అన్వేషించండి

Prabhas: ప్రభాస్‌-హను రాఘపూడి సినిమాలో హీరోయిన్‌గా కొరియోగ్రాఫర్‌ - ఆమె పేరు, బ్యాగ్రౌండ్‌ ఏంటంటే!

Prabhas-Hanu Raghavapudi Movie: ప్రభాస్‌-హను రాఘవపూడి సినిమాలో హీరోయిన్‌గా కొత్త అమ్మాయి టాలీవుడ్‌కు పరిచయం కాబోతోంది. ఆమె బాలీవుడ్‌కు చెందిన కొరియోగ్రాఫర్‌ అని సమాచారం.

Prabhas and Hanu Raghavapudi Movie Heroine Details: బాహుబలి నుంచి పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఫలితాలతో సంబంధం లేకుండ వరుసగా సినిమాలు చేస్తున్నారు. పాన్‌ ఇండియా, భారీ ప్రాజెక్ట్స్‌తో అరడజన్‌ సినిమాలకు తక్కువ కాకుండా లైన్లో పెడుతున్నాడు. ఒకేసారి రెండు మూడు సినిమాల షూటింగ్స్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో సలార్‌ 2, కల్కి 2898 ఏడీ పార్ట్‌ 2, మారుతితో రాజా సాబ్‌, సందీప్‌ రెడ్డి వంగాతో స్పిరిట్‌ చిత్రాలు ఉన్నాయి.

అలాగే సీతారామం డైరెక్టర్‌ హనురాఘపూడితో ఓ సినిమాను కూడా లైన్లో పెట్టాడు. ఇటీవల దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అప్పుడే ఈ సినిమా టైటిల్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. దీనికి ఫౌజీ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇవాళ ఈ సినిమా పూజా కార్యక్రమంతో గ్రాండ్‌గా లంచ్‌ అయ్యింది. నిరాడంబరంగా జరిగిన ఈ మూవీ పూజా కార్యక్రమంలో కేవలం చిత్ర బృందం మాత్రమే పాల్గొంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Imanvi (@iman1013)

ఇక ఈ పూజా కార్యక్రమంలో హీరోయిన్ కూడా పాల్గొంది. మొన్నటి వరకు ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరనేది క్లారిటీ లేదు. పాకిస్తానీ నటి నటి సజల్ అలీని ఎంపిక చేశారని ప్రచారం జరిగింది. మరోవైపు మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా ఫిక్స్‌ అయ్యిందంటూ వార్తలు వినిపించాయి. అయితే వార్తలను మృణాల్ కొట్టిపారేసింది. దీంతో అంతా పాకిస్తాన్‌ నటి సజల్ అలీ అని అనుకున్నారు. కానీ తాజాగా పూజ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు షేర్‌ చేయడంతో కొత్త హీరోయిన్‌ తెరపైకి వచ్చింది. ఆమె పేరు ఇమాన్ ఇస్మాయిల్‌. ఈ సినిమాతోనే ఆమె తొలిసారి హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది.

ఇమాన్ ఇస్మాయిల్‌ చిన్నప్పట్నుంచి డ్యాన్సర్. ఉత్తరాదికి చెందిన ఆమె అక్కడ కొరియోగ్రఫర్‌గా కొనసాగుతుంది. ఆడపదడప సినిమాల్లోనూ చిన్న చిన్ప పాత్రలు చేస్తూ నటిగా రాణిస్తుంది. ఇప్పుడు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయం అవుతున్న ఆమె ఏకంగా పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ సరసన హీరోయిన్‌ చాన్స్‌ కొట్టేసింది. దీంతో ఒక్కసారి ఇమాన్‌ ఇస్మాయిల్‌ పేరు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. ఇంతకి ఎవరామె, ఆమె బ్యాగ్రౌండ్‌ ఏంటా అని అంతా ఆరా తీస్తున్నారు. ఇక ఇమాన్ ఇస్మాయిల్‌ సోషల్‌ మీడియాలో పుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన డ్యాన్స్‌ వీడియో షేర్‌ చేస్తూ భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. నెట్టింట ఆమె డ్యాన్స్‌ వీడియో తరచూ వైరల్‌ అవుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ భామ డైరెక్టర్‌ హను రాఘవపూడిని ఆకట్టుకుని ఏకంగా ప్రభాస్‌ సరసన చాన్స్‌ కొట్టేసింది. దీంతో ఇండస్ట్రీ వర్గాలంతా ఈ అమ్మడి లక్క్‌ మామూలుగా లేదంటున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Imanvi (@iman1013)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Imanvi (@iman1013)

Also Read: ప్రభాస్‌-హను రాఘవపూడి సినిమా స్టార్ట్‌ - సైలెంట్‌గా పూజా కార్యక్రమం జరిపించిన టీం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్? - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్? - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్? - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్? - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Tirumala: తిరుమలలో మహిళలు తలలో పూలు పెట్టుకుంటే ఏమవుతుంది ..అసలెందుకు పూలు పెట్టుకోరు!
తిరుమలలో మహిళలు తలలో పూలు పెట్టుకుంటే ఏమవుతుంది ..అసలెందుకు పూలు పెట్టుకోరు!
Embed widget