By: ABP Desam | Updated at : 25 Sep 2023 09:09 PM (IST)
రూ.1000 కోట్ల క్లబ్ లో 'జవాన్' (Image Credit: X)
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జవాన్’. అట్లీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, హిందీ తమిళం తెలుగు భాషల్లో సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు నుంచే వసూళ్ల వేట ప్రారంభించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మూడో వారంలోనూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే ఎన్నో రికార్డులను బ్రేక్ చేసిన ఈ మూవీ, తాజాగా మరో ఫీట్ సాధించింది. 19 రోజుల్లోనే మైలురాయి 1000 కోట్ల క్లబ్ లో చేరి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
‘జవాన్’ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 1004.92 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ సోమవారం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. కేవలం హిందీలోనే రూ. 505.94 కోట్లు రాబట్టి, ఆల్ టైం మెగా హిట్ గా నిలిచినట్లు పేర్కొన్నారు. వెయ్యి కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన 6వ భారతీయ చిత్రంగా 'జవాన్' నిలిచింది. దీని కంటే ముందు 'దంగల్', 'బాహుబలి 2', 'RRR', 'KGF 2' 'పఠాన్' చిత్రాలు ఈ ఘనత సాధించాయి.
History in the maKING ft. Jawan! 🔥
— Red Chillies Entertainment (@RedChilliesEnt) September 25, 2023
Have you watched it yet? Go book your tickets now! https://t.co/B5xelU9JSg
Watch #Jawan in cinemas - in Hindi, Tamil & Telugu. pic.twitter.com/rhJSF0vdsw
2023 ప్రారంభంలో షారుక్ ఖాన్ నటించిన 'పఠాన్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు 'జవాన్' మూవీతో మరోసారి అదే మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చెయ్యడంతో కింగ్ ఖాన్ పేరిట పలు సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. రెండు 1000 కోట్ల గ్రాస్ సినిమాలు కలిగిన మొట్ట మొదటి ఇండియన్ హీరోగా SRK నిలిచాడు. అంతేకాదు ఒకే ఏడాదిలో రెండుసార్లు ఈ అరుదైన ఘనత సాధించిన హీరోగా, బ్యాక్ టు బ్యాక్ 2 ఆల్ టైమ్ గ్రాసర్స్ కలిగిన ఏకైక ఇండియన్ యాక్టర్ గా షారుక్ చరిత్ర సృష్టించాడు. మరోవైపు ఈ సినిమాతో వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన తొలి తమిళ దర్శకుడిగా అట్లీ నిలిచాడు.
రెండు 1000 కోట్ల సినిమాలున్న హీరోగా రికార్డ్ క్రియేట్ చేసిన కింగ్ ఖాన్.. ఈ ఏడాదిలో మరో రేర్ ఫీట్ సాధించే అవకాశం కలిగి ఉన్నాడు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'డుంకీ' మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ లో రిలీజ్ కానుంది. ఒకవేళ ఈ సినిమా కూడా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధిస్తే, షారుక్ ఖాన్ ఖాతాలో మూడో రూ. 1000 కోట్ల గ్రాసర్ వచ్చి చేరినట్లు అవుతుంది. అదే జరిగితే భారతీయ చలన చిత్ర చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని రికార్డ్ SRK పేరిట నమోదవుతుంది.
Also Read: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ - తెలుగులో ఎప్పుడంటే?
'జవాన్' చిత్రంలో షారుక్ ఖాన్ ద్విపాత్రాభినయం చేసారు. నయనతార హీరోయిన్ గా నటించగా.. విజయ్ సేతుపతి విలన్ పాత్ర పోషించారు. దీపిక పదుకొణె, సంజయ్ దత్ స్పెషల్ రోల్స్ లో కనిపించారు. ప్రియమణి, సునీల్ గ్రోవర్, సన్యా మల్హోత్ర, గిరిజా ఓక్, సంజీతా భట్టాచార్య, లెహర్ ఖాన్, ఆలియా ఖురేషి, రిధి డోగ్రా, ముఖేష్ ఛబ్రా, యోగిబాబు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై షారూక్ ఖాన్ సరీమణి గౌరీ ఖాన్ 300 కోట్లకు పైగా బడ్జెట్ తో 'జవాన్' సినిమాని నిర్మించారు. గౌరవ్ వర్మ సహ నిర్మాతగా వ్యవహరించారు. రాక్ స్టార్ అనిరుధ్ రవి చందర్ సంగీతం సమకూర్చారు. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబరు చివర్లో లేదా నవంబరు మెుదటి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Also Read: సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతోన్న పులిహోర కథలు!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Calling Sahasra Review - కాలింగ్ సహస్ర రివ్యూ: కంఫర్ట్ జోన్ బయటకు 'సుడిగాలి' సుధీర్ - సినిమా ఎలా ఉందంటే?
Atharva Movie Review - అథర్వ సినిమా రివ్యూ: హీరోయిన్‌ను మర్డర్ చేసిందెవరు? క్లూస్ టీమ్‌లో హీరో ఏం చేశాడు?
Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్
Randeep Hooda: మణిపూర్ యువతిని పెళ్లాడిన బాలీవుడ్ హీరో - వెడ్డింగ్ ఫొటోలు వైరల్
Animal Movie Leak : 'యానిమల్' మూవీకి భారీ షాక్ - రిలీజైన కొన్ని గంటల్లోనే హెచ్‌డీ ప్రింట్ లీక్
Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం
Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్
India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం
Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి
/body>