Disha Patani : 'కల్కి' సెట్లో ప్రభాస్‌తో దిశా పటాని సెల్ఫీ - నెట్టింట వైరల్!
Disha Patani : హీరోయిన్ దిశా పటాని 'కల్కి' సెట్స్ లో ప్రభాస్ తో దిగిన సెల్ఫీ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Lovely selfie of Prabhas and Disha Patani from Kalki 2898 AD sets : యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కల్కి 2898AD'. ప్రభాస్ నుంచి వస్తున్న ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడూ ఈ సినిమాలో దీపికా పదుకొనే, దిశా పటాని, కమలహాసన్, అమితాబచ్చన్ సహా పలువురు బిగ్ స్టార్స్ భాగం అవుతుండడంతో ఆడియన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. కాగా రీసెంట్ గా ఇటలీలో ఈ మూవీకి సంబంధించి ఓ సాంగ్ ని షూట్ చేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించి మూవీ టీం ఓ రెండు ఫోటోలను కూడా విడుదల చేశారు. అయితే తాజాగా హీరోయిన్ దిశా పటాని అదే షెడ్యూల్ కు సంబంధించి మరికొన్ని ఫోటోలు, వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
'కల్కి' సెట్స్ లో ప్రభాస్‌తో దిశా పటాని సెల్ఫీ
హీరోయిన్ దిశా పటాని తన ఇన్ స్టాగ్రామ్ లో 'కల్కి' మూవీ ఇటలీ షెడ్యూల్ కు సంబంధించి కొన్ని ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. ఆమె షేర్ చేసిన ఫోటోల్లో అందమైన ల్యాండ్స్ స్కెప్స్, బీచ్, సిటీ అంతా కనిపిస్తోంది. ఆ ఫోటోల్లోనే ప్రభాస్ తో దిశాపటాని దిగిన ఓ సెల్ఫీ కూడా ఉంది. ఈ సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా ఫుల్ వైరల్ అవుతుంది. ఇందులో దిశా పటాని, ప్రభాస్ ఇద్దరూ నవ్వుతూ సెల్ఫీ దిగడం ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సెల్ఫీ పిక్ లో ప్రభాస్ తలపై బ్లాక్ క్యాప్, హ్యాష్ కలర్ హుడీ ధరించి తన స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ సెల్ఫీ పిక్ ని డార్లింగ్ ఫాన్స్ సోషల్ మీడియా అంతటా తెగ షేర్ చేస్తున్నారు.
View this post on Instagram
మే 9 రిలీజ్ లేనట్లే
'కల్కి 2898AD' సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ మే 9న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ గతంలో ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే అదే సమయంలో ఏపీ ఎలక్షన్స్ రావడంతో తాజాగా సినిమాని పోస్ట్ పోన్ చేయడానికి మేకర్ సిద్ధమైనట్లు ఫిలిం సర్కిల్స్ లో టాప్ వినిపిస్తోంది. మే 9 నుంచి వాయిదా వేస్తూ ప్రభాస్ 'బాహుబలి' రిలీజ్ డేట్ అయిన జూలై 10న లేక మే 31న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండిట్లో ఫైనల్ గా ఏ డేట్ కి ఫిక్స్ అవుతారనేది చూడాలి. కాగా కల్కి రిలీజ్ పోస్ట్ పోన్ పై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుంది.
ప్రమోషన్స్ స్టార్ట్ చేసేది ఎప్పుడు?
రీసెంట్ గానే 'కల్కి' షూటింగ్ని పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఆ మధ్య నాగ్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి కల్కి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తామని చెప్పాడు. ప్రమోషన్స్ లో భాగంగా మొదట టీజర్ రిలీజ్ చేసి ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తాం అని అన్నాడు. కానీ ఇప్పుడు చూస్తే కల్కి రిలీజ్ పోస్ట్ పోన్ కాబోతుండడంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌ను కొద్ది రోజుల పాటూ హోల్డ్ లో పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : ‘ఈసారి పండగ మనదే’ సుడిగాలి సుధీర్ - విజయ్, దిల్ రాజుపై పంచులు మామూలుగా లేవు