అన్వేషించండి

Kantata Kishore : మీ తప్పులకు ఇంకెంత మూల్యం చెల్లించుకోవాలి? - ప్రధాని మోదీపై కాంతార నటుడు ఫైర్

PM Modi : ప్రధాని మోదీపై కాంతార నటుడు కిశోర్ తీవ్ర విమర్శలు చేశారు. మీరు చేసిన తప్పులకు మేము ఎన్ని సవాళ్లు ఎదుర్కోవాలంటూ సోషల్ మీడియా ఘాటుగా పోస్ట్ చేశారు.

Actor Kishore Kumar Fires On PM Modi : ప్రధాని మోదీని విమర్శిస్తూ కాంతార ఫేమ్ కిశోర్ చేసిన పోస్ట్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సామాజిక అంశాలపై తన వాయిస్ రెయిజ్ చేస్తూ... ప్రధానిపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. రీసెంట్‌గా ప్రధాని పార్లమెంట్‌లో చేసిన ప్రసంగంపై ఫైర్ అయ్యారు. 

అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఇరాన్ - ఇజ్రాయెల్ - అమెరికా యుద్ధం నేపథ్యంలో ప్రజలంతా ఏకతాటిపై ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇంధన కొరత, ఎల్పీజీ సంక్షోభం వంటి రాబోయే విపత్తులను కలిసికట్టుగా ఎదుర్కోవాలని అన్నారు. ఈ కామెంట్స్‌పై నటుడు కిశోర్ విమర్శలు గుప్పించారు.

'ఇంకెన్ని సవాళ్లు ఎదుర్కోవాలి'

దేశాన్ని కుల మతాల వారీగా విభజించి, ప్రజల మధ్య ద్వేషాన్ని నింపిన తర్వాత ఇప్పుడు 'మళ్లీ అందరం కలిసి ఒకే దేశం'గా ఉండాలని కోరడంపై కిశోర్ ఘాటుగా స్పందించారు. 'దేశాన్ని హిందువులు, ముస్లింలు, క్రైస్తవులుగా విభజించి మనం మళ్లీ ఎన్నటికీ ఏకం కాలేనంతగా చేసిన  తర్వాత మళ్లీ ఇలా అడుగుతారా?. మీ రాజీలు, లొంగుబాట్ల వల్ల మేము ఇంకా ఎన్ని  సవాళ్లు ఎదుర్కోవాలి?. మీ తప్పులను రహస్యాలను కప్పి పుచ్చడానికి మేము ఇంకెంత మూల్యం చెల్లించాలి?. 'మీరు యుద్ధ నేరగాళ్లకు అండగా నిలుస్తారు' అని అంటూ ఆ నర హంతకుడిని కౌగిలించుకోవడానికి వెళ్లే ముందు మమ్మల్ని అడిగారా?.

రాఫెల్ నుంచి ఎప్‌స్టీన్ వరకూ, పెద్ద నోట్ల రద్దు నుంచి కరోనా లాక్ డౌన్ వరకూ, వ్యవసాయ చట్టాల నుంచి అగ్నివీర్ వరకూ, మణిపూర్ నుంచి కాశ్మీర్ లేదా లడఖ్ వరకు మీ పిచ్చి నిర్ణయాలు తీసుకునే ముందు, మమ్మల్ని కానీ, ప్రతిపక్షంలో మా ప్రతినిధులను కానీ, లేదా మా పన్నులతో జీతాలు చెల్లించే మీ సొంత అధికారులను కానీ అడిగారా? మీ రాజీలు, లొంగుబాటు, మూర్ఖత్వం ఫలితంగా వచ్చిన సవాళ్లను ఎదుర్కోమని అడగడానికి మీకు ఏ హక్కు ఉంది? చాలు కరోనా టైంలో గొర్రెల మందలా చావడానికి మేము సిద్ధంగా లేము. మీ లెక్కల్లో మమ్మల్ని 50 లక్షల మందిని చనిపోయిన వారిగా కూడా పరిగణించలేం. అత్యున్నత పదవిని అపహాస్యం చేసిన వారు ఇక వెళ్లిపోవాల్సిన టైం వచ్చింది.' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ అటు పొలిటికల్ పరంగా ఇటు ఇండస్ట్రీ పరంగా సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతున్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kishore Kumar Huli (@actorkishore)

Also Read : చాముండి టెంపుల్ దర్శించి సారీ చెబుతా - కాంతార దేవతలపై కామెంట్స్ కాంట్రవర్సీ... ధురంధర్ హీరో ఏమన్నారంటే?

కాంతారలో ఫారెస్ట్ ఆఫీసర్ రోల్‌లో ఫుల్ ఫేమ్ సంపాదించుకున్నారు కిశోర్. తెలుగుతో పాటు కన్నడ, తమిళ మూవీస్‌లో నటించారు. తెలుగులో హ్యాపీ, పిస్తా, ఓంశాంతి, భీమిలి కబడ్డీ జట్టు, దమ్ము, కృష్ణం వందే జగద్గురుమ్, దళం, కార్తికేయ, చందమామ కథలు, రౌడీ తదితర మూవీస్‌లో నటించారు.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
The Court OTT : ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Embed widget