అన్వేషించండి

Hamunam - Venkaiha Naidu: 'హనుమాన్' టీమ్‌పై వెంకయ్యనాయుడు ప్రశంసల వర్షం

Hanuman Movie: ఎలాంటి అంచనాలు లేవు. అందరూ 'హనుమాన్‌' చిన్న సినిమా అనే అనుకున్నారు. కానీ, రీలీజయ్యాకే తెలిసింది సత్తా. రికార్డుల మోత.. ప్రశంసల వర్షం.

Hamunam - Venkaiha Naidu: పెద్ద పెద్ద హీరోల సినిమాలతో పాటుగా, సంక్రాంతి బరిలో నిలిచారు 'హనుమాన్‌' టీమ్‌. రిలీజై మూడు వారాలు దాటినా ఇప్పటికీ ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేస్తోంది ఈ సినిమా. రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తోంది. అంతేకాదు.. ఎంతోమంది ప్రముఖుల ప్రశంసలు అందుకుంది ఈ సినిమా. ఇక ఇప్పుడు మాజీ ఉపరాష్ట్రపతి, పద్మవిభూషణ్‌ గ్రహీత వెంకయ్యనాయుడు ప్రశంసలు అందుకుంది చిత్ర బృందం. స్నేహితులతో కలిసి సినిమా చూసిన ఆయన ప్రశాంత్‌వర్మపై, చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. 

వెంకయ్యనాయుడు ప్రశంసలు

"హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోస్‌లో సోమవారం హనుమాన్ చలనచిత్రాన్ని స్నేహితులతో కలిసి వీక్షించాను.  దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. భారతీయ ఇతిహాస వీరుల్లో ఒకరైన శ్రీ ఆంజనేయస్వామి స్ఫూర్తిగా తెరకెక్కించిన ఈ చిత్రంలోని ప్రతిఘట్టం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు, గ్రాఫిక్స్ ఉన్నతంగా ఉన్నాయి. తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, ఇతర నటుల నటన ఆకట్టుకుంది. నిర్మాత  నిరంజన్ రెడ్డి గారికి, దర్శకుడు ప్రశాంత్ వర్మ కు, చిత్ర నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు." అని ఆయన ట్వీట్‌ చేశారు. 

రికార్డుల మోత

కుర్ర హీరో తేజ సజ్జ నటించిన ఈ చిత్రానికి ఎన్నో ప్రశంసలు వచ్చాయి. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వ ప్రతిభను ఎంతోమంది మెచ్చుకున్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, బాలకృష్ణ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సహా ఎంతోమంది ప్రముఖులు ఈసినిమా అద్భుతంగా ఉందంటూ చిత్రయూనిట్‌ని ప్రశంసించారు. స్వయంగా కలిసి వాళ్లను అభినందించారు. 

'హనుమాన్‌' సినిమా ఆద్యంతం ఒక అద్భుతం అనే చెప్పాలి. ప్రతి సీన్‌ ప్రేక్షకుడికి విజువల్‌ ఫీస్ట్‌. ఆంజనేయుడు కనిపించిన ప్రతిసారి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా అద్భుతంగా ఉంది. అలాంటి పవర్‌ఫుల్‌సీన్లు చాలా చక్కగా చూపించారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. తక్కువ ఖర్చుతో అద్భతమైన గ్రాఫిక్స్‌ని రూపొందించి యంగ్‌ టాలెంట్‌ ఏంటో రుచి చూపించారు ప్రేక్షకులకి. అందుకే, ఇప్పటికీ థియేటర్లకు క్యూ కడుతున్నారు సినిమా లవర్స్‌. రిలీజై మూడు వారాలు దాటినప్పటికీ ఇప్పటికీ బాక్సాఫీస్‌ దగ్గర రికార్డులు తిరగరాస్తూనే ఉంది 'హనుమాన్‌'. 

జనవరి 12న సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాకు అనుకున్న సంఖ్యలో థియేటర్లు దొరకలేదు. తెలంగాణతో పాటు ఆంధ్రాలోనూ పరిమిత స్క్రీన్లలో రిలీజ్‌ అయ్యింది. తెలుగులో 450, హిందీలో 1500, ప్రపంచ వ్యాప్తంగా 2500 స్క్రీన్లలో సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ అందుకోవడంతో థియేటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇక ఇప్పుడు అంచనాలకు మించి సినిమా ముందుకు దూసుకుపోతోంది. రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తోంది. ఓవర్‌సీస్‌లో కూడా సినిమా వావ్‌! అనిపించేలా కలెక్షన్లు రాబడుతోంది. మూడోవారంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల జాబితాలో చేరిపోయింది 'హనుమాన్‌' బాహుబలి కలెక్షన్ల తర్వాత ఈ సినిమాకే అన్ని కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ సినిమా మూడో వారం తెలుగు రాష్ట్రాల్లోని కలెక్షన్లలో 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' సినిమాని కూడా బీట్‌ చేసింది. ఇక అంతేకాకుండా సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల్లో ఇప్పటి వరకు ఉన్న 'అల వైకుంఠపురం' సినిమా రికార్డులను కూడా బీట్‌ చేసింది 'హనుమాన్‌'.  

Also Read : ఆ విషయంలో ‘RRR’ని దాటేసిన 'హనుమాన్‌'

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jana Sena Party Membership Registration: జనసేనలో మూడు రకాల కార్యకర్తలు - సభ్యత్వ నమోదులో పవన్ కల్యాణ్ వినూత్న ఆలోచన
జనసేనలో మూడు రకాల కార్యకర్తలు - సభ్యత్వ నమోదులో పవన్ కల్యాణ్ వినూత్న ఆలోచన
JD Lakshmiranarayana: రాజకీయాలు, ఆశయాలు వదిలి ఉద్యోగంలోకి జేడీ లక్ష్మినారాయణ - సైబర్ మోసం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారా?
రాజకీయాలు, ఆశయాలు వదిలి ఉద్యోగంలోకి జేడీ లక్ష్మినారాయణ - సైబర్ మోసం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారా?
Nirmal Municipal Chairman: నిర్మల్‌లో భార్యాభర్తలే ఛైర్మన్, వైస్ ఛైర్మన్.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో చైర్మన్ల పూర్తి వివరాలు
నిర్మల్‌లో భార్యాభర్తలే ఛైర్మన్, వైస్ ఛైర్మన్.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో చైర్మన్ల పూర్తి వివరాలు
Nizamabad Mayor Election: నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ హస్తగతం.. మజ్లిస్‌కు డిప్యూటీ మేయర్ పదవి
నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ హస్తగతం.. మజ్లిస్‌కు డిప్యూటీ మేయర్ పదవి

వీడియోలు

India broke Australia T20 World Cup Record | ఆస్ట్రేలియా రికార్డును బద్దలు కొట్టిన భారత్
Pakistan Captain Salman comments on Ind vs Pak | ఓటమిపై పాక్ కెప్టెన్ సల్మాన్ కామెంట్స్
India vs Pakistan T20 World Cup Highlights | పాక్‌ను చిత్తు చేసిన భారత్
India vs Pakistan T20 World Cup Ishan Kishan | యువరాజ్ రికార్డును బద్దలు కొట్టిన ఇషాన్
BJP vs AIMIM Tippu sulthan Controversy | AIMIMపై రామచంద్ర రావు కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jana Sena Party Membership Registration: జనసేనలో మూడు రకాల కార్యకర్తలు - సభ్యత్వ నమోదులో పవన్ కల్యాణ్ వినూత్న ఆలోచన
జనసేనలో మూడు రకాల కార్యకర్తలు - సభ్యత్వ నమోదులో పవన్ కల్యాణ్ వినూత్న ఆలోచన
JD Lakshmiranarayana: రాజకీయాలు, ఆశయాలు వదిలి ఉద్యోగంలోకి జేడీ లక్ష్మినారాయణ - సైబర్ మోసం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారా?
రాజకీయాలు, ఆశయాలు వదిలి ఉద్యోగంలోకి జేడీ లక్ష్మినారాయణ - సైబర్ మోసం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారా?
Nirmal Municipal Chairman: నిర్మల్‌లో భార్యాభర్తలే ఛైర్మన్, వైస్ ఛైర్మన్.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో చైర్మన్ల పూర్తి వివరాలు
నిర్మల్‌లో భార్యాభర్తలే ఛైర్మన్, వైస్ ఛైర్మన్.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో చైర్మన్ల పూర్తి వివరాలు
Nizamabad Mayor Election: నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ హస్తగతం.. మజ్లిస్‌కు డిప్యూటీ మేయర్ పదవి
నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ హస్తగతం.. మజ్లిస్‌కు డిప్యూటీ మేయర్ పదవి
Bill Gates Amaravati Visit: ఏపీ సచివాలయంలో బిల్ గేట్స్, సీఎం చంద్రబాబుతో కీలక భేటీ
ఏపీ సచివాలయంలో బిల్ గేట్స్, సీఎం చంద్రబాబుతో కీలక భేటీ
Ideas of India 2026: ముంబై లో ఏబీపీ నెట్‌వర్క్ Ideas of India 2026 - ఫిబ్రవరి 27, 28 తేదీల్లో న్యూ వరల్డ్ ఆర్డర్ పై సమ్మిట్!
ముంబై లో ఏబీపీ నెట్‌వర్క్ Ideas of India 2026 - ఫిబ్రవరి 27, 28 తేదీల్లో న్యూ వరల్డ్ ఆర్డర్ పై సమ్మిట్!
Ring of Fire Eclipse : ఫిబ్రవరి 17న Ring of Fire సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా? టైమింగ్స్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే
ఫిబ్రవరి 17న Ring of Fire సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా? టైమింగ్స్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే
Men’s Fashion Guide : అబ్బాయిల కోసం బెస్ట్ షర్ట్-ప్యాంట్ కలర్ కాంబినేషన్స్.. మీటింగ్ నుంచి డేట్ వరకు
అబ్బాయిల కోసం బెస్ట్ షర్ట్-ప్యాంట్ కలర్ కాంబినేషన్స్.. మీటింగ్ నుంచి డేట్ వరకు
Embed widget