అన్వేషించండి

Nag Ashwin: ఈ యుగం బాక్సాఫీస్‌ స్టార్‌ - ప్రభాస్‌పై డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌, పోస్ట్‌ వైరల్‌

Nag Ashwin About Prabhas: ప్రభాస్‌పై డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీని అంతటి కారణం ఈ వ్యక్తే అంటూ ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించాడు. ఈ యుగం బాక్సాఫీస్‌ స్టార్‌ అంటూ కొనియాడారు. 

Director Nag Ashwin Interesting Comments on Prabhas: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్‌ మూవీ 'కల్కి 2898 AD'. జూన్‌ 27న వరల్డ్‌ వైడ్‌ రిలీజ్‌ అయిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. రిలీజైన ఫస్ట్‌ డే నుంచి బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఏకంగా ఆరు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 680 పైగా గ్రాస్‌ వసూళ్లు రాబట్టి బాక్సాఫీసును షేక్‌ చేస్తుంది. దీంతో మరోసారి ప్రభాస్‌ బాక్సాఫీసు రారాజు అనిపించుకుంటున్నాడు. కాగా 'బాహుబలి' తర్వాత ప్రభాస్‌ బాక్సాఫీసు రారాజుగా నిలుస్తున్నాడు.

తన ప్లాప్‌ సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద రికార్డు క్రియేట్‌ చేశాయి. ఫలితంగా సంబంధం వసూళ్లు రాబడుతున్నాయి.మరోసారి ఇప్పుడు కల్కి 2898 ADతో రికార్డులు తిరగరాస్తూ మరోసారి బాక్సాఫీసు రారాజు అని నిరూపించాడు. కేవలం ఇండియా వైడ్‌గానే కాదు ఓవర్సిస్‌లోనూ కల్కి సత్తా చాటుతుంది.  ఇండియన్‌ మూవీ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు చేసిన సినిమా ఓవర్సిస్‌ బాక్సాఫీసు వద్ద కల్కి రికార్డు సెట్‌ చేసుకుంది. ఒక్క నార్త్‌ అమెరికాలోనే ఇప్పటి వరకు 'కల్కి 2898 AD' 12.8 మిలియన్ల డాలర్‌ గ్రాస్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికీ కలెక్షన్స్‌ పెంచుకుంటూనే పోతుంది. 

ఈ యుగం బాక్సాఫీస్ స్టార్

ఇలా వరుసగా కల్కి బాక్సాఫీసు వద్ద ఆరు రోజులు రూ. 100 కోట్ల గ్రాస్‌ చేస్తూ సత్తా చాటుతుంది. ఇక కల్కి బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించడంతో మూవీ టీం, మేకర్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ ప్రభాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కల్కి నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ అధికారిక ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా కల్కి సెట్‌లో కూల్‌గా కూర్చుని ఉన్న ప్రభాస్‌ ఫోటో షేర్‌ చేస్తూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. "దీని అంతటికి కారణం ఇక్కడ కూల్‌గా కూర్చుని ఉన్న ఈ వ్యక్తే. నిష్పక్షపాతంగా ఈ యుగం బాక్సాఫీసు స్టార్‌ అతడు. ఇందులో ఎలాంటి సంకోచం లేదు. మా ప్రొడక్షన్‌ ఏమైనా చేయగలదు అనే నమ్మకాన్ని ఇచ్చింది అతడే. ఎలాంటి ఇబ్బంది లేకుండ నా పని నేను చేసుకునేలా స్వేచ్ఛను ఇచ్చాడు.

ముఖ్యంగా అతడు ఇచ్చిన తెలివైన ఇన్‌పుట్స్‌ సినిమాకు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడ్డాయి. మీ అందరి 'డార్లింగ్‌'.. మా భైరవ.. ఇప్పుడు ప్రపంచానికి K(కల్కి)"  అంటూ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. కాగా కల్కి చిత్రాన్ని నాగ్ అశ్విన్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. సైన్స్‌ ఫిక్షన్‌ జానర్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసును షేక్‌ చేస్తుంది. కల్కి కోసం మూడు ప్రపంచాలను సృష్టించి విజువల్‌ వండర్‌ క్రియేట్‌ చేశాడు. ఇండియన్‌ మూవీ హిస్టరీలో ఇది అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమా. సుమారు కల్కిని రూ. 600 కోట్ల బడ్జెట్‌తో రూపొందించినట్టు సమాచారం.

 

Also Read: భర్తతో కలిసి ‘కల్కీ 2898 ఏడీ’ చూసిన దీపిక - రణవీర్ స్పందన ‘అత్యుత్తమం’

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
Embed widget