Mahesh Babu: తండ్రిని తలచుకుని మహేష్ బాబు భావోద్వేగం - ఈ ఫొటోలు చూస్తే కన్నీళ్లు ఆగవు
సూపర్ స్టార్ కృష్ణ మరణించి ఏడాది పూర్తి కావడంతో మహేశ్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో కొత్త కొత్త టెక్నాలజీలను తీసుకొచ్చి అప్పట్లో ఉన్న సీనియర్ హీరోలకు పోటీ ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూసి ఏడాది అయ్యింది. తన తండ్రిని కోల్పోయి ఏడాది కావడంతో మహేశ్ బాబు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పోస్ట్ చేశారు. మహేశ్ బాబుతో పాటు తన తండ్రి నమత్ర, కొడుకు, కూతురు కూడా కృష్ణను గుర్తుచేసుకున్నారు. కృష్ణ జ్ఞాపకార్థం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో మహేశ్ బాబు.. తన కుటుంబంతో సహా పాల్గొన్నాడు. మహేశ్ బాబుతో పాటు కృష్ణ అభిమానులు కూడా ఆయనను మరోసారి గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు.
View this post on Instagram
మిస్ అవుతున్నాం..
ముందుగా మహేశ్ బాబు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మిమ్మల్ని మిస్ అయ్యి ఒక సంవత్సరం. ఇప్పటికీ, ఎప్పటికీ సూపర్‌స్టార్’ అంటూ తన తండ్రితో పాటు, తల్లి ఫోటోలను పోస్ట్ చేశాడు. ఇక తన భార్య నమత్ర అయితే తాజాగా జరిగిన జ్ఞాపకార్థం సమావేశంలోని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘మేము మిమ్మల్ని మిస్ అవుతున్నాం మామయ్య గారు. మీరు ఎప్పటికీ మా ఆలోచనల్లో, ప్రార్థనల్లో నిలిచే ఉంటారు. మీ ఆత్మకు ఇలాగే శాంతి చేకూరాలి. మీరు మాకు ఇచ్చిన ప్రేమను ఇలాగే పంచుకుంటూ మిమ్మల్ని మా జ్ఞాపకాల్లో నిలుపుకుంటాం’ అని క్యాప్షన్‌తో తనకు కృష్ణ అంటే ఎంత అభిమానమో బయటపెట్టింది నమ్రత.
View this post on Instagram
ఇప్పటికీ, ఎప్పటికీ సూపర్ స్టార్..
ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే కాదు.. ట్విటర్‌లో కూడా కృష్ణ గురించి పోస్ట్ చేశాడు మహేశ్ బాబు. తన తండ్రి పాత ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘ఇప్పటికీ, ఎప్పటికీ సూపర్ స్టార్’ అని క్యాప్షన్ ఇచ్చాడు. 2022 నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. గతేడాది తన పర్సనల్ లైఫ్‌లో ఎన్నో దెబ్బలు తిన్నాడు మహేశ్. ముందుగా 2022 మొదట్లో తన అన్నను కోల్పోగా.. ఆ తర్వాత కొన్నిరోజులకే తన తల్లి ఇందిరమ్మ కన్నుమూశారు. తల్లి మరణించిన కొన్నిరోజులకే కృష్ణ కూడా కన్నుమూశారు. కృష్ణ మరణం కేవలం ఘట్టమనేని కుటుంబానికి మాత్రమే కాదు.. తెలుగు సినీ పరిశ్రమకు కూడా తీరని లోటుగా మారింది.
Superstar, always and forever ♥️ pic.twitter.com/bGSKi8TjPm
— Mahesh Babu (@urstrulyMahesh) November 15, 2023
కృష్ణ జ్ఞాపకార్థం విగ్రహం..
సూపర్ స్టార్ కృష్ణకు రెండు రాష్ట్రాల్లోనూ అభిమానులు ఉన్నారు. అందుకే చాలా ప్రాంతాల్లో కృష్ణ విగ్రహాలు ఉన్నాయి. తాజాగా ఈ హీరో మరణించి సంవత్సరం కావస్తుండడంతో విజయవాడలో తన విగ్రహాన్ని ఆవిష్కరించారు. తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ చేతుల మీదుగా ఈ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ విగ్రహావిష్కరణ గురించి కూడా మహేశ్ బాబు తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు కమల్ హాసన్‌కు, ఈ ఈవెంట్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించిన ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మహేశ్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీని 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఇక తాజాగా ఇందులో నుండి విడుదలయిన ‘దమ్ మసాలా బిర్యానీ’ పాట మహేశ్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులందరినీ విశేషంగా ఆకట్టుకుంది.
Also Read: లారీపై నుంచి కిందపడ్డ విశ్వక్ సేన్ - ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ షూటింగ్‌లో అపశృతి