అన్వేషించండి

Jr NTR: ఎన్టీఆర్ మోసపోయాడు - ఇంటి స్థలం వివాదంలో హైకోర్టుకు వెళ్లిన జూనియర్

Jr NTR House: ప్రముఖ సినీ కథానాయకుడు ఎన్టీఆర్ ఇంటి స్థలం వివాదంలో ఉంది. తనకు వ్యతిరేకంగా డెట్‌ రకవరీ ట్రైబ్యునల్‌ (డీఆర్టీ) తీర్పు ఇవ్వడంతో హైకోర్టును ఆశ్రయించారు జూనియర్.

Jr NTR filed petition in Telangana High Court over his house land controversy in Hyderabad: ప్రముఖ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టుకు వెళ్లారు. ఈ హీరోకి చెందిన ఇంటి స్థలం వివాదంలో చిక్కుకుంది. కొన్నాళ్లుగా డెట్‌ రకవరీ ట్రైబ్యునల్‌ (డీఆర్టీ)లో నలుగుతున్న ఈ గొడవ ఇప్పుడు కోర్టుకు చేరింది. అసలు గొడవ ఏమిటి? ఎందుకు కోర్టుకు వెళ్లారు? అనే వివరాల్లోకి వెళితే...

సుంకు గీత నుంచి 2003లో స్థలం కొన్న ఎన్టీఆర్
Jr NTR House In Hyderabad: జూనియర్‌ ఎన్టీఆర్‌ జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీలో సుంకు గీత అనే మహిళ నుంచి 681 చదరపు గజాల స్థలం కొనుగోలు చేశారు. అదీ ఇప్పుడు కాదు... 2003లో! ఆ తర్వాత అందులో ఇంటిని కట్టుకున్నారు. అయితే... ఆ స్థలాన్ని తనఖా పెట్టి 1996లో సుంకు గీత తమ దగ్గర రుణాలు తీసుకున్నారని కొన్ని బ్యాంకులు సర్ఫేసీ యాక్ట్‌ కింద డెట్‌ రకవరీ ట్రైబ్యునల్‌ (డీఆర్టీ) దగ్గరకు వెళ్లాయి. 

స్థలం వివాదంలో ఎవరి వాదనలు ఏమిటి? అనేది చూస్తే... తాను 2003లో ఆ స్థలం కొనుగోలు చేశానని, ప్రభుత్వం నుంచి అనుమతులు అన్నీ తీసుకుని అక్కడ ఇల్లు కట్టుకున్నానని చెబుతున్నారు ఎన్టీఆర్. అయితే... ఆ స్థలాన్ని సుంకు గీత 1996లో తనాఖా పెట్టి తమ దగ్గ లోన్లు తీసుకున్నారని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఓబీసీ), ఇండస్ ఇండ్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా చెబుతున్నారు. ఆ బ్యాంకులు అన్నీ కలిసి 'డీఆర్టీ'ని ఆశ్రయించాయి. ఆ కేసులో డీఆర్టీ నుంచి బ్యాంకులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. తొలుత బ్యాంక్ నోటీసులను సవాల్ చేస్తూ ఎన్టీఆర్ సైతం డీఆర్టీలో పిటీషన్ దాఖలు చేశారు. అయినా బ్యాంకులు అనుకూలంగా తీర్పు రావడంతో ఇప్పుడు హైకోర్టుకు వెళ్లారు.

సుంకు గీతపై పోలీసులకు ఫిర్యాదు
డీఆర్టీ తీర్పును సవాల్ చేస్తూ కోర్టుకు!
ఇంటి స్థలం విషయంలో డీఆర్టీ నుంచి తనకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఆ స్థలం తనకు అమ్మిన సుంకు గీతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు జూ ఎన్టీఆర్. అలాగే, డీఆర్టీ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.

Also Read: వివాదంలో స్టార్ హీరోయిన్‌ కరీనా కపూర్‌ - ఆ పదం వాడినందుకు హైకోర్టు నోటీసులు!

తెలంగాణ హైకోర్టులో ఎన్టీఆర్ వేసిన పిటిషన్‌ మీద జస్టిస్‌ సుజోయ్‌ పాల్‌, జస్టిస్‌ జే. శ్రీనివాస్ రావు సభ్యులుగా ఉన్న ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. డీఆర్టీ ఆర్డర్‌ కాపీ అందుబాటులో లేకపోవడంతో తమకు కొంత సమయం కావాలని జూ ఎన్టీఆర్‌ న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. తదుపరి విచారణను జూన్‌ 6కు వాయిదా వేస్తూ... కేసుకు సంబంధించిన వివరాల డాక్యుమెంట్లు అన్నిటినీ జూన్‌ 3లోగా కోర్టుకు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంటి స్థలం కొనుగోలు చేసిన విషయంలో ఏకంగా హీరో మోసపోవడం ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది.

Also Read: నా వ్యక్తిత్వాన్ని రక్షించండి, కోర్టును ఆశ్రయించిన జాకీ ష్రాఫ్‌ - ఆ సంస్థలకు హైకోర్టు నోటీసులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Attack On Media: గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Prakasam District News: బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Attack On Media: గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Prakasam District News: బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
RBI Governor Salary: ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ జీతం ఎంత, ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి?
ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ జీతం ఎంత, ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి?
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Pushpa 2 Collection: 'పుష్ప 2'కు 1000 కోట్లు... సామి నువ్వు ఆడు సామి... నువ్వు ఆడాలా - బాక్సాఫీస్ బద్దలవ్వాలా
'పుష్ప 2'కు 1000 కోట్లు... సామి నువ్వు ఆడు సామి... నువ్వు ఆడాలా - బాక్సాఫీస్ బద్దలవ్వాలా
Embed widget