా కాజల్ అగర్వాల్ నటించారు. రుద్రుడిగా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించారు. ఇప్పటికే విడుదలైన లుక్స్,టీజర్, సాంగ్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి.






















