అన్వేషించండి

Director Teja: ఎన్టీఆర్ బయోపిక్ నా డ్రీమ్ ప్రాజెక్ట్‌, ఆ నందమూరి హీరోతో తీస్తా: దర్శకుడు తేజ

తేజ దర్శకత్వంలో దగ్గుబాటి అభిరామ్ హీరోగా ‘అహింస’ అనే సినిమా తెరకెక్కింది. జూన్2న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ, ఎన్టీఆర్ బయోపిక్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు రెండో కొడుకు అభిరామ్ హీరోగా, తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అహింస’. గీతిక తివారీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సదా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాతో రానా సోదరుడు అభిరామ్ వెండి తెరకు హీరోగా పరిచయం అవుతున్నారు. షూటింగ్ మొదలైనప్పటి నుంచి రకరకాల ఇబ్బందులను ఎదుర్కొన్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు రెడీ అవుతోంది. జూన్ 2వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తప్పుకోవడానికి కారణం ఏంటంటే?

సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ, ఎన్టీఆర్ బయోపిక్ గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఎన్టీఆర్ బయోపిక్‌ ముహుర్తం షాట్ తర్వాత దర్శకుడిగా తేజ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. తాజాగా ఆ సినిమా నుంచి వైదొలగడంపై తేజ వివరణ ఇచ్చారు. “ఎన్టీఆర్ గొప్ప నటుడు, నాయకుడు. నేను ఇష్టపడే హీరోలు ఇద్దరు. ఒకరు ఎన్టీఆర్. మరోకరు ఎంజీఆర్. అలాంటి ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కే సినిమాకు నేను న్యాయం చేయలేను అనిపించింది. ఎన్టీఆర్ గొప్పదనాన్ని చూపించే శక్తి నాకు సరిపోదు అనుకున్నాను.  అందుకే సినిమా నుంచి తప్పుకున్నాను. బాలకృష్ణతో విభేదాలు రావడం వల్ల బయటకు వచ్చాననే వార్తలు శుద్ధ అబద్ధం. ఆయనతో నాకు ఎలాంటి విభేదాలు లేవు” అని తెలిపారు.  

ఆయనతో నందమూరి తారక రామారావు బయోపిక్ తీస్తా!

ఎన్టీఆర్ బయోపిక్ తీయం అనేది తన డ్రీమ్ ప్రాజెక్టులలో ఒకటని తేజ వెల్లడించారు. “వివిధ కారణాల వల్ల ఇప్పటికే 70 సినిమాలను తిరస్కరించాను. కానీ, ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తప్పుకోవాల్సి వచ్చినందుకు  చింతిస్తున్నాను. కానీ, ఎన్టీఆర్ బయోపిక్ తీయడం అనేది నా డ్రీమ్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా ఉంటుంది. ఇది నేను వెబ్ సిరీస్‌ల రూపంలో  ప్రయత్నిస్తాను. ఎన్టీఆర్ పాత్రలో ఏ నటుడినైనా నటింపజేయడం చాలా కష్టం. అందుకే, నందమూరి తారక రామారావు మనవడు ఎన్టీఆర్ ఈ పాత్రకు సరిపోతాడు. ఎందుకంటే అతడు లెజెండ్ లాగా కనిపిస్తాడు. ఆయన పాత్రకు సరైన ఎంపిక ఎన్టీఆర్ అని భావిస్తున్నాను” అని తేజ తెలిపారు. 

బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకోని సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్

ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తేజ తప్పుకున్న తర్వాత, ఆయన స్థానంలో దర్శకుడిగా క్రిష్ లైన్ లోకి వచ్చారు. ఆయన రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా ఆడింది. దానికి కారణం లేకపోలేదు. ఆదే సమయంలో రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ కు సంబంధించి ఓ సినిమా తెరకెక్కించారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో విడుదల చేశారు. చాలా మంది క్రిష్ సినిమా కంటే ఆర్జీవీ సినిమా చూసేందుకే మొగ్గుచూపారు.

Read Also: నా పిల్లలకు పెళ్లి చెయ్యను - ఆర్జీవీ ఏం చేసినా ఆయనకే నా సపోర్ట్: దర్శకుడు తేజ

టాప్ హెడ్ లైన్స్

Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget