అన్వేషించండి

iBOMMA Warning: టాలీవుడ్‌కు 'ఐబొమ్మ' మాస్ వార్నింగ్ - చావుకు భయపడని వాడు, దేనికి భయపడడు!

ఓటీటీ కంటెంట్ ను పైరసీ చేసే 'ఐబొమ్మ' వెబ్‌సైట్‌ ఇప్పుడు ఏకంగా సినీ ఇండస్ట్రీకే వార్నింగ్ ఇస్తోంది. మీరు మా మీద ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం అంటూ ఓపెన్ లెటర్ రిలీజ్ చేసింది. 

'ఐబొమ్మ' గురించి కొంతమంది సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ నుంచి కొత్త సినిమాలను డౌన్లోడ్ చేసుకునే ప్రతీ ఒక్కరికి ఈ iBOMMA వెబ్ సైట్  గురించి తెలిసే ఉంటుంది. ఓటీటీలో వచ్చే సినిమాలను, వెబ్ సిరీస్ లను తెలుగు ప్రేక్షకులకు ఈ వెబ్సైట్ ఫ్రీగా అందిస్తుంది. అంటే పైరసీ చేసి ఇస్తుంది. ఈ పైరసీ సైట్ ను ఎవరు నిర్వహిస్తున్నారనేది తెలియదు కానీ, ఏదైనా కొత్త కంటెంట్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లోకి వచ్చిందంటే చాలు, వెంటనే ఐ బొమ్మ వెబ్‌సైట్‌ లో దర్శనమిస్తుంది. థియేటర్ లో తీసిన కెమెరా ప్రింట్స్ ని కాకుండా కేవలం హై క్వాలిటీ HD ప్రింట్స్ ను స్ట్రీమింగ్ చేయడం ఐ బొమ్మ ప్రత్యేకత అని చెప్పాలి. అయితే ఈ పైరసీ సైట్ ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ కే మాస్ వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. 

పైరసీ సైట్స్ అనేవి మొదటి నుంచీ సినిమా ఇండస్ట్రీకి శాపంగానే తయారయ్యాయి. కాకపోతే ఇటీవల కాలంలో టికెట్ రేట్లు పెరగడం, ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ రేట్లు అధికంగా ఉండటంతో మూవీ లవర్స్ ఎక్కువగా ఈ వెబ్ సైట్లను ఆశ్రయిస్తున్నారు. వందల రూపాయలు పెట్టి ఏడాది లేదా నెల సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం ఎందుకు, 'ఐబొమ్మ'లో ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ఉచితంగా దొరుకుతోంది కదా అని ఆలోచిస్తున్నారు. దీంతో కోట్లు ఖర్చు చేసి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కొనుక్కునే ఓటీటీల ఆదాయానికి గండిపడుతోంది. డిజిటల్ రిలీజైన వెంటనే పైరసీ చేస్తుండటం ఇండస్ట్రీకి పెద్ద సవాలుగా మారుతోంది. దీన్ని అరికట్టడానికి, ఐబొమ్మపై చర్యలు తీసుకోడానికి టాలీవుడ్ ఫిలిం మేకర్స్ ప్రయత్నిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఐ బొమ్మ నిర్వాహకులు సినీ ఇండస్ట్రీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఐబొమ్మ మీద ఫోకస్ చేస్తే ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం అంటూ వెబ్ సైట్ లో పెట్టిన ఓపెన్ లెటర్ స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిల్లో ఏముందంటే.. 

''ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్స్ కు ప్రింట్స్ అమ్మిన తర్వాత మీకు ఏమీ పట్టనట్లు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ల మీద కాకుండా, మీ ఓటీటీ రెవిన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు. 
1. హీరోలకు అంత రెమ్యూనిరేషన్‌ అవసరమా? అది మీ కొడుకు అయినా ఎవరు అయినా.. 
2. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వాళ్లు ఏం అయిపోతారు అని కబుర్లు చెప్పకండి.. వాళ్లకి మీరు ఇచ్చే అమౌంట్‌ ఏ కూలి పని చేసిన వస్తాయి.. కానీ మీ హీరోకి హీరోయిన్‌ కి వస్తాయా? 
3. సినిమా బడ్జెట్‌లో ఎక్కువ శాతం రెమ్యూనరేషన్స్‌, విదేశాల్లో షూటింగ్‌ లకు, ట్రిప్స్‌కి ఖర్చు పెడుతున్నారు. ప్రొడక్షన్‌ బాయ్స్‌ నుంచి లైట్‌ బాయ్స్‌ వరకు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇండియాలో షూటింగ్‌ చేస్తే బడ్జెట్‌ తగ్గుతుంది కదా? అక్కడి వాళ్లకి ఉపాధి కలుగుతుంది కదా..
4. అనవసర బడ్జెట్‌ పెట్టి ఆ బడ్జెట్‌ రికవెరీని మా మీద రుద్ది ఎక్కువకి అమ్ముతున్నారు. డిస్ట్రిబ్యూటర్స్‌ అండ్‌ థియేటర్‌ ఓనర్స్‌ ఆ అమౌంట్‌ని కలెక్ట్‌ చేసుకోవడానికి టికెట్‌ అమౌంట్‌ పెంచుతున్నారు. చివరికి మధ్య తరగతి వాడే బాధపడుతున్నాడు''

''మా వెబ్‌ సైట్‌ మీద ఫోకస్‌ చేయడం ఆపండి.. లేదంటే నేను మీ మీద ఫోకస్‌ చేయాల్సి వస్తుంది. ఫస్ట్‌ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్‌ చేసే వెబ్‌ సైట్ల మీద మీ దృష్టి పెట్టండి. ఐ బొమ్మ అనేది సిగరేట్‌ నుంచి e-సిగరేట్‌ కు యూజర్స్‌ని మళ్లించే ప్రక్రియ. మీ యాక్షన్‌కి నా రియాక్షన్‌ ఉంటుంది. ఈ మిడిల్‌లో వేరే ఏ హీరో కూడా (ఉదాహరణ: విజయ్) టార్గెట్‌ అవ్వటం ఇష్టం లేదు. మేము స్వతహాగా వెబ్‌ సైట్‌ నుంచి తొలగిస్తున్నాం. ఇప్పుడు ఇమ్మీడియేట్‌ గా డిలీట్‌ చేస్తే మీకు భయపడి లేదా మీరు తీయించినట్టు ఉంటుంది. అందుకే ఈ పోస్ట్‌ చేసిన కొన్ని గంటల తర్వాత తీసివేయాలని అనుకుంటున్నాం''

''ఐ బొమ్మ వాళ్లు ఇండియాలో తీసివేసిన తర్వాత వాళ్లని రిక్వెస్ట్‌ చేసి టెక్నాలజీ షేర్‌ చేయాలని కోరాము. దానికి వాళ్లు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్లు కూడా షేర్‌ చేయడం లేదు. మేం ibomma.net వాళ్లంత మంచివాళ్లం కాదు. బురదలో రాయి వేయకండి.. అది కూడా పెంట మీద అసలు వేయకండి. మేం ఏ దేశంలో ఉన్నా భారతదేశం, అందులో తెలుగు వారి కోసం ఆలోచిస్తాము. చావుకు భయపడని వాడు.. దేనికి భయపడడు. పోగొట్టుకోవడానికి ఏమీ లేని మనిషి కంటే ప్రమాదకరమైనది మరొకటి లేదు'' అని ఐబొమ్మ ప్రకటనలో పేర్కొన్నారు. 

Also Read: షారూఖ్ ఖాన్ మేనేజర్ సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఐ బొమ్మ వాళ్ళు కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ను రైజ్ చేసారని వార్నింగ్ లెటర్ కు కొందరు నెటిజన్లు మద్దతుగా నిలిస్తున్నారు. సినిమా రిలీజైన వెంటనే థియేటర్ లో తీసిన కెమెరా ప్రింట్స్ ను అప్లోడ్ చేసే వాళ్లపై ముందుగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరికొందరు మాత్రం దొంగతనంగా పైరసీ చేసేదే కాక, ఏదో సమాజ సేవ చేస్తున్నట్లు సినీ ఇండస్ట్రీకే వార్నింగ్ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ వెబ్ సైట్ పై వీలైనంత త్వరగా యాక్షన్ తీసుకోవాలని అంటున్నారు. 

నిజానికి గతంలో ఐ బొమ్మ వెబ్సైట్ ను నిలిపివేస్తున్నట్లు నిర్వహకులు ఓ ప్రకటన చేశారు. ఆ తర్వాత దాన్ని మళ్ళీ కొనసాగించారు. డేటా దొంగిలిస్తున్నామని తమ మీద ఆరోపణలు చేస్తున్నారు.. ఇది కరెక్ట్ కాదంటూ మరోసారి వెబ్సైట్ నిలిపివేస్తున్నామని ప్రకటించారు. అనంతరం భారతదేశం వరకు ఈ సేవలు నిలిపి వేస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో కొన్ని రోజులు ఐ బొమ్మ సైట్ నిలిచిపోయింది. ఆ సమయంలో ఐ బొమ్మను పోలిన మరో కొన్ని కొత్త స్పామ్ వేర్ వెబ్సైట్లు పుట్టుకొచ్చాయి. ibomma.net నుంచి టెక్నాలజీని తీసుకొని ప్రస్తుత విదేశాల్లో ఐబొమ్మ కొత్త సైట్ ను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి ఆపరేట్ చేస్తూ, ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌ యూఆర్ఎల్ ఛేంజ్ చేస్తుండటంతో వీరిపై చర్యలు తీసుకెళ్లకపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ నే బెదిరిస్తోంది. మరి దీనిపై చిత్ర పరిశ్రమ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Also Read: 'జవాన్' కు 1000 కోట్ల క్లబ్ లో చేరే సత్తా ఉందా? ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కింగ్ ఖాన్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాడా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election Bill : లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
KCR And KTR Cases Updates : మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
Andhra Pradesh News: తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధి‌ష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధి‌ష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
One Nation One Election Bill: లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్ ఘటనలో మరో ట్విస్ట్!Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election Bill : లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
KCR And KTR Cases Updates : మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
Andhra Pradesh News: తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధి‌ష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధి‌ష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
One Nation One Election Bill: లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Rohit Sharma Retirement: టెస్టుల నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్‌? డగౌట్ ముందు గ్లౌస్‌లతో సంకేతాలు!
టెస్టుల నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్‌? డగౌట్ ముందు గ్లౌస్‌లతో సంకేతాలు!
Srikakulam Crime News: టీడీపీ నేత హత్యకు కుట్ర- బిహార్ గ్యాంగ్‌కు సుపారీ- శ్రీకాకుళం జిల్లా పలాసలో సంచలనం 
టీడీపీ నేత హత్యకు కుట్ర- బిహార్ గ్యాంగ్‌కు సుపారీ- శ్రీకాకుళం జిల్లా పలాసలో సంచలనం 
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Elon Musk: ఇక  టెస్లా వాట్సాప్, జీమెయిల్‌ - తేవాలని టెకీ సలహా - సిద్దమన్న ఎలాన్ మస్క్ !
Elon Musk: ఇక టెస్లా వాట్సాప్, జీమెయిల్‌ - తేవాలని టెకీ సలహా - సిద్దమన్న ఎలాన్ మస్క్ !
Embed widget