Kasthuri Shankar: అతడు మంచోడు కాదు - ఎంతవరకు తట్టుకోగలం? దర్శన్ కేసుపై నటి కస్తూరి శంకర్ షాకింగ్ కామెంట్స్
Kasthuri Shankar: కన్నడ స్టార్ హీరో దర్శన్ కేసుపై చాలావరకు సెలబ్రిటీలు స్పందించడానికి ముందుకు రావడం లేదు. కానీ కస్తూరి శంకర్ మాత్రం ఈ విషయంపై అనూహ్య వ్యాఖ్యలు చేశారు.
Kasthuri Shankar About Darshan Case: కన్నడ స్టార్ హీరో దర్శన్.. ఒక మర్డర్ కేసులో జైలుకు వెళ్లడం శాండిల్‌వుడ్‌లో మాత్రమే కాదు.. మొత్తం సౌత్ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా మారింది. ఒక స్టార్ హీరో స్థానంలో తానే అందరికీ మంచి చెప్పాల్సిన దర్శన్.. స్వయంగా తన ఫ్యాన్స్‌ను ఉపయోగించుకొని ఒక హత్య చేశాడనే విషయం ఇంకా చాలామంది నమ్మలేకపోతున్నారు. తాజాగా యాక్టర్ కస్తూరి శంకర్ కూడా దర్శన్ కేసుపై, దర్శన్‌కు, పవిత్ర గౌడకు ఉన్న రిలేషన్‌షిప్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అతడు మంచివాడు కాదు..
‘‘పవిత్ర గౌడ.. దర్శన్ పార్ట్‌నర్ అయినందుకు రేణుకా స్వామి తనకు అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతూ తనను జడ్జ్ చేశాడు. రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. వాళ్ల పర్సనల్ లైఫ్ వాళ్లది. సోషల్ మీడియా వల్ల అందరి పర్సనల్ లైఫ్ మన ప్రాపర్టీ అన్నట్టుగా అయిపోయింది. మనం మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు చూసుకోరు. అవతల వాళ్ల జీవితంలో ఏం జరుగుతుందో చూసి వాళ్లని జడ్జ్ చేయాలి, ఇబ్బంది పెట్టాలి అన్నట్టుగా ఉంది పరిస్థితి. హింసను ఎప్పుడూ ప్రోత్సహించకూడదు. కానీ చనిపోయిన వ్యక్తి కూడా మంచివాడు కాదు. తను పవిత్రను వేధించాడు. అసలు తనకు ఏంటి సంబంధం. తను ఎందుకు అసలు అలాంటి మెసేజ్‌లు పంపాలి? పవిత్రతో రిలేషన్‌షిప్‌లో ఉండడం దర్శన్ చేసిన తప్పే. సోషల్ మీడియాలో అప్పటికే దాని గురించి కామెంట్స్ చేస్తున్నారు’’ అంటూ రేణుకా స్వామి మర్డర్ గురించి మాట్లాడారు కస్తూరి శంకర్.
పబ్లిక్‌కు ఆ హక్కు లేదు..
‘‘దర్శన్ పర్సనల్ లైఫ్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే తన మొదటి భార్య చూసుకుంటుంది. పోలీసులు, కోర్టు ఇలా చాలా ఉన్నాయి. అదంతా వాళ్ల పర్సనల్ విషయం. కానీ ఒక సెలబ్రిటీకి మెసేజ్‌లు చేసి వేధించే హక్కు పబ్లిక్‌కు ఎవరు ఇచ్చారు? దర్శన్ విషయంలో అది చాలా దూరం వెళ్లింది. తనకు అసలే చాలా కోపం ఎక్కువ. తను, తన ఫ్యాన్స్ కలిసి రేణుకా స్వామిని కొట్టి గుణపాఠం నేర్పించాలి అనుకున్నారో ఏమో కానీ తను చనిపోయాడు. కాబట్టి పరిస్థితి చేయి దాటిపోయింది. అన్నింటికి ఒక హద్దుండాలి’’ అన్నారు కస్తూరి. టెక్నాలజీ వల్ల కలుగుతున్న నష్టాల గురించి చెప్తూ రష్మిక ఫోటోలను ఏఐలో మార్ఫ్ చేయడం గురించి గుర్తుచేసుకున్నారు. ఏఐను ఉపయోగించి ఎవరి ఫోటోలను అయినా అసభ్యకరంగా మార్చవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
ఫిల్మ్ స్టార్లు మాత్రం ఊరుకోవాలి..
‘‘ఒక రాజకీయనాయకుడికి, బిజినెస్‌మ్యాన్‌కు ఇలా చేస్తే ఆ చేసినవాడు ఏమయ్యాడో తెలియకుండా మాయం చేస్తారు. కానీ ఫిల్మ్ స్టార్లను ఇలా ఇబ్బందిపెడితే మాత్రం వాళ్లు నోరు మూసుకొని ఊరుకోవాలి. ఇదేం న్యాయం? అలా అని వెళ్లి మనుషులను చంపేయాలి, కొట్టేయాలి అని నేను అనను. కానీ ఎంతవరకు అని తట్టుకోగలుగుతాం? ఎవరికైనా ఏదో ఒక పాయింట్‌లో సహనం పోతుంది కదా. ఎవరి ఇంట్లో వెళ్లి చూసినా ఏదో ఒక సమస్య ఉంటుంది. పర్సనల్ లైఫ్‌లో ఒక వ్యక్తి రిలేషన్‌షిప్‌లో ఉండడం అనేది తప్పే కాదు. అయినా అది తప్పా కాదా అనే హక్కు కూడా ఎవరికి లేదు’’ అంటూ సినీ సెలబ్రిటీల పరిస్థితి చెప్తూ ఫైర్ అయ్యారు కస్తూరి శంకర్.
Also Read: స్టార్లను దేవుళ్లుగా పూజిస్తే ఇలాగే ఉంటుందంటూ ట్వీట్ - దర్శన్ కేసుపై ఆర్జీవీ స్పందన