Sarkaru Vaari Paata: ‘మ మ మహేషా’ - ‘సర్కారు వారి పాట’లోని ఫుల్ సాంగ్ వచ్చేసింది చూశారా?

‘సర్కారు వారి పాట’లోని మరో మాస్ సాంగ్ వచ్చేసింది. ఈ సారి మహేష్, కీర్తి సురేష్ ఊరమాస్ స్టెప్పులతో దుమ్ము దులేపేస్తున్నారు.

FOLLOW US: 

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్‌లో 'సర్కారు వారి పాట' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్, పోస్టర్స్ విడుదల కాగా.. అవి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మే 12న సినిమాను విడుదల చేయబోతున్నారు. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే సినిమా నుంచి మూడు పాటలను విడుదల చేశారు. 'కళావతి', 'పెన్నీ సాంగ్', టైటిల్ సాంగ్ అన్నీ కూడా ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి.

ఇప్పుడు సినిమా నుంచి నాల్గో పాటను విడుదల చేశారు. 'మ.. మ.. మహేషా..' అంటూ సాగే ఈ పాటను శనివారం రాత్రి యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ విషయాన్ని మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇప్పటికే ఈ పాట సాంగ్ ప్రోమో, పోస్టర్‌లు యూట్యూబ్‌లో దుమ్ములేపుతున్నాయి. ఈ లెరికల్ సాంగ్‌లో మరికొన్ని డ్యాన్స్ సీన్స్, మేకింగ్ సీన్స్ చూపించారు. మహేష్ బాబు, కీర్తి సురేష్ మాస్ స్టెప్పులు చూసి అభిమానులు థియేటర్లలో రెచ్చిపోవడం ఖాయం అనిపిస్తోంది.

Also Read: ఇలాంటి మహేష్‌బాబుని ఇప్పటి వరకు చూడలేదు... సర్కారు వారి పాట ఈవెంట్‌లో సుకుమార్ మాటలివే!

‘సర్కారు వారి పాట’ ఈవెంట్ ప్రస్తుతం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరుగుతోంది. మహేష్ బాబుతో సినిమాలు తీసిన ప్రముఖ దర్శకులు, ‘సర్కారు వారి పాట’లో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

View this post on Instagram
 
A post shared by Mahesh Babu (@urstrulymahesh)

Published at : 07 May 2022 11:07 PM (IST) Tags: Mahesh Babu Sarkaru Vaari Paata Keerthy Suresh Sarkaru Vaari Paata Song Ma Ma Mahesha Song

సంబంధిత కథనాలు

NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు 

The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు 

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

టాప్ స్టోరీస్

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Tirumala News : తిరుమలకు పోటెత్తిన  భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!