Kriti Sanon : నా అండాలు భద్రపరుచుకున్నా - ఆ మూవీ షూటింగ్ టైంలో అదే రైట్ టైం... కృతి సనన్ కామెంట్స్
Kriti Sanon Reaction : మిమి మూవీ షూటింగ్ టైంలో బరువు పెరగాలని చెప్పినప్పుడు తన అండాలను భద్రపరుచుకున్నట్లు తెలిపారు బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Kriti Sanon Opens Up About Feezing Her Eggs : రీసెంట్‌గా 'కాక్ టెయిల్ 2'లో అలీషాగా గ్లామరస్ రోల్‌లో మెరిశారు బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon). తాజాగా ఆమె ఓ పాడ్ కాస్ట్‌లో ఎగ్ ఫ్రీజింగ్‌పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఓ మూవీ షూటింగ్ టైంలో ఆమె తన అండాలు భద్రపరిచినట్లు ఓపెన్ అయ్యారు. ఇంతకూ ఆ మూవీ ఏంటి?, ఎందుకు అండాలు భద్రపరుచుకున్నారు? అనేది ఓసారి చూస్తే...
'అందుకే అలా చేశా'
'మిమి'లో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు కృతి సనన్. ఆ మూవీ షూటింగ్ చేస్తున్న టైంలో తన అండాలను ఫ్రీజింగ్ పద్ధతిలో భద్రపరుచుకున్నట్లు తెలిపారు. 'ఈ విషయం ఫస్ట్ టైం మీతో షేర్ చేసుకుంటున్నా. నా అండాలను ఫ్రీజ్ చేసి భద్రపరిచా. 'మిమి' కోసం బరువు పెరగాల్సి వచ్చింది. అందుకు తగిన ఆహారం తీసుకోవాలి. దీంతో కడుపు ఉబ్బరం కూడా వచ్చేది. ఎలాగైనా బరువు పెరగడమే లక్ష్యంగా పెట్టుకున్నా.
షూటింగ్‌లో ఒకరి సజిషన్ నా మైండ్‌లో ఉండిపోయింది. 'మీరు ఈ పని చేయగలిగితే మీ కోసం మీరు ఇచ్చుకునే ది బెస్ట్ గిఫ్ట్ ఇదే.' అని అన్నారు. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత బరువు పెరగాలని చెప్పినప్పుడు అండాలను భద్రపరుచుకోవడానికి ఇదే సరైన సమయమనిపించింది.' అని చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
'మిమి' స్టోరీ ఏంటంటే?
తన డ్రీమ్స్ నెరవేర్చుకునేందుకు డబ్బు అవసరం కావడంతో మిమి రాథోడ్ అనే యువతి అద్దె గర్భం ఇచ్చేందుకు అంగీకరిస్తుంది. అయితే, అనుకోని పరిస్థితుల్లో అమెరికన్ జంట ఆమె కడుపులో ఉన్న బిడ్డను తీసుకునేందుకు ముందుకు రారు. దీంతో ఆమె ఏం చేసింది అనేదే కథ. పెళ్లి కాకుండానే గర్భం దాల్చడంతో సమాజంలో ఆమెకు ఎదురైన పరిస్థితులేంటి? అన్నింటినీ దాటి బిడ్డకు జన్మనిచ్చిందా? లేదా? అనేదే మూవీ.
సాధారణంగా ఇలాంటి స్టోరీస్ ఉన్న రోల్ చేసే టైంలో కొన్నిసార్లు హార్మోన్లకు సంబంధించిన ఇంజెక్షన్స్ సైతం తీసుకోవాల్సి వస్తుంది. ఇది తాత్కాలికంగా కడుపు ఉబ్బరం, ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. దీంతో అండాశయంపై ఎఫెక్ట్ పడి భవిష్యత్తులో గర్భం దాల్చాల్సి వచ్చినప్పుడు సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే చాలామంది అండాలను ఫ్రీజింగ్ పద్ధతిలో భద్రపరుస్తున్నారు.
అసలేంటీ ఎగ్ ఫ్రీజింగ్?
వయసులో ఉన్న మహిళలు తమ అండాలను భద్రపరుచుకుని... తమకు పిల్లల్ని కనాలనే ఆలోచన వచ్చినప్పుడు వాటిని తమ శరీరంలోకి ప్రవేశపెట్టి గర్భం దాలుస్తారు. ఇది చాలా ఖర్చుతో కూడిన పని. రీసెంట్ టైంలో పలువురు హీరోయిన్స్, సెలబ్రిటీలు ఇలానే చేస్తున్నారు. ఐవీఎఫ్, సరోగసీతో పాటు ఎగ్ ఫ్రీజింగ్ కూడా ఒక పద్ధతే.
Also Read : Revathy Padmapriya : AMMAకు రేవతి, పద్మప్రియ రాజీనామా - అసలేం జరిగిందంటే?
Before You Go
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
ట్రెండింగ్ వార్తలు






















