అన్వేషించండి

NTR Neel Movie Update : ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ బర్త్‌డే సర్‌ప్రైజ్ - ప్రశాంత్ నీల్ సినిమాపై అదిరిపోయే అప్డేట్

Jr NTR Birthday: ఎన్‌టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘దేవర’ నుంచి ఏదైనా అప్డేట్ రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఊహించారు. కానీ అనూహ్యంగా ప్రశాంత్ నీల్‌తో తను చూసే మూవీ నుంచి అప్డేట్ విడుదలయ్యింది.

NTR Neel Movie Update: ‘ఆర్ఆర్ఆర్’ లాంటి ప్యాన్ ఇండియా మూవీ తర్వాత ఎన్టీఆర్ రేంజే మారిపోయింది. అప్పటినుంచి తనకు ఇతర భాషా ప్రేక్షకులు కూడా ఫ్యాన్స్ అవ్వడం మొదలుపెట్టారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్‌ను అసలు స్క్రీన్‌పై చూడకపోవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. కానీ ఎన్‌టీఆర్ మాత్రం లైన్‌లో రెండు ప్యాన్ ఇండియా చిత్రాలతో సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే కొరటాల శివతో కలిసి ‘దేవర’ మూవీ చేస్తుండగా.. ప్రశాంత్ నీల్ లాంటి మరో యాక్షన్ డైరెక్టర్‌ను కూడా లైన్‌లో పెట్టాడు ఎన్‌టీఆర్. ఇక ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ నుంచి అప్డేట్ బయటికొచ్చింది.

షూటింగ్ అప్పుడే..

ఫ్యాన్స్ అంతా ఎన్‌టీఆర్‌ను ప్రేమగా మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అని పిలుచుకుంటారు. ఇక ఎలాంటి హీరోను అయినా ఒక రేంజ్ మాస్ ఎలివేషన్స్‌తో ఎలివేట్ చేసి ఆకట్టుకుంటాడు ప్రశాంత్ నీల్. అలాంటి ఎన్‌టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లోని సినిమా అనగానే ఫ్యాన్స్ అంతా చాలా ఎగ్జైట్ అయ్యారు. కాంబినేషన్‌లో మూవీ ఉంటుందని చెప్తూ ఎన్‌టీఆర్, ప్రశాంత్ నీల్ కలిసి ఒక ఫోటోను విడుదల చేశారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఎన్‌టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ వర్కవుట్ అయ్యింది అని అర్థమయ్యేలా షూటింగ్ అప్డేట్‌ను అందించారు మేకర్స్.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NTR Arts (@ntrartsoffl)

ఊహించని అప్డేట్..

‘హ్యాపీ బర్త్‌డే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్‌టీఆర్. #ఎన్‌టీఆర్‌నీల్. 2024 ఆగస్ట్‌లో షూటింగ్ మొదలవుతుంది’ అని ఎన్‌టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీపై అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అయితే ఎన్‌టీఆర్ పుట్టినరోజు కాబట్టి ‘దేవర’ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ప్రశాంత్ నీల్‌తో చేసే సినిమాపై అప్డేట్ రావడంతో ఫ్యాన్స్‌కు డబుల్ హ్యాపీనెస్ అందినట్టు అయ్యింది. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను ఫైన‌ల్ చేస్తున్నారని తెలుస్తోంది. ‘కేజీఎఫ్’, ‘సలార్’లాంటి చిత్రాలను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో.. ఇది ‘దేవర’కు మించి ఉండవచ్చని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు.

క్రేజ్‌కు తగ్గకుండా..

ప్రస్తుతం అన్నీ భాషా ఇండస్ట్రీల్లో ఎన్‌టీఆర్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ మూవీని తెరకెక్కించనున్నాడట ప్రశాంత్ నీల్. ఈ హీరో క్రేజ్‌కు మించేలా సినిమా ఉంటుందని సమాచారం. ఇప్పటికీ ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవ్వకపోయినా కూడా ఫ్యాన్స్ అంతా ఈ సినిమాపై చాలా ధీమాతో ఉన్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై ఈ సినిమా రూపొంద‌నుంది. ఎన్‌టీఆర్, నీల్ సినిమా ఓ రేంజ్‌లో ప్రేక్షకులకు సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుందట. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ‘దేవ‌ర‌’, ‘వార్ 2’ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్టుల‌ను పూర్తి చేసుకున్న త‌ర్వాత ఆయ‌న ప్ర‌శాంత్ నీల్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడు.

Also Read: ఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ 5 బెస్ట్ లుక్స్ - ఆ మేకోవర్, స్టైలింగ్‌కు విమర్శకులూ సైలెంట్

టాప్ హెడ్ లైన్స్

Kotha Soku Lyrics: కొత్త సోకు లిరిక్స్... 'పళ్ళబురుసు'లో పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్... సురేష్ గంగుల సాహిత్యం సూపర్
కొత్త సోకు లిరిక్స్... 'పళ్ళబురుసు'లో పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్... సురేష్ గంగుల సాహిత్యం సూపర్
Ramayana Trailer : రామాయణ ట్రైలర్ రిలీజ్ వాయిదా - అసలు రీజన్ ఏంటో చెప్పిన ప్రొడ్యూసర్
రామాయణ ట్రైలర్ రిలీజ్ వాయిదా - అసలు రీజన్ ఏంటో చెప్పిన ప్రొడ్యూసర్
Love Oh Love OTT: 'లవ్ ఓ లవ్' ఓటీటీ రిలీజ్ డేట్... మూడు వారాలకే ధనుష్ మేనల్లుడి సినిమా స్ట్రీమింగ్... ఎందులోనంటే?
OTT Movie: నాగదుర్గ లేటెస్ట్ సినిమా... మూడు వారాలకే ఓటీటీలోకి, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Purushaha OTT : ఓటీటీలోకి సడన్‌గా లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ పురుషః - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సడన్‌గా లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ పురుషః - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
జీవితంలో మొదటి కారు కొనేవారికి మహీంద్రా XUV 3XO ఎందుకు ఉత్తమ ఎంపిక?, రూ.10 లక్షల్లో వచ్చేస్తుంది
రూ.10 లక్షల బడ్జెట్‌లో ఫస్ట్‌ కార్‌ కొనాలనుకుంటున్నారా? డిజైర్‌, నెక్సాన్‌, పంచ్‌, XUV 3XOలో బెస్ట్ ఛాయిస్ ఇదే!
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Embed widget