అన్వేషించండి

Hanuman 17days Collections: ఆ విషయంలో ‘RRR’ని దాటేసిన 'హనుమాన్‌'

Hanuman Records: ఎలాంటి అంచనాలు లేకుండా, తక్కవ బడ్జెట్‌తో అద్భుతమైన సీన్లతో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన సినిమా 'హనుమాన్‌'. ఇప్పుడు రికార్డ్‌లలో దూసుకుపోతోంది.

Hanuman Records: 'హనుమాన్‌' ఇప్పుడు ఏ ఇద్దరు సినిమా లవర్స్‌ మాట్లాడుకున్న ఈ మూవీ గురించే చర్చ. ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా సరే.. ప్రశాంత్‌వర్మ డైరెక్షన్‌ స్కిల్స్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. అంతలా ఆకట్టుకుంది 'హనుమాన్‌' సినిమా. అలానే కలెక్షన్ల సునామీ కొనసాగిస్తోంది ఈ సినిమా. బాక్సాఫీస్‌ దగ్గర తన సత్తా చాటుతూనే ఉంది. రికార్డులను బద్దలుకొడుతూ ముందుకు దూసుకుపోతోంది. 'హనుమాన్‌' సినిమా ఈ వారాంతంలో దాదాపు రూ.29 కోట్ల రూపాయలు కలెక్షన్లు రాబట్టింది. ఇక సినిమా మొత్తం కలెక్షన్లు రూ.254 కోట్లు దాటిపోయింది. 

'RRR' రికార్డు బద్దలు.. 

మూడోవారంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల జాబితాలో చేరిపోయింది 'హనుమాన్‌' బాహుబలి కలెక్షన్ల తర్వాత ఈ సినిమాకే అన్ని కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ సినిమా మూడో వారం తెలుగు రాష్ట్రాల్లోని కలెక్షన్లలో 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' సినిమాని కూడా బీట్‌ చేసింది. ఇక అంతేకాకుండా సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల్లో ఇప్పటి వరకు ఉన్న 'అల వైకుంఠపురం' సినిమా రికార్డులను కూడా బీట్‌ చేసింది 'హనుమాన్‌'. సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల కలెక్షన్లలో 8వ అతిపెద్ద సినిమాగా 'హనుమాన్‌' రికార్డులు సృష్టించింది. నార్త్‌ అమెరికాలో దాదాపు ఐదు మిలియన్ల కలెక్షన్స్‌ను క్రాస్‌ చేసింది 'హనుమాన్‌'. ఆ రీజన్‌లో ఇప్పటివరకు 'బాహుబలి 1, 2', 'ఆర్‌ ఆర్‌ ఆర్‌', 'సలార్‌' సినిమాలు మాత్రమే ఇంత రేంజ్‌లో కలెక్షన్లు రాబట్టగలిగయి. ఇకపోతే.. 'హనుమాన్‌'తో పోలిస్తే  ఆ సినిమాలన్నీ భారీ బడ్జెట్‌ సినిమాలు.

ఏరియావైజ్‌ కలెక్షన్లు ఇలా.. 

17వ రోజు ఏరియావైజ్‌ కలెక్షన్లు చూస్తే.. నిజామ్‌ రూ.30.10 కోట్లు, సీడిడ్‌ రూ.10.26కోట్లు, యూఏ రూ.9.08 కోట్లు, గుంటూరు రూ.5.03 కోట్లు, ఈస్ట్‌ రూ.5.93 కోట్లు, వెస్ట్‌ రూ.4.15 కోట్లు, కృష్ణ రూ.3.54 కోట్లు, నెల్లూరు రూ.1.86 కోట్లు, ఆర్‌వోఐ రూ.31 కోట్లు, ఓవర్‌ సీస్‌ రూ.26.90 కోట్లుగా ఉన్నాయి.

జనవరి 12న సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాకు అనుకున్న సంఖ్యలో థియేటర్లు దొరకలేదు. తెలంగాణతో పాటు ఆంధ్రాలోనూ పరిమిత స్క్రీన్లలో రిలీజ్‌ అయ్యింది. తెలుగులో 450, హిందీలో 1500, ప్రపంచ వ్యాప్తంగా 2500 స్క్రీన్లలో సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ అందుకోవడంతో థియేటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇక ఇప్పుడు అంచనాలకు మించి సినిమా ముందుకు దూసుకుపోతోంది. రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తోంది. ఓవర్‌సీస్‌లో కూడా సినిమా వావ్‌! అనిపించేలా కలెక్షన్లు రాబడుతోంది.

ఇక ఈ సినిమాకి సీక్వెల్‌గా 'జై హనుమాన్‌' తీస్తున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్‌ ప్రకటించింది. దానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు ప్రశాంత్‌ వర్మ. ఇక సీక్వెల్‌లో తేజ సజ్జ హీరో కాదని, హనుమాన్‌ హీరో అని చెప్పారు. మరి సకెండ్‌ పార్ట్‌లో హనుమాన్‌గా ఎవరు నటించబోతున్నారో అందరిలో ఉత్కంఠ నెలకొంది. లిమిటెడ్‌ బడ్జెట్‌లో భారీ విజువల్‌ ఫీస్ట్‌ని ప్రేక్షకుల ముందు ఉంచారు ప్రశాంత్‌ వర్మ. దీంతో ఇప్పుడు 'జై హనుమాన్‌' మీద ఇంతే భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. మరి ఇది ఎలా ఉండబోతుందో వేచి చూడాలి మరి.

Also Read: మరింత ఆలస్యంగా ఓటీటీలోకి 'హనుమాన్' - కారణం అదే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Director Maruthi : మారుతి నెక్స్ట్ ప్రాజెక్ట్ రెడీ - ది రాజాసాబ్ తప్పులు రిపీట్ కాకుండా... రామయ్య ఆశీస్సులతో...
మారుతి నెక్స్ట్ ప్రాజెక్ట్ రెడీ - ది రాజాసాబ్ తప్పులు రిపీట్ కాకుండా... రామయ్య ఆశీస్సులతో...
This Week OTT Movies : మంత్ ఎండ్ ఓటీటీ మూవీస్ సందడి - ఒకే రోజు 13 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి వెరీ స్పెషల్
మంత్ ఎండ్ ఓటీటీ మూవీస్ సందడి - ఒకే రోజు 13 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి వెరీ స్పెషల్
Youth Telugu Review - 'యూత్' రివ్యూ: ముగ్గురు అమ్మాయిలతో ప్రేమ... కెన్ కామెడీ సినిమా ఎలా ఉందంటే?
'యూత్' రివ్యూ: ముగ్గురు అమ్మాయిలతో ప్రేమ... కెన్ కామెడీ సినిమా ఎలా ఉందంటే?
Band Melam OTT : ఆ ఓటీటీలోకి బ్యాండ్ మేళం - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి బ్యాండ్ మేళం - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP PNG Subsidy: ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
US Iran War: ఇరాన్‌పై దాడులకు అమెరికా మరో 10 రోజులు బ్రేక్.. డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ ఏంటీ?
ఇరాన్‌పై దాడులకు అమెరికా మరో 10 రోజులు బ్రేక్.. డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ ఏంటీ?
Amaravati Politics: అమరావతికి రాజ్యాంగ రక్షణ- ఏపీ రాజకీయాల్లో చారిత్రక మలుపు - వైసీపీ విధానమేంటి?
అమరావతికి రాజ్యాంగ రక్షణ- ఏపీ రాజకీయాల్లో చారిత్రక మలుపు - వైసీపీ విధానమేంటి?
Hyderabad Traffic Diversions: నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు..!
నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు..!
Kaattan Series OTT : కొండపై తెగి పడిన తల ఎవరిది? - ఓటీటీలో విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ చూసెయ్యండి
కొండపై తెగి పడిన తల ఎవరిది? - ఓటీటీలో విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ చూసెయ్యండి
Maharashtra Minister Video: ట్రాన్స్‌‌జెండర్‌తో మహరాష్ట్ర మంత్రి వీడియో వైరల్.. రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్! మార్ఫింగ్ అని వివరణ
ట్రాన్స్‌‌జెండర్‌తో మహరాష్ట్ర మంత్రి వీడియో వైరల్.. రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్! మార్ఫింగ్ అని వివరణ
Watermelon Storage Tips : పుచ్చకాయను కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టొచ్చా? అలా తింటే మంచిదేనా?
పుచ్చకాయను కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టొచ్చా? అలా తింటే మంచిదేనా?
Tadipatri Crime News: బీర్ బాటిల్‌తో పోలీసులపై నిందితుడు దాడి- కాల్పులు జరిపి అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు
బీర్ బాటిల్‌తో పోలీసులపై నిందితుడు దాడి- కాల్పులు జరిపి అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు
Embed widget