అన్వేషించండి

Manchu Vishnu: చెప్పినట్టే చేసిన 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు - ఐదు యూట్యూబ్‌ ఛానళ్లు రద్దు చేసినట్టు వెల్లడి, అవేంటంటే..

Manchu Vishnu: 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు పలు యూబ్యూట్‌ ఛానళ్లపై చర్యలు తీసుకున్నారు. నటీనటులను ట్రోల్‌ చేస్తూ చేసిన వీడియోను తొలగించాలని లేదంటే రద్దు చేయిస్తానని హెచ్చరించిన సంగతి తెలిసిందే.

MAA Take Action on Youtube Channels and Terminated: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు చెప్పినట్టు చేశారు. నటీనటులు, హీరోహీరోయిన్లను ట్రోల్‌ చేస్తు చేసిన వీడియోలు, మీమ్స్‌ని తొలగించాలని రీసెంట్‌గా మంచు విష్ణు యూట్యూబ్‌ ఛానళ్లను కోరిన సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియా కీచకుడు ప్రణీత్‌ హనుమంతు వివాదంపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా మంచు విష్ణు వీడియో రిలీజ్‌ చేస్తూ.. సభ్యసమాజం తలదించుకునే చర్యలకు పాల్పడటం కరెక్ట్‌ కాదనన్నారు.

నటీనటులను ఉద్దేశిస్తూ తరచూ ఎన్నో ట్రోలింగ్‌ వీడియో, కామెంట్స్‌ చేసిన పోస్ట్స్‌ తీసేయాలని కూడా సూచించారు. ఈ వీడియో రిలీజ్‌ చేసిన 48 గంటల్లోగా ఆ పోస్ట్స్‌ తొలగించకుంటే సైబల్‌ సెక్యూరిటీ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, సదరు యూట్యూబ్‌ ఛానళ్లపై బ్యాన్‌ విధిస్తామని కూడా హెచ్చరించారు. చెప్పినట్టుగానే తాజాగా 'మా'(MAA) అధ్యక్షుడిగా మంచు విష్ణు యూట్యూబ్‌ ఛానళ్లపై చర్యలు తీసుకున్నారు. ఐదు చానళ్లను బ్యాన్‌ చేసినట్టు MAA ట్విటర్‌ ఖాతాలో తాజాగా పోస్ట్‌ చేశారు. 

"అణచివేత మొదలైంది. నటీనటులు, వారి కుటుంబాలను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తూ అవమానకరమైన రీతిలో ట్రోల్‌చేస్తూ పోస్టు చేసిన ఐదు యూట్యూబ్‌ ఛానళ్లు రద్దు చేయబడ్డాయి. ఇది ప్రారంభం మాత్రమే. ఈ అణచివేత కొనసాగుతూనే ఉంటుంది. మరిన్ని చానళ్లపై కూడా చర్యలు తీసుకోబోతున్నాము. వాటికి సంబంధించిన జాబితాను కూడా త్వరలోనే విడుదల చేస్తాం. అప్పటి వరకు మరిన్ని అప్‌డేట్స్‌ కోసం వెయిట్‌ చేస్తూ ఉండండి" అంటూ ట్వీట్‌ మా అసోసిషియేన్‌ తమ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఈ మేరకు మన ఆర్టిస్టులను గౌరవించండి అటూ హ్యాష్‌ ట్యాగ్‌ను కూడా జత చేశారు. అదేవిధంగదా తమ నెక్ట్స్‌ పోస్ట్‌లో నిషేధం విధించిన సదరు యూట్యూబ్‌ చానళ్లను జాబితాను కూడా విడుదల చేసింది. అవేంటంటే..

Terminated Channels:
1.  Just Watch BBC https://youtube.com/@JustWatchBBC
2. Trolls Raja https://youtube.com/@trollsraja1242
3. Bachina Lalith https://youtube.com/@BachinaViews
4. Hyderbad Kurradu https://youtube.com/@hydkurradu951
5. xyzeditz007 https://youtube.com/@xyzeditz007

కాగా ఇటీవల ప్రణీత్‌ హనుమంతు అనే యూట్యూబ్‌ తండ్రి కూతుళ్ల వీడియోపై అసభ్యకర రీతిలో తన స్నేహితులతో కలిసి తన చానళ్లలో చర్చ జరిపిన సంగత తెలిసిందే. సభ్యసమాజం సిగ్గుపడే విధంగా తండ్రికూతుళ్ల అనుబంధంపై అనుచిత వ్యాఖ్యలు చేసి జైలు పాలు అయ్యాడు. రెండేళ్ల చిన్నారి ఇంటికి వచ్చిన తన తండ్రి దగ్గరకు అప్యాయంగా పెరుగెత్తుకుంటూ వెళుతుంది. అయితే ఆ తండ్రి కాసేపు సీరియస్‌గా చూసి తన నడుముకు ఉన్న బెల్ట్‌ తీసి కూతురిని ఊయల ఊపుతాడు. ఇదే వీడియోను ప్రణీత్ హనుమంతు, అతడి స్నేహితులు కలిసి అసభ్యకరమైన రితీలో లైంగిక చర్యలను ఆపాదిస్తూ కామెంట్స్‌ చేశారు. ఇది వీడియోపై స్పందిస్తూ దానిని ఖండించిన మంచు విష్ణు ఈ సందర్భంగా నటీనటులను ట్రోల్ చేసిన యూబ్యూబ్ ఛానళ్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. 

Also Read: ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌ల విడాకులు ఖాయమా? - అంబానీ పెళ్లిలో బయటపడ్డ మనస్పర్థలు! భర్తకు దూరంగా ఐష్‌

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా

వీడియోలు

Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Team India worst performance | 200 టార్గెట్ అంటే హడలెత్తిపోతున్న టీమిండియా | ABP Desam
సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
RBI Summer Internship: విద్యార్థుల కోసం RBI పెయిడ్ ఇంటర్న్‌షిప్, చివరి తేదీ ఇదే.. రూ.20 వేలు స్టైఫండ్
విద్యార్థుల కోసం RBI పెయిడ్ ఇంటర్న్‌షిప్, చివరి తేదీ ఇదే.. రూ.20 వేలు స్టైఫండ్
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Parvathi Reddy: మెస్సీ టూర్ చీఫ్ ప్యాట్రన్ పార్వతీరెడ్డి - ఈమె ఎవరంటే?
మెస్సీ టూర్ చీఫ్ ప్యాట్రన్ పార్వతీరెడ్డి - ఈమె ఎవరంటే?
Best in EV Scooters: ఈవీ స్కూటీల అమ్మకాల్లో దుమ్మురేపుతోన్న TVS.. ఓలా, బజాజ్ లను వెనక్కి నెట్టి నెంబర్ 1గా..
ఈవీ స్కూటీల అమ్మకాల్లో దుమ్మురేపుతోన్న TVS.. ఓలా, బజాజ్ లను వెనక్కి నెట్టి నెంబర్ 1గా..
Embed widget