అన్వేషించండి

Lokesh Kanagaraj: రజనీకాంత్... కమల్ హాసన్... ఇద్దరితో లోకేష్ కనగరాజ్ మల్టీస్టారర్

Rajinikanth - Kamal Haasan: సూపర్ స్టార్ రజనీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ కలిసి ఓ మల్టీస్టారర్ చేయనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెలిపారు.

తక్కువ సమయంలో పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించిన తమిళ దర్శకులు జాబితాలో లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) పేరు ముందు వరుసలో ఉంటుంది. లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) కథానాయకుడిగా ఆయన దర్శకత్వం వహించిన 'విక్రమ్' బాక్సాఫీస్ బరిలో పలు రికార్డులు నమోదు చేసింది. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా 'కూలీ' డైరెక్టర్ చేస్తున్నారు లోకేష్ కనకరాజ్. 

తమిళ ప్రేక్షకులను మాత్రమే కాదు... భారతీయ ప్రేక్షకులను కూడా మెప్పించిన హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్. వాళ్ళిద్దరికీ పాన్ వరల్డ్ స్థాయిలో ఫాలోయింగ్ ఉందని చెబితే అతిశయోక్తి కాదు. ఆ ఇద్దరు హీరోలు గతంలో మల్టీస్టారర్ సినిమాలు చేశారు. అయితే ఈ మధ్యకాలంలో వాళ్ళిద్దరిని ఒకే కథతో మెప్పించిన దర్శకుడు ఎవరు లేరు. వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ సినిమా చేస్తే చూడాలని చాలా మంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఆ కోరికను త్వరలో నిజం చేయబోతున్నారు లోకేష్ కనకరాజ్.

గ్యాంగ్‌స్టర్స్ కథతో మల్టీస్టారర్!
లోకేష్ కనకరాజ్ ఓ తమిళ మీడియాకు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ గురించి కీలక విషయాన్ని వెల్లడించారు. ''ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్‌కు సంబంధించిన కథను రజనీ, కమల్ గారికి చెప్పాను. ఇద్దరూ ఓకే అన్నారు'' అని లోకేష్ కనకరాజ్ తెలిపారు. ఆ సినిమాకు కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉంది. అయితే... ఇప్పట్లో ఆ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం లేదు. ప్రస్తుతం లోకేష్ లైనప్ ఫుల్ అయ్యింది.

Also Readమృణాల్ ఠాకూర్‌తో పెళ్లి పుకార్లకు క్లారిటీ ఇచ్చిన అక్కినేని హీరో... మరాఠీ అమ్మాయి తెలుగింటి కోడలు కాదా?

రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న 'కూలీ' సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతకు ముందు నిర్మాతల నుంచి తనకు ఒత్తిడి ఉండేదని, ముందుగా విడుదల తేదీ ఖరారు చేయడం వల్ల అనుకున్న తేదీకి సినిమాలు తీసుకు రావడం కోసం పని చేసే వాడినని, 'కూలి'కి మాత్రం ఎటువంటి ఒత్తిడి లేకుండా సినిమా తీసిన తర్వాత విడుదల తేదీ ఖరారు చేశామని తెలిపారు. 

Also Read'దిల్' రాజు మొదటి భార్య విగ్రహాన్ని ఇంట్లో పెట్టిన కూతురు... తల్లి అంటే హన్షితా రెడ్డికి ఎంత ప్రేమో కదూ... ఫోటోలు చూడండి

Lokesh Kanagaraj Upcoming Movies: 'కూలి' తర్వాత కార్తీ కథానాయకుడిగా 'ఖైదీ 2' చేయనున్నట్లు లోకేష్ కనకరాజ్ కన్ఫర్మ్ చేశారు. ఆ తరువాత కమల్ హాసన్ 'విక్రమ్ 2', దళపతి విజయ్ హీరోగా 'లియో 2', సూర్య హీరోగా 'రోలెక్స్' సినిమాలు చేయనున్నట్లు ఈ యువ దర్శకుడు వివరించారు.

టాప్ హెడ్ లైన్స్

Pallaburusu Trailer Review : టూత్ బ్రష్ కోసం కొడుకుపై తండ్రి కేసు - కోర్టు తీర్పు ఏంటి?... పళ్లబురుసు చూడాల్సిందే
టూత్ బ్రష్ కోసం కొడుకుపై తండ్రి కేసు - కోర్టు తీర్పు ఏంటి?... పళ్లబురుసు చూడాల్సిందే
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
Dark Comedy Thriller OTT : శవాన్ని కిడ్నాప్ చేసే ఫ్రెండ్స్ - ఓటీటీలోకి వచ్చేసిన డార్క్ కామెడీ డ్రామా... ఎందులో చూడొచ్చంటే?
శవాన్ని కిడ్నాప్ చేసే ఫ్రెండ్స్ - ఓటీటీలోకి వచ్చేసిన డార్క్ కామెడీ డ్రామా... ఎందులో చూడొచ్చంటే?
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
Embed widget