అన్వేషించండి

Kangana Ranaut Slap Row: కంగ‌నా ర‌నౌత్ చెంప‌దెబ్బ‌... స్పందించిన బాలీవుడ్ న‌టులు, హృతిక్ రోషన్ ఏమ‌న్నాడంటే?

Kangana Ranaut Slap Row: కంగ‌నా ర‌నౌత్ చెంప‌దెబ్బ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆ ఘ‌ట‌న‌పై బాలీవుడ్ సెల‌బ్రిటీలు స్పందించారు. వాళ్లంతా ఏమ‌న్నారంటే?

Kangana Ranaut Slap Row Bollywood Reaction: బాలీవుడ్ కథానాయిక, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను కానిస్టేబుల్‌ చెంపదెబ్బ కొట్టిన ఘటన దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఆమెను చంప‌దెబ్బ కొట్ట‌డంపై ఎంతోమంది స్పందించారు. కొంద‌రు కంగ‌నాకు స‌పోర్ట్ చేస్తుంటే... ఇంకొంత‌మంది మాత్రం చెంప‌దెబ్బ కొట్టిన కానిస్టేబుల్ కి స‌పోర్ట్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఇప్ప‌టి వ‌ర‌కు బాలీవుడ్ సెల‌బ్రిటీలు స్పందించ‌లేదని వాళ్ల‌ను విమ‌ర్శిస్తూ కంగ‌నా పోస్ట్ కూడా పెట్టారు. అయితే, ఇప్పుడు ఆమెకు స‌పోర్ట్ గా నిలుస్తున్నారు బాలీవుడ్ న‌టులు. కంగ‌నాకు స‌పోర్ట్ చేసిన వాళ్ల‌లో ఆమె ఎక్స్ హృతిక్ రోష‌న్ కూడా ఉన్నారు. 

ఎవ‌రెవ‌రు స‌పోర్ట్ చేశారంటే? 

కంగ‌నా ర‌నౌత్ 2024 ఎన్నిక‌ల్లో మండీ నుంచి పోటీ చేసి గెలుపొందిన తర్వాత మండీ నుంచి ఢిల్లీ వ‌చ్చారు. ఆ టైంలో చండీగర్‌ ఎయిర్‌ పోర్టులో సెక్యూరిటీ చెకింగ్ టైంలో ఒక కానిస్టేబుల్ ఆమెను చెంప మీద కొట్టారు. అయితే, ఆ ఘ‌ట‌న‌పై ఇప్పుడు బాలీవుడ్ సెల‌బ్రిటీలు స్పందించారు. కంగ‌నా మాజీ ప్రియుడు అని పుకార్లలో వినిపించిన హీరో హృతిక్ రోష‌న్ సహా అలియా భ‌ట్,  జోయా అక్త‌ర్, సోనాక్షి సిన్హా, అర్జున్ క‌పూర్ త‌దిత‌రులు రియాక్ట్ అయ్యారు. ఒక జ‌ర్నలిస్ట్ పెట్టిన పోస్ట్ కి వాళ్లు లైక్ చేసి త‌మ స‌పోర్ట్ తెలియ‌జేశారు. 

ఆ పోస్ట్ ఏంటంటే? 

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఫాయి డి సౌజా ఇన్ స్టాలో ఒక పోస్ట్ చేశారు. “ కంగనా పై జ‌రిగిన దాడిని చూస్తే... హింస ప్ర‌తి విష‌యానికి ప‌రిష్కారం కాదు. ముఖ్యంగా గాంధీ ప‌థంలో న‌డిచే మ‌న దేశంలో హింస మంచిది కాదు. ఒక‌రి మాట‌లు, ఒక‌రి చేష్ట‌లు మ‌న‌కు ఎంత న‌చ్చ‌క‌పోయినా మ‌నం హింస‌తో స‌మాధానం మాత్రం చెప్ప‌కూడ‌దు. యూనిఫాంలో ఉన్న సెక్యూరిటీ ప‌ర్స‌న‌ల్స్ ఇలా చేయ‌డం చాలా డేంజ‌ర్. గ‌త ప‌దేళ్ల‌లో మ‌న‌లో అధికారాన్ని ప్ర‌శ్నించిన వారిపై కానిస్టేబుల్స్ ఇలానే దాడి చేసి ఉంటే ఎలా ఉండేది ఊహించుకోండి” అంటూ ఆమె ప్ర‌శ్నిస్తూ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ని స‌మ‌ర్థించారు బాలీవుడ్ సెల‌బ్రిటీలు. 

మ‌రోవైపు.. కంగ‌నా ర‌నౌత్ మొన్న ఒక పోస్ట్ పెట్టి డిలీట్ చేశారు. అదేంటంటే ఆమెకు బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవ్వ‌రూ క‌నీసం స‌పోర్ట్ చేయ‌లేదంటూ ఆమె ట్వీట్ చేశారు. ఆ త‌ర్వాత దాన్ని డిలీట్ చేశారు. ఒక‌రి ఇంటిమేట్ జోన్ లోకి చొర‌బ‌డ‌టం స‌రైంది అని ఒప్పుకున్న వ్య‌క్తులు, అత్యాచారాలు, హ‌త్య‌ల లాంటి ఘోర‌మైన నేరాల‌ను కూడా స‌మ్మ‌తించిన‌ట్లే క‌దా అంటూ ఆమె ట్వీట్ చేశారు. దాన్ని ఆ త‌ర్వాత డిలీట్ చేశారు. ఇక ఇప్పుడు ఆమెకు బాలీవుడ్ స‌పోర్ట్ గా నిలిచింది. 

ఇదిలా ఉంటే.. న‌టి పూన‌మ్ కౌర్ మాత్రం కంగ‌నాకు వ్య‌తిరేకంగా పోస్ట్ పెట్టారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో వీడియో షేర్‌ చేస్తూ.. "చండీగర్‌ ఎయిర్‌పోర్టులో కంగనాను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్‌ఎఫ్‌ అధికారి(మహిళ కానిస్టేబుల్‌)కుల్విందర్ కౌర్  ధైర్యవంతమైన మహిళ" అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు.  దీంతో పూన‌మ్ కౌర్ పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కొంత‌మంది మాత్రం కంగ‌నా ఎప్పుడూ ఎవ‌రినో ఒక‌రిని ఏదో ఒక‌టి అంటూనే ఉంటుంది. ఆమెకు అలా జ‌ర‌గాల్సిందే అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Also Read: మృణాల్ ఠాకూర్‌కు 'కాంచ‌న 4'లో ఛాన్స్... సారీ ఫ్యాన్స్, క్లారిటీ ఇచ్చిన రాఘవా లారెన్స్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Embed widget