అన్వేషించండి

Kalki 2898 AD: వంద రూపాయలకే 'కల్కి 2898 ఏడీ' టికెట్‌ - బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన మేకర్స్‌

Kalki 2898 AD Tickets: కల్కి 2898 ఏడీ మూవీ టికెట్స్‌పై మేకర్స్ బంపర్ ఆఫర్‌ ప్రకటించింది. మూవీ టికెట్స్‌ని భారీగా తగ్గిస్తూ తాజాగా వైజయంతీ మూవీస్‌ అధికారిక ప్రకటన ఇచ్చారు. 

Kalki 2898 AD Movie Ticket Rates Dropped: ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్‌ మూవీ 'కల్కి 2898 ఏడీ'. జూన్‌ 27న వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ సినిమా 15 రోజులు తిరక్కుండానే వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరింది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 1100 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు చేసినట్టు ట్రేడ్‌వర్గాల నుంచి సమాచారం. ఒక్క ఇండియాలోనే కాదు ఓవర్సిస్‌లోనూ 'కల్కి 2898 ఏడీ' భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికీ థియేటర్లో కల్కి 2898 ఏడీ అదే జోరు చూపిస్తుంది. ఇక ఇడియన్స్‌ని రప్పించేందుకు ఈ మూవీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ నిర్మాణ సంస్థ భారీ ఆఫర్‌ని ప్రకటించింది. ఈ సినిమా టికెట్లను భారీ తగ్గించింది. కేవలం రూ. 100లకే టికెట్ల అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు ట్విటర్‌లో అధికారిక ప్రకటన ఇచ్చారు. అయితే ఇది కేవలం ఈ ఒక్క వారం మాత్రమే. 

రూ. 100కే టికెట్‌

మూవీ విడుదలై నెల రోజులు అవుతున్న ఇప్పటికే థియేటర్లో కల్కి 2898 ఏడీకి మంచి ఆదరణ వస్తోంది. దీంతో మూవీ టీం తక్కువ ధరకే టికెట్లను అందుబాటులో తీసుకువచ్చింది. ఇది కేవలం ఒక్క వారం మాత్రమే. ఆ ఆఫర్‌ ఆగష్టు 2 నుంచి 9వ తేదీ వరకే. లోకేన్‌ ఆఫ్‌ అప్రిసేషన్‌ (token of appreciation) పేరుతో వైజయంతీ మూవీస్‌ ఈ ఆఫర్‌ని ప్రకటించారు. ఇది ఇండియా అంతటా ఆఫర్‌ వర్తిస్తుందని మేకర్స్‌ స్పష్టం చేశారు. దీంతో 'కల్కి 2898 ఏడీ' ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. భారీ రేట్ల వల్ల 'కల్కి 2898 ఏడీ' మూవీ చూడలనేని సామాన్య ప్రజలు కల్కి 2898 ఏడీని థియేటర్లో ఆస్వాధించేందుకు రెడీ అవుతున్నారు. ఇక థియేటర్లో ఈ సినిమాను మిస్‌ అయిన వారు వంద రూపాయలకే ఈ విజువల్‌ వండర్‌ని థియేటర్లో ఆస్వాధించండి. 

అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను నాగ్‌ అశ్విన్‌ విజువల్‌ వండర్‌గా తెరకెక్కించారు. మహాభారతానికి సైన్స్‌ ఫిక్షన్‌ని జతచేసి వెండితెరపై అద్భుతం చేశాడు నాగ్‌ అశ్విన్. ఏకంగా ఈ సినిమా కోసం ఆయన మూడు ప్రపంచాలనే సృష్టించారు. ఆయన విజనరికి దర్శక దిగ్గజాలు సైతం ఆశ్చర్యపోయారు. సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలంతా కల్కి 2898 ఏడీపై ప్రశంసలు జల్లు కురిపించారు. సుమారు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, సీనియర్‌ నటి శోభన వంటి స్టార్స్‌ కీలక పాత్రలో నటించారు. దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, రామ్‌ గోపాల్‌ వర్మ, దుల్కర్‌ సల్మాన్‌, విజయ్‌ దేవరకొండ, మృణాల్ ఠాకూర్‌లు అతిథి పాత్రలో మెరిసారు. 

Also Read: నీ ప్రేమతో నా లైఫ్‌ని మరింత బెటర్‌గా చేస్తున్నావు, నా జీవితంలోకి వచ్చినందుకు థ్యాంక్యూ - మౌనిక రెడ్డి ఎమోషనల్‌

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju: జై జనసేన... 'కొరియన్ కనకరాజు' ప్రీమియర్‌లో లావణ్య... భర్త వరుణ్ తేజ్‌తో సందడి
జై జనసేన... 'కొరియన్ కనకరాజు' ప్రీమియర్‌లో లావణ్య... భర్త వరుణ్ తేజ్‌తో సందడి
Korean Kanakaraju Live Updates - 'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
Korean Kanakaraju OTT : కొరియన్ కనకరాజు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు చూడొచ్చంటే?
కొరియన్ కనకరాజు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు చూడొచ్చంటే?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget