News
News
X

Kalyan Ram On Taraka Ratna Health : ఎందుకీ మౌనం - తారక రత్న హెల్త్ అప్డేట్ మీద కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే?

Taraka Ratna Hospitalized Latest Update : 'అమిగోస్' విడుదల సందర్భంగా ఇంటర్వ్యూ ఇచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్... తారక రత్న ఆరోగ్యం గురించి స్పందించారు.

FOLLOW US: 
Share:

Taraka Ratna Health Latest Update : నందమూరి కథానాయకుడు, యువ రాజకీయ నేత తారక రత్న హెల్త్ ఎలా ఉంది? ఇటు సినిమా ప్రేక్షకులు, అటు తెలుగు దేశం పార్టీ అభిమానులు, ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. 'అమిగోస్' ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన ఆరోగ్యం గురించి చెబుతారని అందరూ ఆశించారు. అయితే, అటు ఎన్టీఆర్ గానీ... ఇటు కళ్యాణ్ రామ్ గానీ... చెప్పలేదు. లేటెస్టుగా, 'అమిగోస్' విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ మాట్లాడారు. 

వైద్యులే చెప్పాలి - కళ్యాణ్ రామ్
తారక రత్న ఆరోగ్యం గురించి కళ్యాణ్ రామ్ (Kalyan Ram On Taraka Ratna Health) ను ప్రశ్నించగా... ''అవన్నీ డాక్టర్లు చెబుతారు. మనం చెప్పకూడదు'' అని సమాధానం ఇచ్చారు. నిజం చెప్పాలంటే... నందమూరి కుటుంబ సభ్యులకు హెల్త్ అప్డేట్ లేకుండా ఉండదు. తప్పకుండా తెలుస్తూ ఉంటుంది. కానీ, ఎవరూ పెదవి విప్పడం లేదు. 

తారక రత్న పూర్తిగా కోలుకోలేదని, అందువల్ల ఆయన ఆరోగ్యం గురించి ఎవరూ ఎక్కడా పెదవి విప్పడం లేదని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం. అవుటాఫ్ డేంజర్ అయితే తప్పకుండా చెబుతారు కదా!

'అమిగోస్'... ఓన్లీ మూవీస్!
నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన 'అమిగోస్' (Amigos Pre Release Event) ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. దానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ వేడుకల్లోనూ తారక రత్న ఆరోగ్యం గురించి నందమూరి హీరోలు మౌనం వహించారు. అన్నయ్య తారక రత్న గురించి ఎన్టీఆర్ మాట్లాడే అవకాశం ఉందని అందరూ ఆశించారు. కానీ, అలా జరగలేదు. అటు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా తారక రత్న ఆరోగ్యం గురించి మౌనం వహించారు. సినిమాల గురించి తప్ప మరో టాపిక్ మాట్లాడలేదు. 

ఇప్పుడు తారక రత్నకు ఎలా ఉంది?
తారక రత్నకు గుండెపోటు వచ్చిన తర్వాత నాలుగైదు రోజులు గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నారు. వైసీపీ ఎంపీ, తారక రత్న భార్య అలేఖ్యా రెడ్డి బాబాయ్ విజయ సాయిరెడ్డి  ఆయనకు థాంక్స్ కూడా చెప్పారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయకు విజయ సాయిరెడ్డి వెళ్ళి వచ్చిన తర్వాత మరో అప్ డేట్ లేదు. అందువల్ల, తారక రత్నకు ఇప్పుడు ఎలా ఉంది? అనే క్వశ్చన్ వస్తోంది. 

Also Read : కన్నీళ్లు పెట్టుకున్న శివన్న - ఓదార్చిన బాలకృష్ణ

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... తారక రత్న ఆరోగ్యం గతంతో పోలిస్తే ఇప్పుడు కాస్త మెరుగు పడింది. అయితే, ఇంకా ఆందోళనకర పరిస్థితి ఉందట. పూర్తిగా నయం కావడానికి మరికొంత సమయం అవసరం అవుతుందట. ఆయన త్వరగా కోలుకోవాలని నందమూరి, నారా కుటుంబ సభ్యులతో పాటు ప్రేక్షకులు, ప్రజలు కోరుకుంటున్నారు. 

తారక రత్నకు ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ తలపెట్టిన 'యువ గళం' పాదయాత్రలో జనవరి 27న పాల్గొనడానికి నందమూరి తారక రత్న కుప్పం వెళ్ళారు. అక్కడ మసీదులోనికి వెళ్ళి వచ్చిన తర్వాత రోడ్డు మీద ఒక్కసారిగా కుప్పకూలారు. తొలుత డీహైడ్రేషన్ కారణంతో సొమ్మసిల్లి పడ్డారని అందరూ భావించారు. వెంటనే ఆస్పత్రికి తీసుకు వెళ్ళారు. ఆ తర్వాత గుండెపోటు అని తెలిసింది. మెదడుకు 45 నిమిషాల పాటు రక్త ప్రసరణ ఆగిందని తెలిపారు. తొలుత కుప్పం ఆస్పత్రులలో చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తీసుకు వెళ్ళారు.

Also Read : 'అన్‌స్టాపబుల్ 2' ఫైనల్‌కు పవర్ టచ్ - సూసైడ్, డిప్రెషన్‌పై పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్!

Published at : 08 Feb 2023 12:41 PM (IST) Tags: Nandamuri Kalyan Ram Taraka Ratna Amigos Movie Taraka Ratna Health Update

సంబంధిత కథనాలు

Dasara Collections: ‘దసరా’ అడ్వాన్స్ బుకింగ్ అదుర్స్ - నాని కెరీర్‌లో సరికొత్త రికార్డు!

Dasara Collections: ‘దసరా’ అడ్వాన్స్ బుకింగ్ అదుర్స్ - నాని కెరీర్‌లో సరికొత్త రికార్డు!

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Silk Smitha Poster: ‘దసరా’ మూవీలో సిల్క్ స్మితా పోస్టర్ వెనుక ఇంత కథ ఉందా - అసలు విషయం చెప్పేసిన దర్శకుడు

Silk Smitha Poster: ‘దసరా’ మూవీలో సిల్క్ స్మితా పోస్టర్ వెనుక ఇంత కథ ఉందా - అసలు విషయం చెప్పేసిన దర్శకుడు

Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!

Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!

Parineeti Chopra Wedding: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత

Parineeti Chopra Wedding: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?