Chiru Bobby 2: చిరంజీవి సరసన 'ది రాజా సాబ్' హీరోయిన్... ఈసారి ఒక్కరు కాదు, ఇద్దరు!
Chiranjeevi Bobby Second Film Details: మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన ఫ్యాన్ బాబీ కొల్లి మరో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. అందులో ఓ హీరోయిన్ ఛాన్స్ 'ది రాజా సాబ్' బ్యూటీకి దక్కిందట.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా ఆయన వీరాభిమానులలో ఒకరైన బాబి కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహించిన సినిమా 'వాల్తేరు వీరయ్య'. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో మరో సినిమా (Chiru Bobby 2 Movie) రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఓ హీరోయిన్ ఛాన్స్ 'ది రాజా సాబ్' (The Raja Saab) బ్యూటీకి దక్కిందట.
చిరంజీవికి జంటగా మాళవిక!
రెబల్ స్టార్ ప్రభాస్ హారర్ థ్రిల్లర్ సినిమా 'ది రాజా సాబ్' సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అందులో మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్ ఒకరు. ఆమె నటించిన సినిమాలు కొన్ని తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. అయితే మాళవిక ఫస్ట్ తెలుగు సినిమా 'ది రాజా సాబ్'. సంక్రాంతి 2026కి విడుదల కానుంది. అంతకు ముందు తెలుగులో తన రెండో సినిమా స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతోంది.
బాబీ దర్శకత్వంలో చిరంజీవి సరసన నటించే అవకాశాన్ని మాళవిక మోహనన్ అందుకుంది. అయితే ఆమెది సెకండ్ హీరోయిన్ రోల్ అని టాక్. 'వాల్తేరు వీరయ్య' సినిమాలో చిరంజీవి సరసన ఒక్క హీరోయిన్ మాత్రమే ఉంది. ఆ రోల్ శృతి హాసన్ చేశారు. అయితే ఈసారి బాబీ ఇద్దరు హీరోయిన్లు ఉన్న కథ రాశారట. సెకండ్ లీడ్ ఛాన్స్ మాళవిక అందుకున్నారు మరి ఫస్ట్ లీడ్ ఛాన్స్ ఎవరికీ దక్కుతుందో చూడాలి.
Also Read: ఓటీటీలోకి రవితేజ కుమార్తె ఎంట్రీ... హీరోయిన్ కాదండోయ్ - మరి ఏం చేశారో తెలుసా?
View this post on Instagram
బాబీ సినిమా కంటే ముందు మరో మూడు!
Chiranjeevi Upcoming Movies 2026: ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాలో మెగాస్టార్ నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది. దీనికి ముందు వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో 'విశ్వంభర' చిత్రీకరణ పూర్తి చేశారు. ఆ సినిమా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి.
అనిల్ రావిపూడి సినిమా పూర్తి అయ్యాక మరో అభిమాని శ్రీకాంత్ ఓదెల సినిమా స్టార్ట్ అవుతుందని అందరూ భావించారు. ఆ సినిమా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అయితే ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నానితో 'ది పారడైజ్' చేస్తున్నారు శ్రీకాంత్ ఓదెల. ఆ సినిమా పూర్తి అయ్యాక చిరుతో సినిమా చేయనున్నారు. మధ్యలో బాబి కొల్లి సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read: హిందీలో 'సంక్రాంతికి వస్తున్నాం' రీమేక్... అక్కడ వెంకటేష్ రోల్ చేసే హీరో ఎవరో తెలుసా?





















