అన్వేషించండి

Karate Kalyani: డ్రగ్స్‌తో దొరికావు - బెంగళూరు రేవ్ పార్టీ, హేమపై కరాటే కళ్యాణి సెన్సేషనల్ కామెంట్స్

Bengaluru Rave Party: ఇండస్ట్రీలో ఏ కాంట్రవర్సీ అయినా స్పందించడానికి ముందుంటారు కరాటే కళ్యాణి. తాజాగా బెంగుళూరు రేవ్ పార్టీ ఘటనపై కూడా స్పందిస్తూ నటి హేమపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Karate Kalyani Comments On Hema and Bengaluru Rave Party: ప్రస్తుతం టాలీవుడ్‌లో బెంగుళూరు రేవ్ పార్టీ గురించే హాట్ టాపిక్‌గా మారింది. ఈ రేవ్ పార్టీలో ఉన్నారంటూ కొందరు టాలీవుడ్ సెలబ్రిటీలపై ఆరోపణలు రాగా... వారంతా ఒక్కొక్కరిగా తమ తప్పు ఏం లేదని చెప్పడానికి ముందుకొస్తున్నారు. అందరికంటే ముందుగా నటి హేమ... తను ఏ తప్పు చేయలేదు అని చెప్తూ వీడియోను విడుదల చేశారు. కానీ ఈ వీడియోపై ఎక్కువమంది స్పందించలేదు. తన తప్పు లేదంటూ హేమ చెప్పిన మాటలు తప్పు అని సీపీ దయానంద్ ఆరోపించారు. దీంతో ఈ విషయంపై కరాటే కళ్యాణి తన స్టైల్‌లో స్పందిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. అందులో హేమపై ఘాటు కామెంట్స్ చేశారు.

పిచ్చిపిచ్చిగా గొడవలు..

‘‘నిన్న బెంగుళూరు రేవ్ పార్టీలో దొరికిన హేమక్క... ఇండస్ట్రీ వాళ్ల గురించి చాలా రకాలుగా మాట్లాడారు. ‘అన్నింటికి నేను పెద్ద ముత్తైదువని, అన్నింటికి నేను బాధ్యురాలిని అని, నేనే అందరినీ ఉద్దరిస్తున్నాను అని, ప్రతీదాంట్లో నేనే ఉన్నానని, ఆడవాళ్లకు చాలా సాయం చేస్తున్నానని. ఇండస్ట్రీ వాళ్లు నా మీద ఆధారపడ్డారు. నేనే పెద్ద దిక్కుని. మా అసోసియేషన్ ఎలక్షన్స్‌లో గానీ ఎక్కడైనా నేను ఉన్నాను’ అన్నట్టుగా ఆమె ప్రవర్తించిన తీరు చూస్తుంటే బయటవాళ్లు నిజంగానే ఈమెది పెద్ద నోరు, మనం మాట్లాడకూడదు అనుకునేవాళ్లు. ఎవ్వరినీ వదలకుండా పిచ్చి పిచ్చిగా ఆమె చేసిన గొడవలు అన్నీ మనం చూశాం’’ అంటూ హేమ చెప్పిన మాటలకు వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు కరాటే కళ్యాణి.

డ్రగ్స్‌తో పాటు దొరికావు..

అంతే కాకుండా హేమ ఇదివరకు తప్పులను కూడా గుర్తుచేశారు కళ్యాణి. ‘‘మా అసోసియేషన్‌లో శివ బాలాజీ చేయి కొరికింది. అంతకు ముందు రాజేంద్ర ప్రసాద్‌ను అడ్డగించింది. తన మీద కేసులు పెట్టారని పోలీస్ స్టేషన్స్‌కు వెళ్లింది. నేను ఫ్రెండ్స్‌తో సరదాగా పేకాడుకుంటుంటే.. అది ఎవరో పట్టిస్తే అదేదో పెద్ద నేరంలాగా మాట్లాడిన హేమక్క.. ఈరోజు నువ్వేం చేశావు? ఒక రేవ్ పార్టీలో డ్రగ్స్‌తో పాటు దొరికావు. శాంపిల్స్ బయటికొచ్చిన తర్వాత బెంగుళూరు పోలీసులు కచ్చితంగా నీకు పనిష్మెంట్ ఇస్తారు. ఇక్కడైతే ఇంకా చాలా పనిష్మెంట్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండు’’ అంటూ ఇన్‌ డైరెక్ట్‌గా హేమకు వార్నింగ్ కూడా ఇచ్చారు కరాటే కళ్యాణి.

కర్మ రిటర్న్స్..

‘‘ఒక మనిషి ఒక మాట అనేముందు కర్మ రిటర్న్స్ అంటారు. ఎప్పుడైనా మనం చేసిందే మనకు తిరిగొస్తుంది అని. కాబట్టి ఇకముందైనా జాగ్రత్తగా నడుచుకో. దేవుడి దయ వల్ల నీకు ఆ డ్రగ్స్‌తో ఏ సంబంధం లేకుండా, శాంపిల్స్‌లో ఏ తప్పు లేకుండా ఉండాలని నేను మరొక్కసారి కోరుకుంటున్నాను. గుడ్ లక్. ఇంకొక్కసారి ఎవరి మీద నోరుపారేసుకోకుండా ఆడవాళ్లను అలా ఇలా అనకుండా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. హేమక్క ఇప్పటికైనా అర్థమయ్యిందా?’’ అంటూ తన వీడియోను ముగించారు కరాటే కళ్యాణి. ప్రస్తుతం బెంగుళూరు రేవ్ పార్టీలో హేమ పాల్గొనడంపై కళ్యాణి చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: అది రేవ్‌ పార్టీ కాదు, బర్త్‌డే పార్టీ - ప్లీజ్‌ నాకు సపోర్ట్ చేయండి.. బెంగళూరు రేవ్‌ పార్టీపై నటి షాకింగ్‌ కామెంట్స్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Most Ordered Item On Swiggy: కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?
కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Embed widget