Manchu Manoj: పహాడి షరీఫ్ పోలీస్‌స్టేషన్‌కు మంచు మనోజ్ - గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఫిర్యాదు
Manchu Issue: మంచు కుటుంబంలో ఏర్పడిన వివాదం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో తనపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేశారు.
Manchu Manoj filed a police complaint against Mohan Babu: ప్రముఖ టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది. తనపై దాడి చేశారని మంచు మనోజ్ పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేశారు. తనకు అయిన గాయాల మెడికల్ రికార్డులను సమర్పించారు అలాగే ఇతర ఆధారాలను ఆయన పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో సమర్పించినట్లుగా తెలుస్తోంది. జల్ పల్లి లో ఉన్న మంచు మోహన్ బాబు నివాసంలోనే దాడి జరిగింది. ఆ ఇల్లు పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. దీంతో అక్కడ ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.
నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మంచు మనోజ్ - దాడి జరిగినట్లుగా ఆధారాలు సమర్పణ ?
ఆదివారం డయల్ 100కు మంచు మనోజ్ తో పాటు మంచు మోహన్ బాబు కూడా ఫోన్లు చేసి ఒకరికొకరు ఫిర్యాదులు చేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే తర్వాత పోలీసులు ఇంటికి వెళ్లేసరికి ఇద్దరూ ఆల్ హ్యాపీస్ అని చెప్పడంతో వచ్చేశారు. పహాడీ షరీఫ్ సీఐ కూడా మీడియాకు అదే చెప్పారు. ఆదివారం సాయంత్రం తర్వాత మంచు మనోజ్ ఆస్పత్రికి వెళ్ళి చికిత్స చేయించుకున్నారు. సోమవారం ఉదయం అంతా ఆయన జల్ పల్లి ఇంట్లోనే ఉన్నారు. మంచు లక్ష్మి కూడా వచ్చి మనోజ్ తో మాట్లాడినా ప్రయోజనం లేకపోయిదని తెలుస్తోంది. అయితే పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని తెలిపారు.
Also Read: మంచు హౌస్ దగ్గర బౌన్సర్లతో మనోజ్ - వెళ్లిపోయిన మోహన్‌బాబు- మ్యాటర్ మరింత సీరియస్ ?
వివాదాన్ని సెటిల్ చేసుకోవాలన్న ఆలోచనలో మోహన్ బాబు
కుమారుడితో వివాదాన్ని సెటిల్ చేసుకోవాలని మంచు మోహన్ బాబు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మాదాపూర్ లో మంచు మోహన్ బాబు కుటుంబసభ్యులు సినీ ఇండస్ట్రీలో వివాదాలను పరిష్కరించే పెద్ద మనిషిగా ప్రచారంలో ఉన్న చినశ్రీశైలం యాదవ్ సాయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆయన సమక్షంలో చర్చలు జరుగుతాయని అనుకుంటున్న సమయంలో మంచు విష్ణు పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. దాడి చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. మోహన్ బాబుపై కేసు నమోదయ్యే అవకాశం ఉంది.
అసలు వివాదం ఏమిటో బయటకు చెప్పని మంచు కుటుంబీకులు
అసలు మంచు కుటుంబంలో వివాదం ఏమిటో ఎవరికీ తెలియదు. తమ కుటంబంలో జరుగుతున్న వివాదంపై మంచు ఫ్యామిలీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎలాంటి వివాదం లేదని మాత్రం చెబుతున్నారు. ఆస్పత్రికి వచ్చిన మంచు మనోజ్ మీడియాతో మాట్లాడలేదు. ఆస్తుల వివాదంగానే ఎక్కువ మంది భావిస్తున్నారు. జల్ పల్లిలో మోహన్ బాబు నివాసంలోకి ఈ ఉదయం మోహన్ బాబు అనుమతించలేదని చెబుతున్నారు. దీంతో ఆయన బయటే చాలా సేపు గడిపిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.