అన్వేషించండి

Kartik Aaryan: సల్మాన్‌ ప్లేస్‌లో ఆ కుర్ర హీరోకు ఛాన్స్? దర్శకుడు సూరజ్ బర్జాత్య షాకింగ్ నిర్ణయం

బాలీవుడ్ దర్శకుడు సూరజ్ బర్జాత్యా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కొత్త సినిమాలో హీరో సల్మాన్ ప్లేస్ లో కార్తిక్ ఆర్యన్ ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Kartik Aaryan To Replace Salman Khan: బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘చందు ఛాంపియన్’, ‘భూల్ భూలయ్యా’ సినిమాతో బిజీగా ఉన్న ఆయన, మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన క్రేజీ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో ఏకంగా సల్మాన్ ను తొలగించి ఆయనను తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఇద్దరి మధ్య రెండు సార్లు చర్చలు కూడా జరిగాయట. కథ విషయంలో ఇద్దరూ చర్చిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

సల్మాన్ ప్లేస్ లో కార్తిక్ ఆర్యన్ కు చోటు!

నిజానికి దర్శకుడు సూరజ్ సల్మాన్ ఖాన్ తో కలిసి బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘మైనే ప్యార్‌ కియా’, ‘హమ్‌ ఆప్కే హై కౌన్‌’, ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’ చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగానే అలరించాయి. ఆ తర్వాత ‘ప్రేమ్ కి షాదీ’ అనే సినిమా చేయాల్సి ఉంది. గత కొంత కాలంగా ఈ సినిమా ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు కొనసాగింది. అయితే, ప్రస్తుతం ఈ సినిమా నుంచి దర్శకుడు సూరజ్, సల్మాన్ ను తొలగించినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో కార్తిక్ ఆర్యన్ హీరోగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఆయనతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. “సూరజ్ తన తర్వాతి సినిమాలో నటించే హీరో అమాయకుడిగా కనించేలా ఉండాలని భావిస్తున్నారట. కార్తిక్ అయితే, తను అనుకున్న పాత్రకు సరిగ్గా సరిపోతారని భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిర చర్చలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

త్వరలో ‘చందూ ఛాంపియన్’ విడుదల

కార్తిక ఆర్యన్ ప్రస్తుతం ‘చందూ ఛాంపియన్’ సినిమా చేస్తున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలి భారతీయ పారాలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ మురళీ కాంత్ పేట్కర్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా విడుదల తర్వాత కార్తిక్, సూరజ్ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా చేసేందుకు కార్తిక్ దాదాపు ఓకే చెప్పిట్లు తెలుస్తోంది. ‘చందూ ఛాంపియన్’ సినిమాతో పాటు ‘భూల్ భూలయ్యా3’ సహా మరికొన్ని సినిమాలు చేస్తున్నారు. 

బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించిన సూరజ్

అటు సూరజ్ బర్జాత్యా గత నాలుగు దశాబ్దాలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించారు. ‘మైనే ప్యార్ కియా’ నుంచి మొదలుకొని ‘హమ్ ఆప్కే హై కౌన్’, ‘హమ్ సాథ్ సాథ్ హై’, ‘వివాహ్’ లాంటి అద్భుత చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అతడు చివరగా ‘ఉంచై‘ అనే సినిమాను తెరకెక్కించారు. నవంబర్11, 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన  అడ్వెంచరస్ డ్రామా దేశ వ్యాప్తంగా ఉన్న సీనియర్ సిటిజన్స్ ప్రశంసలు దక్కించుకుంది. ఇందులోఅమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, బోమన్ ఇరానీ, డానీ డెంజోంగ్పా, పరిణీతి చోప్రా, నీనా గుప్తా, సారిక ముఖ్య పాత్రలు పోషించారు.     

Also Read: ఇప్పుడు ఏపీలో 'కల్కి'ని ఆపేది ఎవ్వడ్రా... తెలుగు దేశం విజయంతో నిర్మాత అశ్వనీదత్ ఫుల్ హ్యాపీ

టాప్ హెడ్ లైన్స్

Objection My Lord Web Series Review - 'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
Crime Thriller OTT : గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget