అన్వేషించండి

నెపో మాఫియాకే ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డులు: కంగనా రౌత్ ఫైర్ - సౌత్ సినిమాలకు సపోర్ట్!

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులపై నటి కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అవార్డులన్నీ నెపో కిడ్స్‌కే ఇస్తున్నారంటూ మండిపడింది. అవార్డులు దక్కాల్సింది వీళ్లకేనంటూ ప్రత్యేక జాబితాను కూడా రిలీజ్ చేసింది.

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్, నిత్యం ఏదొక విధంగా వార్తల్లో నిలుస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. వీలుచిక్కినప్పుడల్లా బాలీవుడ్ స్టార్ హీరోలు, స్టార్ కిడ్స్ మీద విమర్శలు చేసే క్వీన్.. గతంలో అనేకసార్లు నెపోటిజం - ఫేవరిజం మీద తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లుగా చెబుతుంది. తాజాగా ఆమె 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్-2023' ప్రధానోత్సవం నేపథ్యంలో 'నెపో మాఫియా' అంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. 

భారతీయ సినీ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం సోమవారం రాత్రి ముంబైలో అట్టహాసంగా జరిగింది. 2022 సంవత్సరానికి గాను బాలీవుడ్ కపుల్ ఆలియా భట్, రణ్‌ బీర్ కపూర్‌ అవార్డులు అందుకున్నారు. 'గంగూబాయి కథియావాడి' సినిమాకు ఉత్తమ నటి కేటగిరీలో అలియా.. 'బ్రహ్మాస్త్ర' చిత్రానికి ఉత్తమ నటుడుగా రణబీర్ ఎంపికయ్యారు. 

అయితే ఆలియా, రణ్‌ బీర్ లను ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేయడంపై కంగనా రనౌత్ పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. అవార్డుల కేటాయింపులో నిర్వాహకులు పక్షపాతంతో వ్యవహరించారని ఆరోపించింది. బాలీవుడ్ లో నెపో మాఫియా కారణంగా మిగతా వారికి అన్యాయం జరుగుతోందని.. అర్హులకు అవార్డులు, అవకాశాలు అందడం లేదని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అందుకునే అర్హత వీరికే ఉందంటూ సోషల్ మీడియాలో ఓ జాబితాని విడుదల చేసింది. 

కంగనా రనౌత్ తన 'దాదా సాహెబ్ ఫాల్కే' అర్హుల జాబితాలో ఉత్తమ నటుడు - రిషబ్ శెట్టి (కాంతారా), ఉత్తమ నటి - మృణాల్ ఠాకూర్ (సీతారామం), ఉత్తమ చిత్రం - కాంతారా, ఉత్తమ దర్శకుడు - ఎస్.ఎస్ రాజమౌళి (ఆర్.ఆర్.ఆర్), ఉత్తమ సహాయ నటుడు - అనుపమ్ ఖేర్ (కశ్మీరీ ఫైల్స్), ఉత్తమ సహాయ నటి - టబు (భూల్ భులయ్యా) మొదలగు వారికి చోటు కల్పించింది. ఇదే విషయంపై ఓ బాలీవుడ్ మీడియా పోర్టల్ స్పందిస్తూ, తన సమకాలీనుల విజయాలపై కంగనా అసూయతో ఉందని పేర్కొంది. అయితే దీనికి కంగనా తాజాగా తనదైన శైలిలో బదులిచ్చింది. 

కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్క్రీన్‌ షాట్‌ లను షేర్ చేస్తూ.. ‘‘నెపో పప్పూస్ ఇప్పటికీ అమ్మ, నాన్నల డైపర్లు వేసుకుంటారు.. హా హ. ఈసారి మెరుగైన పీఆర్ ను ప్రయత్నించండి’’ అంటూ బాలీవుడ్ మీడియా పోర్టల్ కు కౌంటర్ ఇచ్చింది. నెపో కీటకాలు అవకాశాల కోసం తల్లిదండ్రుల పేరును పరిచయాలను ఉపయోగించుకుంటారు. ఎవరైనా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పైకి ఎదిగితే, వారి కెరీర్‌ ను నాశనం చేసే పనిపెట్టుకుంటారు. ఎవరైనా ఎలాగోలా ప్రాణాలతో బయటపడి, వారు నిరంతరం ఎదుర్కొనే వేధింపుల గురించి ఫిర్యాదు చేస్తే, మాఫియాకి అమ్మడుపోయిన ఇలాంటి పీఆర్ చేత వారి ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తారు. అందుకే మీ అందరినీ నాశనం చేయాలని నేను నిశ్చయించుకున్నాను. చెడును నాశనం చేయడమే ధర్మం యొక్క ప్రధాన లక్ష్యం అని శ్రీమద్ భగవత్ గీత చెబుతోంది అంటూ కంగనా తన స్టోరీలో రాసుకొచ్చింది. 

ఇక సినిమాల విషయానికొస్తే, కంగనా రనౌత్ చివరిసారిగా నటించిన 'ధాకడ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌ గా నిలిచింది. ప్రస్తుతం లైనప్ లో ప్రస్తుతం 'తేజస్', 'ఎమర్జెన్సీ', 'చంద్రముఖి-2', 'సీత: ది ఇన్కర్నేషన్' వంటి అనేక ఆసక్తికరమైన చిత్రాలు ఉన్నాయి.

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల జాబితా

ఉత్తమ చిత్రం - ది కాశ్మీర్ ఫైల్స్
ఉత్తమ దర్శకుడు - ఆర్ బాల్కీ (చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్)
ఉత్తమ నటుడు - రణబీర్ కపూర్ (బ్రహ్మాస్త్రా: పార్ట్ 1)
ఉత్తమ నటి - అలియా భట్ (గంగూబాయి కతియావాడి)
మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ - రిషబ్ శెట్టి (కాంతార)
ఉత్తమ సహాయ నటుడు - మనీష్ పాల్ (జగ్‌జగ్ జీయో)
చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ సహకారం - రేఖ
ఉత్తమ వెబ్ సిరీస్ - రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్
విమర్శకుల ఉత్తమ నటుడు - వరుణ్ ధావన్ (భేదియా)
ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ - RRR
టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్ - అనుపమ
సంవత్సరపు అత్యంత బహుముఖ నటుడు - అనుపమ్ ఖేర్ (ది కాశ్మీర్ ఫైల్స్)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Bigg Boss Telugu Season 8 : సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Rashmika Mandanna : పుష్ప 2 సినిమా విడుదల దగ్గరయ్యే కొద్ది రష్మికకు టెన్షన్ పెరిగిపోతుందట, ఇన్​స్టా పోస్ట్​లో చెప్పేసిన బ్యూటీ
పుష్ప 2 సినిమా విడుదల దగ్గరయ్యే కొద్ది రష్మికకు టెన్షన్ పెరిగిపోతుందట, ఇన్​స్టా పోస్ట్​లో చెప్పేసిన బ్యూటీ
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Embed widget