అన్వేషించండి

Kuberaa: ముంబైలో 'కుబేర' సాంగ్ లాంచ్ హైలైట్స్... రష్మికను పొగిడిన నాగార్జున, ధనుష్ ఏం చెప్పారంటే?

Kuberaa Song Launch Highlights: 'కుబేర' తనకు చాలా స్పెషల్ ఫిల్మ్ అని, ఇందులో ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్ చేశానని ధనుష్... ఇదొక డిఫరెంట్ ఫిల్మ్ అని, శేఖర్ కమ్ముల అద్భుతంగా తీశారని నాగార్జున అన్నారు.

కోలీవుడ్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మికా మందన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా 'కుబేర'. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న థియేటర్లలోకి రానుంది. ముంబైలో మంగళవారం మూడో పాట 'పీ పీ డుమ్‌ డుమ్‌'ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఆ లాంచ్ హైలైట్స్ ఏమిటో తెలుసుకోండి.

డంప్ యార్డులో రష్మికకు వాసన రాలేదట - ధనుష్
Dhanush speech at Kuberaa 3rd Single launch: 'కుబేర' తనకు చాలా స్పెషల్ ఫిల్మ్ అని ధనుష్ చెప్పారు. ఇదొక డిఫరెంట్ ఫిల్మ్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''నా మనసుకు దగ్గరైన సినిమా 'కుబేర'. నాగార్జున గారితో వర్క్ చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా కోసం పాజిటివ్ టీంతో కలిసి పని చేశా. ఇందులో బెగ్గర్ క్యారెక్టర్ చేశా. శేఖర్ కమ్ముల బ్రిలియంట్ డైరెక్టర్. ఈ సినిమా కోసం ఆయన చెప్పింది ఫాలో అయ్యా. శేఖర్ గారు చాలా స్వచ్ఛమైన మనిషి. ఆయన చెప్పిన 20 నిమిషాలు కథ, ఆయన ఎనర్జీ నాకు నచ్చింది. వెంటనే ఓకే చేశా. మేం నిజాయతీగా చేసిన చిత్రమిది. చిత్రీకరణ కోసం డంప్‌ యార్డులో దాదాపు ఏడు గంటలు నేను, రష్మిక ఉన్నాం. అక్కడ అంత సేపున్నా 'నాకేం వాసన రావట్లేదు' అని రష్మిక చెప్పింది'' అని అన్నారు. అందరికీ సినిమా నచ్చుతుందని చెప్పారు.

కెరీర్ స్టార్టింగ్ నుంచి హిందీలో ఆదరణ సూపర్ - నాగార్జున
Nagarjuna speech at Pippi Pippi Dum Dum Dum Single launch: శివ, క్రిమినల్ నుంచి మొదలు పెడితే తన కెరీర్ స్టార్టింగ్ నుంచి హిందీ ప్రేక్షకుల ఆదరణ చాలా బావుందని కింగ్ నాగార్జున చెప్పారు. ఆయన ఇంకా మాట్లాడుతూ... ''నాకు 'కుబేర' చాలా స్పెషల్ ఫిల్మ్. ఏదోకటి డిఫరెంట్‌గా చేయాలనుకున్నప్పుడు శేఖర్ కమ్ముల వచ్చారు. ఆయనతో సినిమా చేయాలని పదిహేను ఏళ్లుగా అనుకుంటున్నా. 'కుబేర' గురించి చెప్పినప్పుడు మరో ఆలోచన లేకుండా ఓకే చేశా. శేఖర్ మనసు స్వచ్ఛంగా ఉంటుంది. అది తెరపై కనిపిస్తుంది. జిమ్ సర్బ్ నాకంటే చాలా చక్కగా తెలుగు మాట్లాడారు. రష్మిక పవర్ హౌస్ ఆఫ్ టాలెంట్. తన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. రెండు వేల కోట్లు, మూడు వేల కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాకు అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ ఇచ్చారు. అతని సంగీతం ఈ సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకు వెళ్ళింది. ధనుష్ బ్రిలియంట్ యాక్టర్. ప్రతి సినిమాకు వైవిధ్యం చూపించే అతను ఈ సినిమాలో అద్భుతంగా చేశారు. అతనితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది'' అని చెప్పారు. జూన్ 20న థియేటర్లలో సినిమాను చూడమని ప్రేక్షకులను కోరారు.

Also Read: వీరమల్లు వాయిదా: ఖాళీ అయిన జూన్ రెండో వారం.. డబ్బింగ్ సినిమాలకు కలిసొచ్చింది

గీతాంజలి, శ్రీవల్లిలా ఈ క్యారెక్టర్ గుర్తుంటుంది - రష్మిక
'యానిమల్'లో గీతాంజలి, 'పుష్ప'లో శ్రీవల్లి, 'ఛావా'లో యేసుబాయి క్యారెక్టర్స్ తరహాలో 'కుబేర'లో తాను చేసిన క్యారెక్టర్ ఆడియన్స్ అందరికీ గుర్తు ఉంటుందని రష్మిక చెప్పారు. ధనుష్, నాగార్జునతో నటించడం ఆనందంగా ఉందన్నారు. ఇంకా రష్మిక మాట్లాడుతూ... ''రియల్ లొకేషన్స్‌లో 'కుబేర' షూటింగ్ చేశాం. శేఖర్ కమ్ముల గారితో వర్క్ చేయడం మంచి ఎక్స్పీరియన్స్'' అని అన్నారు. ఈ సినిమా కోసం తెలుగులో డైలాగ్స్ చెప్పానని బాలీవుడ్ యాక్టర్ జిమ్ సర్భ్ అన్నారు. 'కుబేర' కోసం తెలుగు నేర్చుకోవడం సవాలుగా అనిపించిందని, ఇదొక అద్భుతమైన సినిమా అని చెప్పారు.

Also Readఒక్క లుక్కుతో చంపేశాడు... 'అఖండ 2' టీజర్‌లో ఆది పినిశెట్టి - అదీ బాలయ్య సినిమాలో విలన్ ఇంపాక్ట్

టాప్ హెడ్ లైన్స్

Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget