అన్వేషించండి

iBOMMA Telugu Movies: ఫస్ట్ వారిపై దృష్టి పెట్టండి - పోలీసులకు 'iBOMMA' సవాల్

iBOMMA Warning: పైరసీ వెబ్ సైట్ iBOMMA పేరుతో తెలుగులో రిలీజ్ అయిన ఓ ప్రకటన తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. మీరు మాపై ఫోకస్ చేస్తే మేం మీపై ఫోకస్ చేస్తామంటూ పోలీసులకు సవాల్ విసిరారు.

iBOMMA Release Note On Piracy Content: iBOMMA... ఈ పేరు తెలియని మూవీ లవర్ ఉండరు. అటు థియేటర్‌లో కానీ ఇటు ఓటీటీలో కానీ ఏ కొత్త మూవీ కానీ కంటెంట్ కానీ వచ్చినా అది హై క్వాలిటీ ప్రింట్‌తో ఇందులో ప్రత్యక్షం అవుతుంది. రీసెంట్‌గా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సినిమా, ఓటీటీ పైరసీ కేసుకు సంబంధించి భారీ నెట్వర్క్‌ను ధ్వంసం చేసి ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. థియేటర్స్‌లో రికార్డ్ చేస్తున్న వారితో పాటు సర్వర్లు హ్యాక్ చేస్తున్న ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి హార్డ్ డిస్క్‌లు, ల్యాప్ టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. పైరసీ వల్ల ఇండస్ట్రీకి దాదాపు రూ.22 వేల కోట్ల నష్టం వచ్చినట్లు తెలిపారు. 

పైరసీ కేసు విచారణ క్రమంలో 'iBOMMA' వెబ్ సైట్‌పై దృష్టి సారించిన పోలీసులు దీని కోసం పని చేస్తోన్న నలుగురు నిందితులను ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు. బిహార్, యూపీ రాష్ట్రాల్లో ఈ వెబ్ సైట్‌కు ఏజెంట్స్ ఉన్నట్లు గుర్తించారు. పైరసీ కంటెంట్ కట్టడి చేసేందుకు విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలో 'iBOMMA' పేరుతో తెలుగులో ఓ ప్రకటన రిలీజ్ కావడం వైరల్ అవుతోంది. 

పోలీసులకు సవాల్

సినిమాలకు అనవసర బడ్జెట్ పెట్టి దాన్ని రికవరీ చేసేందుకు ప్రేక్షకులపై రుద్దుతున్నారని... దీని వల్ల సాధారణ ప్రేక్షకుడు, ముఖ్యంగా మిడిల్ క్లాస్ మ్యాన్ బాధ పడుతున్నట్లు ప్రకటనలో 'iBOMMA' పేర్కొంది. 'iBOMMA మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. థియేటర్లలో ప్రింట్స్ తీసిన వారి మీద కాకుండా మీ OTT రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు. బడ్జెట్‌లో ఎక్కువ శాతం రెమ్యునరేషన్స్, విదేశాల్లో షూటింగ్, ట్రిప్స్‌కు ఖర్చు చేస్తున్నారు. ప్రొడక్షన్, లైట్ బాయ్స్‌కు ఎంత ఖర్చు చేస్తున్నారు? ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది కదా?.

ఫస్ట్ కెమెరాల సాయంతో థియేటర్లలో మూవీస్ రికార్డు చేసి ఫ్రింట్స్ రిలీజ్ చేసే వెబ్ సైట్ల మీద దృష్టి పెట్టండి. iBOMMA అనేది సిగరెట్ నుంచి E- సిగరెట్‌కు యూజర్స్‌ను మళ్లించే ప్రక్రియ. మీ యాక్షన్‌కు నా రియాక్షన్ ఉంటుంది. మేం స్వతహాగా వెబ్ సైట్ నుంచి తొలగిస్తున్నాం. వెంటనే డిలీట్ చేస్తే మీకు భయపడి లేదా మీకు తీయించినట్లు ఉంటుంది. అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత తీసేయాలని అనుకుంటున్నాం. బురదలో రాయి వేయకండి. మేము ఏ దేశంలో ఉన్నా భారతదేశం, అందులో తెలుగు వారి కోసం ఆలోచిస్తాం.' అంటూ 'iBOMMA' పేరుతో ప్రకటన విడుదలైంది.

తమ సర్వర్లు ఎక్కడున్నాయో పోలీసులకు కనపడవని... OTT, మీడియా, హీరోలు అందరి వివరాలు బయటకు వస్తాయని iBOMMA తెలిపింది. గతంలోనూ ఈ వెబ్ సైట్ ఇలాంటి ప్రకటనే విడుదల చేసింది. తాజాగా... పోలీసులకే సవాల్ విసరడం హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: 'మన శంకర వరప్రసాద్ గారి'తో బ్యూటిఫుల్ 'శశిరేఖ' - 'దసరా' స్పెషల్ సర్ ప్రైజ్ కోసం వెయిటింగ్

మరోవైపు, ఇండస్ట్రీ పెద్దలు, హీరోలు తెలంగాణ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే అతి పెద్ద పైరసీ నెట్వర్క్ ధ్వంసం చేసినందుకు థాంక్స్ చెప్పారు. పైరసీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Anil Ravipudi Animated Movie : అనిల్ రావిపూడి యానిమేటెడ్ మూవీ - వెరీ స్పెషల్‌గా రామాయణం
అనిల్ రావిపూడి యానిమేటెడ్ మూవీ - వెరీ స్పెషల్‌గా రామాయణం
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
Embed widget