అన్వేషించండి

చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ సినిమాలు చూస్తూ పెరిగాను - ఆయనంటే పిచ్చి: ‘లవ్ టుడే’ ఇవానా

'లవ్ టుడే' హీరోయిన్ ఇవానా కోలీవుడ్ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ 'LGM'. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఇవానా అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించింది.

అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాకి వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో బన్నీ ఏకంగా గ్లోబల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకొని ఐకాన్ స్టార్ గా మారిపోయారు. ఇక బన్నీకి మలయాళంలో ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో తెలిసిందే కదా. మన టాలీవుడ్ లో ఉన్నంత స్టార్ క్రేజ్ బన్నీకి మలయాళం లో ఉంది. అక్కడ అయితే ఏకంగా అల్లు అర్జున్ పేరుతో ఎన్నో అభిమాన సంఘాలు ఉన్నాయి. అంతలా అక్కడి ప్రేక్షకులు, సినీ సెలబ్రిటీలు మన బన్నీని అభిమానిస్తూ ఉంటారు. అందుకే అల్లు అర్జున్‌ని మలయాళీ ఫ్యాన్స్ 'మల్లు అర్జున్' అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. బన్నీ నటించే ప్రతి తెలుగు సినిమా మలయాళంలో డబ్ అవుతుంటుంది.

అలా చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ సినిమాలు చూసి పెరిగానంటూ బన్నీ పై ప్రశంసల వర్షం కురిపించింది 'లవ్ టుడే' హీరోయిన్ ఇవానా. 2022లో వచ్చిన 'లవ్ టుడే' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది ఇవానా. సినిమాలో తన అందం, అభినయంతో కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంది. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ తమిళంతో పాటు ఇప్పుడు తెలుగులో కూడా నటిస్తోంది. 'లవ్ టుడే' సక్సెస్ తర్వాత టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ హీరోయిన్ కి ఆఫర్ ఇచ్చారు. తన వారసుడు ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న 'సెల్ఫిష్' సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అందుకుంది ఇవానా. అయితే దీనికంటే ముందే 'LGM' అనే సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది ఈ హీరోయిన్.

టీమిండియా క్రికెటర్ ఎంఎస్ ధోని నిర్మాణంలో కోలీవుడ్ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్, ఇవానా జంటగా తమిళంలో నటించిన చిత్రం 'లెట్స్ గెట్ మ్యారీడ్' (LGM). ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఆగస్టు 4న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల అయింది. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ ఇవానా.. అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది." తాను చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ సినిమాలను చూసి పెరిగానని, ఆయనకి మలయాళంలో చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉందని, ఆయన ప్రతీ సినిమా మలయాళ డబ్బింగ్ వెర్షన్ తాను చూసానని, అందుకే తాను అల్లు అర్జున్ కి పెద్ద అభిమానిని" అని చెప్పుకొచ్చింది.

ఒకవేళ మీకు అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ వస్తే మీ రియాక్షన్ ఏంటి?.. ఒక దర్శకుడు లేదా నిర్మాత మీ దగ్గరికి వచ్చి మీకు అల్లు అర్జున్తో నటించే ఛాన్స్ ఇస్తే అప్పుడు మీ రియాక్షన్ ఏంటని అడిగితే.." నాకు ఛాన్స్ ఇచ్చిన వారి కాళ్ళు మొక్కుతా అంటూ సైగ చేస్తూ" చెప్పింది ఇవానా. దీంతో బన్నీపై ఇవానా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా రమేష్ తమిళమని దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే టీమిండియా క్రికెటర్ ధోని సినీ నిర్మాణరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటి నదియా, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. జులై 28న తమిళంలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని ఓ వారం ఆలస్యంగా తెలుగులో అంటే ఆగస్టు 4న ఈ సినిమాని విడుదల చేశారు మేకర్స్.

Also Read : 'లెట్స్ గెట్ మ్యారీడ్' రివ్యూ : ఎంఎస్‌ ధోనీ నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget