(Source: ECI/ABP News/ABP Majha)
kevvu kartheek: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట తీవ్ర విషాదం
Kevvu Kartheek: గతేడాది పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించిన జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐదేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న అతడి తల్లి తాజాగా కన్నుమూసిశారు.
Jabardasth Comedian kevvu Kartheek Mother Died: జబర్దస్త్ షో ఎంతోమందిని సెలబ్రిటీలను చేసింది. ఈ కామెడీ షోతో ఎంతో పాపులారిటీ సంపాదించుకోవడమే కాదు ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించుకున్నారు. ఇక ఆర్థికంగా ఎంతోమంది ఎదిగారు. ఇక జబర్దస్త్ షోతో పాపులర్ అయినవాళ్లలో కెవ్వు కార్తీక్ ఒకడు. తనదైన కామెడీతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కార్తీక గతేడాది పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. మొన్న శుభవార్త చెప్పిన కార్తీ అంతలోనే విషాద వార్తను పంచుకున్నాడు.
తాజాగా అతడి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో అతడి తల్లి ఇటీవల కన్నుమూసింది. దీంతో ఈ విషాద వార్తను స్వయంగా కెవ్వు కార్తీక్ సోసల్ మీడియాలో షేర్ చేసుకుంటు ఎమోషనల్ అయ్యాడు. రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ఇటీవల తుదిశ్వాస విడిచినట్టు కార్తీక్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. దీంతో నెటజన్లు, ఫ్యాన్స, ఇండస్ట్రీ ప్రముఖులు కెవ్వు కార్తీక్ సంతాపం తెలుపుతున్నారు. తన తల్లి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.
View this post on Instagram
"అమ్మా.. 5సంవత్సరాలు 2 నెలలుగా ఆ మహమ్మారే భయపడే విధంగా నువ్వు కాన్సర్‌పై అలుపెరుగనిపోరాటం చేశావు. నీ జీవితం అంతా యుద్ధమే చేశాడు. మమ్మల్ని కన్నావు.. నాన్న కి తోడుగా కుటుంబాన్ని కష్టపరిస్థితుల్లో కూడా కంటికి రెప్పలా కాపాడుకున్నావు. అమ్మ ఈ 5 సంవత్సరాల నుండి ఒంటరిగా ఎలా పోరాడాలో నువ్వు నాకు నేర్పించావు. నీ ఆత్మస్తైర్యం నాలో ధైర్యాన్ని నింపింది. అన్ని నేర్పావు కానీ నువ్వు లేకుండాఎలా బ్రతకాలో నేర్పలేదు ఎందుకు అమ్మ.. మా అమ్మ కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. అలాగే మా అమ్మకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ అందరికి నా పాదాభివందనం" అంటూ రాసుకొచ్చాడు.
View this post on Instagram