Poorna Pregnancy : పెళ్లికి ముందు పూర్ణ ప్రెగ్నెంటా? వివాహమైన ఆరు నెలలకు బాబు
Purnaa Blessed With Baby Boy : పెళ్ళికి ముందు పూర్ణ గర్భవతి అయ్యారా? లేదంటే ఆమెకు ఆరు నెలల్లో అబ్బాయి ఎలా పుట్టాడు? నెటిజన్లలో కొందరు ఈ విషయం చర్చలు పెడుతున్నారు. సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, బుల్లితెర కార్యక్రమాల్లో న్యాయనిర్ణేతగా తెలుగు ప్రేక్షకులను అలరించిన పూర్ణ అలియాస్ షమ్నా ఖాసీం (Shamna Kkasim aka Purnaa) తల్లి అయ్యారు. పండంటి మగ బిడ్డకు జన్మ ఇచ్చినట్లు మంగళవారం సోషల్ మీడియాలో ఆమె సంతోషంగా వెల్లడించారు. చాలా మంది పూర్ణకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, కొందరు మాత్రం 'అప్పుడే తల్లి కావడం ఏమిటి?' అని సందేహాలు వ్యక్తం చేశారు. ఎందుకు అంటే...
అక్టోబర్ 25న పెళ్లి అయితే...
అప్పుడే బిడ్డ పుట్టడం ఏమిటి?
పూర్ణ పెళ్లి ఎప్పుడు జరిగిందో గుర్తు ఉందా? అక్టోబర్ 25న! దుబాయ్ వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ & సీఈవో డాక్టర్ షానిద్ అసిఫ్ అలీ (Dr Shanid Asif Ali)తో వివాహమైనట్లు పూర్ణ పేర్కొన్నారు.
అక్టోబర్ 25 నుంచి ఏప్రిల్ 4కి ఎన్ని నెలలు? ఆరు నెలలు కూడా నిండలేదు. ఈ ఆరు నెలల్లో బిడ్డ పుట్టడం ఏమిటి? అని జనాల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే పెళ్లికి ముందు పూర్ణ ప్రెగ్నెంటా? అని ప్రశ్నలు వేస్తున్నారు.
View this post on Instagram
నిజం చెప్పాలంటే... పూషానిద్ అసిఫ్ అలీతో పూర్ణ నిశ్చితార్థం గత ఏడాది జూన్ నెలలో అయ్యింది. ఆ తర్వాత నుంచి సహ జీవనం చేసి ఉండొచ్చు. గర్భవతి అని తెలిసిన తర్వాత త్వరగా వివాహం చేసుకున్నారేమో!? అని నెటిజనులు కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. అదీ సంగతి! పూర్ణ హ్యాపీగా పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లి కావడంతో చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ... ఇద్దరూ దుబాయ్ లోనే ఉన్నట్లు తెలిసింది. కొన్ని రోజుల తర్వాత కేరళకు వచ్చే అవకాశం ఉంది.
View this post on Instagram
నటనకు విరామం ఇవ్వక తప్పదు!
తల్లి కావడంతో నటనకు కొన్ని రోజులు పూర్ణ విరామం ఇస్తారని చిత్రసీమ వర్గాలు భావిస్తున్నాయి. బిడ్డకు కొన్ని రోజులు తల్లి అవసరం ఉంటుంది కదా! అందుకని, పూర్ణ కొన్నాళ్ళు సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ మీద కనిపించే అవకాశాలు లేవు. నిజం చెప్పాలంటే... పూర్ణ కెరీర్ కూడా అంత గొప్పగా ఏమీ లేదు.
Also Read : మళ్ళీ చిక్కుల్లో 'ఆదిపురుష్' - శ్రీరామనవమి పోస్టర్ మీద ముంబైలో కంప్లైంట్
కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేసిన పూర్ణ, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాల్సి వచ్చింది. 'అల్లరి' నరేష్ సరసన 'సీమ టపాకాయ్'లో కథానాయికగా చేశారు. ఆ తర్వాత రవిబాబు తీసిన 'అవును', 'అవును 2' సినిమాల్లో కథ అంతా ఆమె చుట్టూ తిరుగుతుంది. ఎందుకో స్టార్ హీరోయిన్ కాలేకపోయారు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు 'శ్రీమంతుడు' సినిమాలో ప్రత్యేక గీతం చేశారు. ఇటీవల విడుదల అయిన నేచురల్ స్టార్ నాని 'దసరా'లో కీలక పాత్ర చేశారు.
కథానాయికగా అవకాశాలు తగ్గిన తర్వాత బుల్లితెరకు షిఫ్ట్ కావడం ద్వారా పూర్ణ కెరీర్ కంటిన్యూ చేశారు. ఎప్పటికప్పుడు జనాలు తనను మర్చిపోకుండా చూసుకున్నారు. 'ఢీ' షో ఆమెకు బాగా హెల్ప్ అయ్యింది. తర్వాత సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు. దాని ద్వారా ప్రేక్షకులకు తన విశేషాలు తెలియజేస్తూ ఉన్నారు.
Also Read : బాలీవుడ్‌లో ఎన్టీఆర్ భారీ సినిమా - హృతిక్ రోషన్ 'వార్ 2'లో!