అన్వేషించండి

Devil Movie: ‘డెవిల్‘ మ్యూజికల్ జర్నీ షురూ, ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'డెవిల్'. ఈ సినిమాకు సంబంధించిన మేకర్స్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

వైవిధ్య‌మైన సినిమాల‌ను చేస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న నందమూరి కల్యాణ్ రామ్, గోల్డెన్ బ్యూటీ సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘డెవిల్‘. న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. దేశానికి స్వాతంత్య్రం రాక ముందు, అంటే 1940 కాలంలో చిత్ర కథ సాగుతుంది. ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. నవంబర్ 24న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాలు షురూ చేశారు మేకర్స్.

‘డెవిల్’ మ్యూజికల్ జెర్నీ షురూ

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి మ్యూజికల్ జర్నీ షురూ అయినట్లు మేకర్స్ ప్రకటించారు. అందులో భాగంగానే ఫస్ట్ సింగిల్ విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. ‘మాయే చేసెయ్..’ అంటూ సాగే పాటకు సంబంధించిన ప్రోమోను రేపు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. సిధ్ శ్రీరామ్, సత్య ఆర్ వీ ఈ పాటను పాడగా, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ స్వరాలు సమకూర్చారు. ఫుల్ సాంగ్ ను సెప్టెంబర్ 19న విడుదల చేయనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Icon Music South (@iconmusicsouth)

ఆకట్టుకున్న సంయుక్త ఫస్ట్ లుక్  

ఇక నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌ తో కలిసి సంయుక్త మీనన్ ఈ సినిమాలో నటిస్తోంది.  సెప్టెంబ‌ర్ 11న  ఆమె పుట్టిన రోజు జరుపుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఆమెకు అదిరిపోయే గిఫ్ట్ అందించింది. ఈ చిత్రంలో సంయుక్త పోషించిన నైష‌ధ పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. కొబ్బ‌రికాయ‌, పువ్వులు తీసుకుని గుడిలో పూజకు వెళుతున్న అమ్మాయిగా ప్లెజంట్‌ లుక్‌లో ఆకట్టుకుంది. సంయుక్త పదహారణాల తెలుగమ్మాయిలా ఉందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.  చుట్టూ ఆలయాలు, పక్కనే ఎగురుతున్న పావురాలు మరింత అందంగా అందాన్ని తీసుకొచ్చాయి.  

న‌వంబ‌ర్ 24న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

‘డెవిల్’ చిత్రంలో ఎవ‌రికీ అంతు చిక్క‌ని ఓ ర‌హ‌స్యాన్ని ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్  ఆక‌ట్టుకోబోతున్నారు.  పాన్ ఇండియా లెవల్లో తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ‘డెవిల్’ సినిమా విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. న‌వంబ‌ర్ 24న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. దేవాన్ష్ నామా స‌మ‌ర్ప‌కుడిగా.. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే, క‌థ‌ను అందించారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశారు.

Read Also: కొత్త వ్యాపారంలోకి అక్కినేని హీరో, హైద‌రాబాద్ బ్లాక్‌ బ‌ర్డ్స్ టీమ్ కొనుగోలు

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP: 'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Fake Court Order Scam: మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP: 'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Fake Court Order Scam: మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
Anantapur News: అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
China Bullet Train: ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
Embed widget