శ్రీకాంత్ అడ్డాల సెన్సేషనల్ ప్రాజెక్ట్ 'పెదకాపు' - ఆసక్తికరంగా ఫస్ట్ లుక్!
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తాను తెరకెక్కిస్తున్న కొత్త సినిమాకు సంబంధించి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల గురించి ప్రత్యేక పరిశ్రమ అక్కర్లేదు. ఈ దర్శకుడు తెరకెక్కించిన 'కొత్త బంగారులోకం', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లాంటి సాఫ్ట్ మూవీస్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించిన 'బ్రహ్మోత్సవం' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని అందుకుంది. ఆ సినిమా పరాజయంతో చాలా సంవత్సరాల వరకు శ్రీకాంత్ అడ్డాల మళ్ళీ కనిపించలేదు. చాలా కాలం గ్యాప్ తర్వాత విక్టరీ వెంకటేష్ తో 'నారప్ప' సినిమాతో మళ్లీ డైరెక్టర్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశాడు. తమిళంలో కోలీవుడ్ హీరో ధనుష్ - వెట్రి మారన్ కాంబినేషన్ లో వచ్చిన 'అసురన్' మూవీకి రీమేగా తెరకెక్కిన 'నారప్ప' తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. అప్పటివరకు ఫ్యామిలీ సినిమాలు తెరకెక్కించే శ్రీకాంత్ అడ్డాల నారప్ప లాంటి రా అండ్ డ్రస్టిక్ మాస్ సినిమాలు కూడా చేయగలనని నిరూపించుకున్నాడు.
ఈ క్రమంలోనే తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించాడు ఈ దర్శకుడు. ఈసారి 'అఖండ' లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో 'పెదకాపు' అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా మొదటి భాగం టైటిల్ ఫస్ట్ పోస్టర్ని మూవీ టీం విడుదల చేసింది. ఈ మేరకు మొదటి భాగానికి 'పెదకాపు- 1' అనే టైటిల్ను ఖరారు చేశారు. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మేనల్లుడు విరాట్ కర్ణ ఈ సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయం అవుతున్నాడు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఇంటెన్స్ గా కనిపిస్తోంది. పోరాటానికి సిద్ధమవుతున్న యువకుడి చేతిని పైకెత్తుతూ విరాట్ కర్ణ పోస్టర్లో గుబురు గడ్డంతో కనిపించాడు. ఇక ఈ పోస్టర్ పై ఓ సామాన్యుడి సంతకం అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. ఇక సినిమా 90వ దశకం నేపథ్యంలో ఉంటుందట. ఆ కాలంనాటి రాజకీయాలు, గొడవల ఆధారంగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా ఫస్ట్ లుక్ ను రివిల్ చేస్తూ మరో బిగ్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి అంటూ మూవీ టీం ప్రకటించింది. దీన్నిబట్టి త్వరలోనే సినిమాకు సంబంధించి టీజర్ విడుదలయ్య అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల కులం పేరుతో ' పెదకాపు' అనే టైటిల్ ని పెట్టడంతో టైటిల్ విషయంలో ఏవైనా వివాదం అవుతుందా అని అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడూ సాఫ్ట్ చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల నుండి రాబోతున్న ఓ విభిన్నమైన ప్రయత్నం గా ఈ 'పెదకాపు' సినిమా చెప్పుకోవచ్చు. మిరియాల సత్యనారాయణ సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ ఫైట్స్ కంపోస్ట్ చేస్తున్నారు. చోటా కె నాయుడు DOP గా వ్యవహరిస్తున్నారు.
A Common Man's Fierce will lead to a new chapter 💥
— Dwaraka Creations (@dwarakacreation) June 2, 2023
- https://t.co/LOOy88ZWJb
Here's the Intense Motion Poster of #PeddhaKapu1 💥
Introducing @ViratKarrna ✨@srikanthAddala_ @MickeyJMeyer@NaiduChota #MarthandKVenkatesh@mravinderreddyy pic.twitter.com/0y3afiuZWN
Also Read: వామ్మో, అంత భారీ ఫైటా? రామ్తో 24 రోజులు షూటింగ్, 1500 మందితో యాక్షన్ స్వీక్వెన్స్