అన్వేషించండి

Kriti Kharbanda: హోటల్ రూమ్‌లో కెమెరా, అడ్డంగా దొరికిపోయాడు: షాకింగ్ నిజాలు బయటపెట్టిన కృతి కర్బంద

సెలబ్రిటీ అవ్వకముందు నుండే తను కొన్ని భయంకరమైన పరిస్థితులను ఎదుర్కుందని, వాటి వివరాలు చెప్పుకొచ్చింది హీరోయిన్ కృతి కర్భంద.

సినీ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. హీరోయిన్స్ విషయంలో అయితే ఇలాంటివి కొంచెం శృతి మించుతాయి. అసలు హీరోయిన్స్ ఎలా ఉంటారు? అని వారి జీవితంలో పూర్తిగా తొంగి చూడాలనుకుంటారు కొందరు. అందుకే వారి ప్రైవసీకి ప్రతి విషయంలో భంగం కలిగించడానికి ప్రయత్నిస్తుంటారు. హోటల్స్ రూమ్స్‌లో ఉండడానికి ఇప్పటికీ కొందరు హీరోయిన్స్ భయపడుతున్నారంటే ఇదే కారణం. ఒకసారి తనకు కూడా అలాంటి చేదు అనుభవం ఎదురయ్యిందని బాలీవుడ్ భామ కృతి కర్బంద బయటపెట్టింది. సెలబ్రిటీ అవ్వక ముందు నుండే తను కొన్ని భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని, వాటి వివరాలు చెప్పుకొచ్చింది.

హోటల్ రూమ్‌లో కెమెరా పెట్టాడు!
కృతి కర్బంద కేవలం హిందీలోనే కాదు... పలు సౌత్ ఇండియన్ భాషల్లో కూడా సినిమాలు చేసింది. అలాగే ఒక కన్నడ చిత్రంలో నటిస్తున్న సమయంలో తనతో పాటు, తన టీమ్ కూడా హోటల్ రూమ్‌లో ఒక కెమెరాను కనిపెట్టారని బయటపెట్టింది కృతి. ఆ ఘటనను గుర్తు చేసుకుంటూ ‘నేను ఒక కన్నడ సినిమా షూట్ చేస్తున్న సమయంలో హోటల్‌లో ఓ అబ్బాయి పని చేస్తుండేవాడు. అతడు ఒకసారి నా రూమ్‌లో కెమెరాను వదిలేశాడు. నా స్టాఫ్‌కు, నాకు చుట్టు పక్కన అంతా పరీక్షగా చూసే అలవాటు ఉంది. ఆ అబ్బాయికి అలవాటు లేకపోవడంతో కెమెరాను సరిగ్గా పెట్టలేదు. దానిని సెట్ టాప్ బాక్స్‌పైన పెట్టాడు. నాకు కనిపించింది. ఇలాంటి సంఘటనలు చాలా భయాన్ని కలిగిస్తాయి’’ అంటూ కృతి చెప్పుకొచ్చింది.

ఢీ కొట్టి వెళ్లిపోయాడు..
హోటల్ రూమ్‌లో కెమెరా అనుభవాన్ని చూసి భయపడిన కృతి కర్భంద... దాంతో పాటు మరొక భయంకరమైన ఘటన గురించి కూడా బయట పెట్టింది. ఒకసారి బెంగుళూరులో తనను ఒక బైకర్ ఢీ కొట్టాడని తెలిపింది. అంతే కాకుండా ఢీ కొట్టేసి, అసలు తను ఎలా ఉందో చూడకుండా వెళ్లిపోయాడని చెప్పింది. ఇలాంటి ఘటనను తన తల్లిదండ్రులకు ఎలా చెప్పాలో తెలియక చాలా కాలం వరకు తనలోని దాచుకున్నానని చెప్తూ బాధపడింది. ఇలాంటి విషయాలను షేర్ చేసుకొని వారిని బాధపెట్టడం తనకు ఇష్టం లేదని తెలిపింది. 

అసభ్యకరంగా తాకాడు, బ్లడ్ క్లాట్ అయ్యేలా గిల్లాడు..
హోటల్ రూమ్‌లో కెమెరా, బైకర్ ఢీ కొట్టడంతో పాటు ఇలా ఎన్నో ఘటనలను తను ఎదుర్కున్నా అని కృతి చెప్పింది. ఫోటోలు దిగాలనే పేరుతో హీరోయిన్స్‌ను తమ ఫ్యాన్స్.. ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెడుతుంటారు. అందుకే సోషల్ ఈవెంట్స్‌కు వెళ్లాలంటే హీరోయిన్స్ కాస్త ఎక్కువ జాగ్రత్తలే తీసుకుంటారు. అలాగే కృతిని కూడా ఒక ఫ్యాన్.. ఫోటో దిగాలి అనే కారణంతో అసభ్యకరంగా తాకాడని తెలిపింది. అంతే కాకుండా తనను గిల్లాడని, దాని వల్ల తనకు బ్లడ్ క్లాట్ అయిందని కూడా తెలిపింది. ‘ఇలాంటి ఘటనలే మళ్లీ మళ్లీ జరగడం చాలా బాధాకరంగా ఉంటుంది. అతడు నన్ను గిల్లి పారిపోయాడు. నాకు అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. షాక్‌లో అలాగే ఉండిపోయాను’ అని తెలిపింది కృతి కర్భంద. దాదాపు అందరు హీరోయిన్స్.. ఇలాంటి ఘటనలను ఎదుర్కునే ఉంటారు. కానీ కొందరు మాత్రమే వీటి గురించి ధైర్యంగా బయటపెట్టడానికి ముందుకొస్తారు.

Also Read: ఊర్వశి రౌతేలా అరుదైన రికార్డ్ - ఈఫిల్ టవర్ ముందు వరల్డ్ కప్‌తో

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget