అన్వేషించండి

Kangana Ranaut : నాపై కుట్ర చేస్తున్నారు.. నాతో న‌టించొద్ద‌ని వార్నింగ్ ఇస్తున్నారు: కంగ‌నా ర‌నౌత్

కంగ‌నా ర‌నౌత్ ఎప్పుడూ ఏదో ఒక కాంట్ర‌వర్సీ స్టేట్ మెంట్స్ ఇస్తూ వార్తల్లో నిలుస్తారు. నిజానికి ఆమె ఏది అనుకుంటే అదే చేస్తారు. ఇప్పుడు బాలీవుడ్ లో త‌న‌పై కుట్ర జ‌రిగింద‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

Kangana Ranaut Opens Up On 'Conspiracy' Against Her: బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ కంగ‌నా ర‌నౌత్ ఎప్పుడూ ఏదో ఒక కాంట్ర‌వ‌ర్సీ సృష్టిస్తూనే ఉంటారు. ఆమె మ‌న‌సులో ఏమ‌నుకుందో, ఆమెకు తెలిసిన విష‌యం ఏదైనా ఉంటే దాన్ని బ‌య‌ట‌పెట్టేస్తారు. అలా ఇప్ప‌టికే బాలీవుడ్ లో ఎన్నో బాంబులు పేల్చారు కంగ‌నా ర‌నౌత్. ఇప్పుడు మ‌రోసారి సంచ‌లన కామెంట్స్ చేశారు. త‌న‌పై బాలీవుడ్‌లో కుట్ర చేశార‌ని, త‌న‌తో ఎవ్వ‌రూ న‌టించ‌కుండ బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు అని చెప్పారు కంగ‌నా. 

నాపై కుట్ర జ‌రిగింది.. 

కంగ‌నా న‌టించిన 'ఎమ‌ర్జెన్సీ' సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఆ ప్రమోష‌న్స్‌లో పాల్గొంటున్న ఆమె ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంట‌ర్వ్యూలో ఈ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు ఆమె. “చాలామంది కాస్టింగ్ డైరెక్ట‌ర్స్, డీవోపీలు నాతో ప‌నిచేసేందుకు ముందుకు రాలేదు. యాక్ట‌ర్స్ కూడా భ‌య‌ప‌డ్డారు. ఎందుకంటే వాళ్ల‌కు బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. అంత‌టి కుట్ర చేశారు నా మీద‌. ఇండ‌స్ట్రీలోని కొంత‌మంది పెద్ద‌వాళ్లు నాతో ప‌నిచేయొద్ద‌ని వార్నింగ్ లు ఇచ్చారు”  అని చెప్పారు కంగ‌నా ర‌నౌత్. కానీ ఛాలెంజస్ ఎదుర్కొని అనుప‌మ్ ఖేర్, శ్రేయాస్ త‌ల్ప‌డే, స‌తీశ్ కౌశిక్, మ‌హిమ చౌద‌రి లాంటి వాళ్ల‌తో వ‌ర్క్ చేయ‌డం చాలా మంచి ఎక్స్ పీరియెన్స్ అని, వాళ్ల‌తో క‌లిసి ప‌నిచేయ‌డం త‌న అదృష్టం అని చెప్పారు కంగ‌నా. వాళ్ల‌కు ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా మ‌న‌తో న‌టించ‌డానికి వాళ్లంతా ఒప్పుకోవ‌డం చాలా మంచిగా అనిపించింది అన్నారు ఆమె. ఎమ‌ర్జెన్సీ సినిమా క్రూ మొత్తం త‌న‌తో చాలా క్లోజ్ గా ఉన్నార‌ని, ఒక ఫ్యామిలీలా చూసుకున్నార‌ని చెప్పారు కంగ‌నా.

ఆక‌ట్టుకున్న ట్రైల‌ర్.. 

కంగ‌నా ర‌నౌత్ న‌టించిన 'ఎమ‌ర్జెన్సీ' సినిమా ట్రైల‌ర్ ని ఇటీవ‌లే రిలీజ్ చేశారు. ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ఆ ట్రైల‌ర్ లాంచ్ లో కూడా కంగ‌నా ర‌నౌత్ త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల గురించి మాట్లాడారు. త‌న‌పై ఫ్యాన్స్ చూపించే ప్రేమ‌ను మాత్ర‌మే తాను తీసుకుంటాన‌ని, త‌న‌పై వ‌చ్చే విమ‌ర్శ‌ల‌ను అస్స‌లు ప‌ట్టించుకోని అని చెప్పుకొచ్చారు ఆమె. 

నెగ‌టివ్ పీపుల్ ఉన్నారు.. 

ఇండ‌స్ట్రీలో చాలామంది నెగ‌టివ్‌గా ఆలోచించేవాళ్లు ఉన్నార‌ని, వాళ్ల గ్రూప్ లోని వాళ్లే ఎద‌గాల‌ని ఆలోచిస్తార‌ని అన్నారు కంగ‌నా. “ఇండ‌స్ట్రీలో చాలామంది నెగ‌టివ్ జ‌నాలు ఉన్నారు. వాళ్లంతా గ్రూపులు క‌ట్టి వాళ్ల గ్రూప్‌లో ఉన్న‌వాళ్లే ఎద‌గాల‌ని ఆలోచిస్తారు. అలాంటి వాళ్ల క‌ళ్ల‌లో నేను ఎప్పుడూ ఉంటాను. వాళ్లు న‌న్ను ఎలా ఇబ్బంది పెట్టాలా అని ఆలోచిస్తుంటారు. వంద‌లో 99 శాతం మంది మ‌న‌ల్ని ప్రేమిస్తున్న‌ప్పుడు అలాంటి వాళ్లు చేసే ప‌నులు మ‌న‌కి ఎప్పుడూ న‌ష్టం క‌లిగించ‌వు” అని అభిప్రాయ‌ప‌డ్డారు కంగ‌నా ర‌నౌత్. 

సెప్టెంబ‌ర్ 6 రిలీజ్.. 

కంగ‌నా ర‌నౌత్ ఇందిరా గాంధీ పాత్ర పోషించి, ఆమె డైరెక్ష‌న్ చేసిన సినిమా 'ఎమ‌ర్జెన్సీ'. మ‌న దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించ‌డం, అప్పుడు జ‌రిగిన ప‌రిణామాల ఆధారంగా ఆ సినిమా తీశారు. కాగా.. ఎన్నో వాయిదాల త‌ర్వాత సినిమా సెప్టెంబ‌ర్ 6న రిలీజ్ కానుంది. ఇక ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో మండ్యా స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు కంగ‌నా ర‌నౌత్. బీజేపీ పార్టీ నుంచి ఎంపీగా ఎన్నిక‌య్యారు.

Also Read: ఎన్ కన్వెన్షన్‌ అక్రమ నిర్మాణమే, ఎలాంటి అనుమతే లేదు- కూల్చివేతపై Hydra ప్రకటన

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
AP Crime News: పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
Donald Trump: 120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
Crazy Kalyanam : 'క్రేజీ కల్యాణం' చూసేందుకు రెడీయేనా! - క్రేజీ కాంబోతో వంద శాతం ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్
'క్రేజీ కల్యాణం' చూసేందుకు రెడీయేనా! - క్రేజీ కాంబోతో వంద శాతం ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
AP Crime News: పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
Donald Trump: 120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
Crazy Kalyanam : 'క్రేజీ కల్యాణం' చూసేందుకు రెడీయేనా! - క్రేజీ కాంబోతో వంద శాతం ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్
'క్రేజీ కల్యాణం' చూసేందుకు రెడీయేనా! - క్రేజీ కాంబోతో వంద శాతం ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్
Jana Nayagan OTT : 'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
Ravindra Jadeja: రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Jana Nayakudu : విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
Embed widget