అన్వేషించండి

Jagapathi Babu: ఇప్పుడు సుఖంగా ఉంది - మొహమాటం లేకుండా చెప్పిన జగపతి బాబు

Jagapathi Babu Peddi Interview: రామ్ చరణ్ 'పెద్ది' విడుదల నేపథ్యంలో జగపతి బాబు వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో కెరీర్ గురించి ఎటువంటి మొహమాటం లేకుండా ఓ విషయంపై స్పష్టత ఇచ్చారు.

జగపతి బాబు (Jagapati Babu) ముక్కుసూటి మనిషి. తన మనసులోని మాటలను, తానూ చెప్పాలనుకున్న విషయాన్ని ఎదుటి వ్యక్తిని నొప్పించకుండా చెప్పడం ఆయన నైజం. అలాగే, ఫాల్స్ ప్రెస్టీజ్ వంటి అంశాలకు ఆయన వెళ్ళరు. రామ్ చరణ్ 'పెద్ది' విడుదల నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, విలన్ - క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫేజ్ గురించి మొహమాటం లేకుండా చెప్పేశారు.

ఇప్పుడు సుఖంగా ఉంది - జగపతిబాబు!
'హీరోగా, రొమాంటిక్ హీరోగా, ఇప్పుడు విలన్ - క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా... మీ కెరీర్‌లోని ఏ దశలో మీరు ఎక్కువ సంతోషంగా ఉన్నారు?' అని ప్రశ్నించగా... ''ఇప్పుడు ఉన్న దశే నాకు చాలా సుఖంగా ఉంది'' అని సమాధానం ఇచ్చారు. ఇంకా జగపతి బాబు మాట్లాడుతూ... ''ఇప్పుడు ఎందుకు సుఖంగా ఉందంటే? ఇప్పుడు నా నెత్తి మీద ఎటువంటి బాధ్యత కానీ, భారం కానీ లేదు. హీరోగా ఉన్నప్పుడు... ప్రింట్లు వెళ్లడం, చెక్కుల మీద సంతకాలు, థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ బ్యానర్లు కట్టారా? లేదా? అని బోలెడు టెన్షన్లు ఉండేవి. అప్పట్లో నిర్మాతలు డబ్బులు కట్టకపోతే చెక్కుల మీద నేను సంతకాలు పెడుతూ ష్యూరిటీ ఇచ్చేవాడిని. ఇప్పుడు అటువంటి టెన్షన్లు లేవు. నేను సెట్‌కు వెళ్లి నటించడం, వెళ్ళిపోవడం... అది మాత్రమే నా పని'' అని చెప్పారు. చిక్కులు లేకుండా సంతోషంగా బ్రతకడం తన పాలసీ అని ఆయన వివరించారు.

Also ReadPawan Kalyan Producers Meeting - పవన్‌తో ప్రొడ్యూసర్స్ మీటింగ్ - చిన్నవాళ్ళను పిలవలేదా? వంద కోట్లు నిర్మాతలే వెళ్ళరా?

'పెద్ది'కి అప్పలసూరి ఎమోషనల్ పిల్లర్!
Jagapathi Babu Opens Up On His Role In Peddi Movie: 'పెద్ది' సినిమాలో తన పాత్ర అప్పల సూరి గురించి జగపతి బాబు మాట్లాడుతూ... ''ఈ 'పెద్ది' సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు అవుతుందని నేను నమ్ముతున్నా. ఇందులో నా పాత్ర సినిమాకు ఎమోషనల్ పిల్లర్ లాంటిది. ఇది నెగిటివ్ పాత్ర కాదు... ఈ పాత్ర కోసం నటనలో కంటే నేను పడ్డ కష్టం అంతా డబ్బింగ్‌లో ఉంది. ఆ ఉత్తరాంధ్ర యాస, పాత్రలోని ఎమోషన్ రావడం కోసం రోజుకు కేవలం రెండు మూడు డైలాగులు మాత్రమే చెప్పేవాడిని. ఆ క్రమంలో కొన్నిసార్లు నా నరాలు కూడా బిగుసుకుపోయాయి'' అని చెప్పారు.

Also Read: Madhura Sreedhar Reddy - సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి

'కష్టాల్లో ఉన్నవారికి లేదా యువతకు మీరు ఇచ్చే సలహా ఏమిటి?' అని జగపతి బాబును అడిగితే... ''నేను ఎవరికీ సలహాలు ఇవ్వను. కానీ నా లైఫ్ మంత్ర మాత్రం ఒక్కటే... లెట్ ఇట్ గో (వదిలేయ్) అండ్ సో వాట్ (అయితే ఏంటి). ఏది జరిగినా మన మంచికే అనుకుని ప్రవాహంతో పాటు సాగిపోవాలి. జీవితాన్ని సింపుల్‌గా ఉంచుకుంటే అన్నీ సింపుల్‌గా అవుతాయి'' అని అన్నారు. తాను డెస్టినీ (విధి)ని. జ్యోతిష్యాన్ని బలంగా నమ్ముతానని జగపతి బాబు చెప్పారు. వైదీశ్వరన్ కోయిల్ ( తమిళనాడులోని ఆలయం)లో తన నాడి చూసి తన జీవితంలో జరిగే విషయాలన్నీ ముందే చెప్పారని, అవి అలాగే జరుగుతున్నాయి కూడా జగపతి బాబు తెలిపారు.

Also ReadMahesh Babu Next Movie After Varanasi - 'వారణాసి' తర్వాత... పాన్ ఇండియా యాక్షన్ ఫిలిమ్స్ దర్శకుడితో మహేష్ సినిమా?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Anupama Parameswaran : నా సోషల్ మీడియా... ఏదైనా పోస్ట్ చేస్తా - అనుపమ పరమేశ్వరన్ స్ట్రాంగ్ రియాక్షన్
నా సోషల్ మీడియా... ఏదైనా పోస్ట్ చేస్తా - అనుపమ పరమేశ్వరన్ స్ట్రాంగ్ రియాక్షన్
Korean Kanakaraju Trailer : అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
Lenin OTT : ఓటీటీలోకి అఖిల్ అక్కినేని కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి అఖిల్ అక్కినేని కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Crime Thriller OTT : బాలుని బలి కోరే ఆచారం... మర్డర్ చుట్టూ మిస్టరీ - ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు
బాలుని బలి కోరే ఆచారం... మర్డర్ చుట్టూ మిస్టరీ - ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు
Advertisement

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Bhogapuram Airport Photos: 2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలివే
2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలు
Embed widget