అన్వేషించండి

షారుక్ బర్త్ డే గిఫ్ట్ - ఫన్ అండ్ ఎమోషనల్​గా 'డంకీ' టీజర్, మీరు చూశారా?

షారుక్ ఖాన్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న 'డంకీ' సినిమా నుంచి టీజర్ ని విడుదల చేశారు మేకర్స్. సోషల్ మీడియాలో ఈ టీజర్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది.

బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్ కి ఓ సర్ ప్రైజ్ ని ప్లాన్ చేసింది 'డంకీ'(Dunki) మూవీ టీం. నవంబర్ 2 షారుక్ ఖాన్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్ కోసం 'డంకీ' నుంచి టీజర్​ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టీజర్ ఫ్యాన్స్​ని ఆకట్టుకుంటుంది. ఏడాది 'పఠాన్', 'జవాన్' వంటి సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.2000 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న షారుక్ ఖాన్ తాజాగా నటిస్తున్న చిత్రం 'డంకీ'(Dunki). ఈ మూవీతో ఎలాగైనా హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు షారుక్. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతోంది.

అందులో మొదటి భాగం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే గురువారం షారుఖ్ ఖాన్ బర్త్ డే కావడంతో 'డంకి' నుంచి టీజర్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక టీజర్ ని గమనిస్తే.. టీజర్ ఆరంభంలో షారుక్ ఖాన్​తో పాటు కొంతమంది ఎడారిలో నల్ల డ్రస్ ధరించి ఇల్లీగల్ గా దేశం దాటుతూ కనిపిస్తారు. అది చూసిన ఒకడు వారిపై అనుమానం వచ్చి గన్​తో వారిలో ఒకరిని కాల్చడం.. అనంతరం ఆ సీన్ డైవర్ట్ చేసి ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్లారు. ఫ్లాష్ బ్యాక్​లో ఫన్ అండ్ ఎమోషనల్​గా పాత్రలను పరిచయం చేస్తూ టీజర్​ని ముందుకు తీసుకెళ్లారు.

ఇక టీజర్​లో ఐదుగురు యంగ్ స్టార్స్ ఉన్నతమైన జీవితం కోసం ఇంగ్లాండు వెళ్లాలని కలను నెరవేర్చుకునేందుకు చేసిన ప్రయత్నమే ఈ సినిమా కథ అని టీజర్ చూస్తే అర్థమవుతుంది. పంజాబ్ ప్రాంతంలోని యువకుల కథను ఇతివృత్తంగా చేసుకొని ఈ సినిమాను రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇంగ్లాండు వెళ్లేందుకు వారు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? ఇల్లీగల్ గా దేశాన్ని దాటేందుకు సిద్ధమైన వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనే అంశాలను దేశభక్తిని జోడించి ఎమోషనల్ గా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇందులో షారుక్ తో పాటు తాప్సి, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు.

'మున్నాభాయ్ ఎంబిబిఎస్', 'లగేరహో మున్నాభాయ్', త్రీ ఇడియట్స్, 'పీకే', 'సంజు' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన రాజ్ కుమార్ హిరానీ కచ్చితంగా ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకుంటారని అంతా భావిస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన ఈ టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను రెట్టింపు చేసింది. ఇక టీజర్ లో షారుక్ క్లీన్ షేవ్ తో యంగ్ లుక్ తో ఆకట్టుకున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్ కుమార్ ఇరానీ ఫిలిమ్స్ అండ్ జియో స్టూడియోస్ నిర్మాణ సంస్థలపై షారుక్ భార్య గౌరీ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ 'సలార్' మూవీతో పోటీ పడబోతోంది. 'డంకీ' డిసెంబర్ 21న విడుదల అవుతుంటే, 'సలార్' మరుసటి రోజు అంటే డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ పోటీలో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.

Also Read : రామ్ చరణ్ అరుదైన గౌరవం, ఆస్కార్‌ యాక్టర్స్ బ్రాంచ్​లోకి ఎంట్రీ!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - కొరియన్ కనకరాజు To క్రైమ్ థ్రిల్లర్ ఉన్మాదం... ఒక్క రోజే 13 సినిమాలు స్ట్రీమింగ్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - కొరియన్ కనకరాజు To క్రైమ్ థ్రిల్లర్ ఉన్మాదం... ఒక్క రోజే 13 సినిమాలు స్ట్రీమింగ్
Action Thriller OTT : కన్న కూతురి కోసం చూపు లేని తల్లి పోరాటం - ఈ అభినవ గాంధారి కథేంటి... ఆ ఓటీటీలోకి డైరక్ట్‌గా కొత్త మూవీ
కన్న కూతురి కోసం చూపు లేని తల్లి పోరాటం - ఈ అభినవ గాంధారి కథేంటి... ఆ ఓటీటీలోకి డైరక్ట్‌గా కొత్త మూవీ
Jagamae Sangeetham Series OTT : మెగాస్టార్ రుద్రవీణ గుర్తొచ్చింది - జగమే సంగీతం సిరీస్‌పై నటుడు అక్షయ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
మెగాస్టార్ రుద్రవీణ గుర్తొచ్చింది - జగమే సంగీతం సిరీస్‌పై నటుడు అక్షయ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
I'm Game Twitter Review - 'ఐయామ్ గేమ్' ట్విట్టర్ రివ్యూ: దుల్కర్ సల్మాన్ సినిమా డిజాస్టరేనా? సోషల్ మీడియా టాక్ ఏంటి?
'ఐయామ్ గేమ్' ట్విట్టర్ రివ్యూ: దుల్కర్ సల్మాన్ సినిమా డిజాస్టరేనా? సోషల్ మీడియా టాక్ ఏంటి?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 3 | సంజూ రాజకీయాన్ని దెబ్బకొట్టిన మీనా
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Vaibhav Creates History In Duleep Trophy | దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఆల్ టైమ్ రికార్డ్
IND vs AFG T20s | అఫ్గాన్‌ సిరీస్‌ పై కృనాల్ పాండ్యా పోస్ట్ వైరల్
Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Elections: స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
Konda Surekha: నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Konda Surekha Out: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
AP IPS Officers Suspension Lifted: ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
Abhinandan Varthaman: ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
YS Jagan: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
Son Kills Father Chittoor: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
Kadiri BJP Flexies Torn:కదిరిలో పొత్తు చిచ్చు - బీజేపీ ఫ్లెక్సీల చించివేత.. ఎమ్మెల్యే కందికుంట వర్గీయులపై అనుమానాలు!
కదిరిలో పొత్తు చిచ్చు - బీజేపీ ఫ్లెక్సీల చించివేత.. ఎమ్మెల్యే కందికుంట వర్గీయులపై అనుమానాలు!
Embed widget