Sasirekha Song Lyrics : శశిరేఖ, ప్రసాద్ క్యూట్ లవ్ సాంగ్ - యురేఖా... నిజంగా కేక పుట్టించే లిరిక్స్
Sasirekha Song : మెగాస్టార్ చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' నుంచి రెండో సింగిల్ క్యూట్ లవ్ సాంగ్ 'శశిరేఖ' వచ్చేసింది. క్యూట్ లిరిక్స్, లవ్ మూమెంట్స్ నయన్, చిరు అదరగొట్టారు. సాంగ్ లిరిక్స్ మీకోసం...

Mana Shankara Varaprasadgaru Chiranjeevi's Sasirekha Song Lyrics : మెగాస్టార్ చిరంజీవి, స్టార్ హీరోయిన్ నయనతార జంటగా నటిస్తోన్న లేటెస్ట్ మాస్ కామెడీ ఎంటర్టైనర్ 'మన శంకరవరప్రసాద్ గారు' నుంచి లవ్ సాంగ్ 'శశిరేఖ' వచ్చేసింది. చిరు, నయన్ క్యూట్ లవ్ మూమెంట్స్‌తో అదరగొట్టగా... శశిరేఖకు తన లవ్‌ను క్యూట్‌గా ఎక్స్ ప్రెస్ చేశాడు ప్రసాద్. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా... భీమ్స్ సిసిరోలియో, మధు ప్రియ పాడారు. భీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్‌గానూ చేస్తున్నారు. మరి ఆ క్యూట్ సాంగ్ లిరిక్స్ మీ కోసం...
'శశిరేఖ' సాంగ్ లిరిక్స్
పల్లవి
శశిరేఖా..ఆ..ఆ..ఆ ఓ మాట చెప్పాలి చెప్పాక ఫీలు కాక..ఆ..ఆ..ఆ
ఓ ప్రసాదూ... మోమాటల్లేకుండా చెప్పేసెయ్ ఏమి కాదూ...ఊ...ఊ...ఊ...
ఓ శశిరేఖ నీ చుట్టూ బిలియన్స్... నావన్నీ ఈఎంఐస్‌స్‌స్‌స్...
ఓ ప్రసాదూ... పైసల్లో ఏముందోయ్ నీకుంది మంచి మనసు...
చరణం 1
మహల్లోన నీకు కిరాయి ఇల్లు ఇరుకు...
ఇల్లల్లోన కాదు ప్రేమ పంచే గుండెల్లోన ప్లేసు చాలు నాకు
ఏయ్... యురేఖ నువ్వు కేక... భలే బాగుంది రేఖ..
రియాలిటీ చూస్తు ఉంటే భయంగా ఉంది ఇంక...
ప్రసాదూ ఓ ప్రసాదూ కమాన్ ఏ టెన్షనొద్దూ...
ఎవ్రీథింగ్ చూసుకుంటా... పిప్పీ డుమ్ డుమ్‌లు కొట్టు...
చరణం 2
హే సిద్ధంగున్న పెళ్లామా... సిగ్నల్ ఇచ్చెయ్ చాలమ్మా...
కొండమీది కోహినూరు కావాలా... జంగిలెల్లి జాగువారు తేవాలా...
కానుకలొద్దోయ్ శ్రీవారు... లొంగను వాటికి నో ప్యారూ...
చెప్పినట్టు టైముకొస్తే చాలంట... అంతకన్నా మంచి గిఫ్ట్ ఏంటంటా...
పద పద పద పద పరుగున పద పద నేనే నీ ట్యాక్సీ
చక చక చక చక జతపడి మనమిక చుడదాం గెలాక్సీ
అటు ఇటు ఇటు అటు ఇటు అటు అటు ఇటు తిరుగుడులొద్దయ్యో...
నీ భుజాలపై ప్రయాణమే చేసే ఛాన్సు చాలయ్యో...
హేయ్... యురేఖ నువ్వు కేక... భలేగా ఉంది రేఖ...
మిరాకిల్ అంచుదాకా... ఛలో పోదాము ఇంకా... ఆ... ఆ.. ఆ
ప్రసాదూ... ఓ ప్రసాదూ... కమాన్ యహే మాటలొద్దు...
ఇలా ఈ లైఫ్ లాంగూ... ఇదేలా లైక్ కొట్టు...
ఓ శశిరేఖా... ఆ... ఆ.. ఆ... ఓ ప్రసాదూ....
Also Read : ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ వాయిదా - క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్... 'అఖండ 2' రిలీజ్ వాయిదాపై రియాక్షన్
ఫస్ట్ సాంగ్ 'మీసాల పిల్ల' ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. దాన్ని మించేలా 'శశిరేఖ' సాంగ్ సైతం ఉంది. చిరు నయన్ స్టెప్పులు, లవ్ సాంగ్ లిరిక్స్ అదిరిపోయాయంటూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా... చిరు, నయన్‌లతో పాటు విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే, కేథరిన్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సంక్రాంతికి మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.





















