అన్వేషించండి

Madhura Sreedhar Reddy: సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి

Tollywood Producers Issues: నిర్మాతలు సమస్యలు సమస్యలు అని చెప్పడం వల్ల ఇండస్ట్రీ పరువు పోతుందని, సినిమా బిజినెస్ వర్కవుట్ అవ్వకపోతే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపొమ్మని మధుర శ్రీధర్ ట్వీట్ చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సినిమా పరిశ్రమలో సమస్యలు, నష్టాలు సహజమని మధుర శ్రీధర్ రెడ్డి అన్నారు.
  • పరిస్థితులు అనుకూలంగా లేకపోతే సినిమాలు తీయవద్దని సూచించారు.
  • సింగిల్ స్క్రీన్స్ లో కూడా మల్టీప్లెక్స్ ల మాదిరి పర్సెంటేజ్ విధానం ఉండాలి.
  • సినిమా వ్యాపారమే కానీ దాతృత్వం కాదని స్పష్టం చేశారు.

సమ్మర్ సీజన్‌లో వచ్చిన సినిమాలు తక్కువ... సింగిల్ స్క్రీన్ ఓనర్స్ & ఎగ్జిబిటర్స్ వర్సెస్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ గొడవ పుణ్యమా అంటూ వార్తల్లో నిలించింది ఎక్కువ. కలెక్షన్లలో పర్సెంటేజ్ డిమాండ్ చేస్తూ ఎగ్జిబిటర్స్ మీడియా ముందుకు వచ్చిన తర్వాత నిర్మాతలు సైతం చిత్రసీమలో సమస్యలను ఏకరువు పెడుతున్నారు. అలా చేయడం వల్ల ఇండస్ట్రీ పరువు పోతుందని దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి (Madhura Sreedhar Reddy) 'ఎక్స్'లో ట్వీట్ చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?

ఇదేమీ భారతీయ సంక్షోభం... ప్రపంచ సమస్య కాదు!
ఏ బిజినెస్‌లోనైనా రిస్కులు, ఒత్తిడులు, నష్టాలు సహజమని, వాటిని ముందే అర్థం చేసుకుని ఎవరైనా ఆ రంగంలోకి వస్తారని, సినిమా కూడా అంతేనని మధుర శ్రీధర్ రెడ్డి అన్నారు. నిజంగా పరిస్థితులు అనుకూలంగా లేవని అనిపిస్తే సినిమాలు తీయకండని మధుర శ్రీధర్ రెడ్డి సూచించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లిపోండి. కానీ ప్రతిసారీ మైకు ముందు వచ్చి 'సమస్యలు... సమస్యలు' అంటూ ఏడవడం వల్ల ఇండస్ట్రీ పరువు మాత్రమే పోతుంది. ఇదేదో ప్రపంచ సమస్య అయినట్టు… భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం అయినట్టు… (చేస్తున్నారు)'' అని పేర్కొన్నారు. 

Also Read: Pawan Kalyan Producers Meeting - పవన్‌తో ప్రొడ్యూసర్స్ మీటింగ్ - చిన్నవాళ్ళను పిలవలేదా? వంద కోట్లు నిర్మాతలే వెళ్ళరా?

సినిమా అనేది ఒక బిజినెస్… ఛారిటీ కాదు! 
''సిన్సియర్‌గా సినిమాలు తీయండి. వర్కౌట్ అయితే ఉండండి… వర్కౌట్ కాకపోతే బయటికి వెళ్లి వేరే బిజినెస్ చేసుకోండి'' అని మధుర శ్రీధర్ రెడ్డి సూటిగా చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ఒక సినిమాలో నష్టం వస్తే? ఆ నష్టాన్ని తట్టుకునే శక్తి ఉంటే ఇంకో సినిమా తీయండి. లేకపోతే ఆగిపోండి. మీ సమస్యలు, మీ కంపెనీ సమస్యలు, మీ వ్యక్తిగత సమస్యలు అన్నీ కూడా సినిమాపై రుద్దకండి. సినిమా ఒక అద్భుతమైన మీడియం. దాన్ని బాధల వేదికగా మార్చొద్దు'' అని చెప్పారు. సిన్సియర్‌గా సినిమాలు తీయమని, ప్రతి మంచి సినిమాకు ప్రేక్షకుల్లో ఒక మంచి స్థానం తప్పకుండా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సినిమా అనేది ఒక బిజినెస్ అని, ఛారిటీ కాదని ఆయన తెలిపారు.

Also ReadNaga Vamsi Vs Asian Suniel - ఖతమ్ చేస్తా బిడ్డా... కొట్టుకోవడం ఒక్కటే తక్కువ - ఛాంబర్ మీటింగ్‌లో నాగవంశీ vs ఏషియన్ సునీల్

పర్సెంటేజ్‌కు ఓటు వేసిన మధుర శ్రీధర్ రెడ్డి!
రెంటల్ సిస్టమ్ వర్సెస్ పర్సెంటేజ్ మీద కూడా మధుర శ్రీధర్ రెడ్డి తన ఆలోచన, అభిప్రాయాలను సూటిగా చెప్పారు. ''మల్టిప్లెక్సులలో ఎలా అయితే పర్సెంటేజ్ సిస్టమ్ అమలులో ఉందో... సింగిల్ స్క్రీన్స్‌లో కూడా అదే విధానం ఉండాలి. ఎంత పర్సెంటేజ్ ఉండాలనేది నిర్ణయించాలి. కచ్చితంగా పర్సెంటేజ్ సిస్టమ్‌ ఉండాలి'' అని పేర్కొన్నారు శ్రీధర్.

ఇన్నేళ్ళూ రెంట్ లేదా పర్సెంటేజ్, రెంట్ కమ్ పర్సెంటేజ్ అంటూ అటూ ఇటూ ఉన్న విధానాలతో ఇండస్ట్రీని కన్ఫ్యూజ్ చేశారని, కనీసం ఇప్పుడైనా స్పష్టమైన, ప్రొఫెషనల్ బిజినెస్ మోడల్‌ను అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

Also ReadMahesh Babu Next Movie After Varanasi - 'వారణాసి' తర్వాత... పాన్ ఇండియా యాక్షన్ ఫిలిమ్స్ దర్శకుడితో మహేష్ సినిమా?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Objection My Lord Web Series Review - 'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
Crime Thriller OTT : గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget