Hit 3 Box Office Collection Day 1: 'హిట్ 3' ఫస్ట్ డే కలెక్షన్స్... బాక్సాఫీస్ బరిలో వసూళ్ల ఊచకోత... ఓపెనింగ్ డే @ 43 కోట్లు
Nani Hit 3 First Day Collection: నాని 'హిట్ 3' సినిమాకు ఆల్మోస్ట్ అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరిగాయి. ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందంటే?

First Day Box Office Collection Of Hit 3: న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్ సినిమా 'హిట్ 3'. 'హిట్' ఫ్రాంచైజీలో మూడో చిత్రమిది. మే 1న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఆ రోజు పబ్లిక్ హాలిడే కావడం, నాని వరుస విజయాల్లో ఉండటంతో మొదటి రోజు మంచి ఓపెనింగ్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి, ఫస్ట్ డే ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉండే అవకాశం ఉందంటే?
'హిట్ 3' ఓపెనింగ్ డే @ 43 కోట్లు
బాక్స్ ఆఫీస్ బరిలో మొదటి రోజు 43 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందని చిత్ర బృందం అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. బుక్ మై షోలో ఫస్ట్ డే రెండు లక్షల కంటే ఎక్కువ టికెట్స్ అమ్ముడు అయ్యాయని తెలిసింది. నాని కెరీర్‌లో బెస్ట్ గ్రాసర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.
SARKAAR'S BOX OFFICE MAYHEM collects a whopping 43+ CRORES GROSS WORLDWIDE on DAY 1 💥💥
— Wall Poster Cinema (@walpostercinema) May 2, 2025
Natural Star @NameisNani's HIGHEST DAY 1 GROSSER 🔥#HIT3 is the #1 INDIAN FILM WORLDWIDE YESTERDAY ❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/8HrBsV0Ry1#BoxOfficeKaSarkaar… pic.twitter.com/IEuNsxZ5Sn
వరల్డ్ వైడ్ షేర్ రూ. 17 కోట్లకు ఎక్కువ!
గురువారం, మే 1న 'హిట్: ది థర్డ్ కేస్'కు మార్నింగ్ షోస్ ఆక్యుపెన్సీ ఆల్మోస్ట్ 80 పర్సెంట్ ఉంది. మధ్యాహ్నం నుంచి థియేటర్లకు ఎక్కువ మంది జనాలు వచ్చారు. ఆఫ్టర్నూన్ షోస్ 92 పర్సెంట్, ఈవెనింగ్ షోస్ 91 పర్సెంట్ ఆక్యుపెన్సీ నమోదు చేశాయి. మూవీకి మంచి టాక్ రావడంతో నైట్ షోస్ కూడా ఆక్యుపెన్సీ చాలా బావుందని టాక్.
Also Read: 'హిట్ 3' రివ్యూ: క్యాప్చర్... టార్చర్... కిల్... నాని ఊచకోత హిట్టేనా? స్టైలిష్ విధ్వంసం ఎలా ఉందంటే?
$𝟏 𝐌𝐈𝐋𝐋𝐈𝐎𝐍+ & 𝐑𝐎𝐀𝐑𝐈𝐍𝐆🔥🤩#HITTheThirdCase smashes the $1M mark in North America ❤️🔥
— Prathyangira Cinemas (@PrathyangiraUS) May 1, 2025
Packed houses, non stop thrill, and unstoppable momentum🔥
In Theatres Now – https://t.co/PCTv48QSwP @NameIsNani @KolanuSailesh @wallpostercinema @UnanimousProd#HIT3 pic.twitter.com/JT3ueGtMUP
ప్రజెంట్ టాక్, ఎర్లీ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే... మొదటి రోజు ఈ సినిమా మంచి నంబర్స్ నమోదు చేయడం ఖాయంగా కనబడుతోంది. ఓపెనింగ్ డే ఈ మూవీకి 17 కోట్ల రూపాయల కంటే ఎక్కువ షేర్ వస్తుందని ఒక అంచనా. గ్రాస్ విషయానికి వస్తే... 43 కోట్ల కంటే ఎక్కువ వచ్చింది.
'సరిపోదా శనివారం' తర్వాత నానికి మరో హిట్!
'సరిపోదా శనివారం' తర్వాత నాని ఖాతాలో మరో హిట్ 'హిట్ 3' అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వేసవిలో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు జనాలను రప్పించిన సినిమా 'హిట్ 3' అని దిల్ రాజు కూడా పేర్కొన్నారు. నిర్మాతగా 'కోర్ట్' తర్వాత నానికి మరో సక్సెస్ ఇది.
Also Read: 'రెట్రో' రివ్యూ: 'కంగువా' ఫ్లాప్ నుంచి బయట పడ్డారా? సూర్య సినిమా హిట్టా? ఫట్టా?





















