అన్వేషించండి

Animal Movie: అత్యధిక వసూళ్లు రాబట్టిన 'A' రేటెడ్ మూవీస్ - 'యానిమల్' కూడా ఈ లిస్టులో చేరుతుందా?

Animal Movie: రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'యానిమల్'. డిసెంబర్ 1న విడుదల కాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ స్టామినాపై ట్రేడ్ లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

Animal : టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'యానిమల్'. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ను 2023 డిసెంబర్ 1వ తేదీన హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు విశేష స్పందన లభించిన నేపథ్యంలో, ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అని ట్రేడ్ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.

'అర్జున్ రెడ్డి' సినిమాతో డైరక్టర్ గా పరిచయమైన సందీప్ వంగా.. డెబ్యూతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. అదే చిత్రాన్ని 'కబీర్ సింగ్' పేరుతో హిందీలో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ క్రమంలో కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు రణబీర్ తో కలిసి 'యానిమల్' అంటూ వస్తున్నారు. ఈ క్రేజీ కాంబోపై అభిమానుల్లోనే కాదు, ట్రేడ్ లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా వచ్చిన వైలెంట్ ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది. ఈసారి బాక్సాఫీసు దగ్గర భారీ వసూళ్లు ఖాయమనే ధీమా కలిగిస్తోంది.

'యానిమల్' అనేది మోస్ట్ వయలెంట్ అండ్ పవర్‌ ఫుల్‌ గ్యాంగ్‌ స్టర్‌ డ్రామా. బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌ తో పాటుగా అదిరిపోయే యాక్షన్ సీన్స్ తో సరికొత్తగా ఉండబోతోందని టీజర్ - ట్రెయిలర్ ని బట్టి తెలుస్తోంది. సెన్సార్ బోర్డ్ ఈ పాన్ ఇండియా చిత్రానికి 'A' సర్టిఫికేట్ జారీ చేసింది. సినిమా నిడివి 3 గంటల 21 నిమిషాల 23 సెకన్లు వచ్చినట్లు మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. దీంతో ఒక 'ఎ' రేటెడ్ మూవీ దాదాపు మూడున్నర గంటల రన్ టైమ్ తో ఆడియన్స్ ను ఏ మేరకు అలరిస్తుందో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Also Read: టాలీవుడ్​లో రీ-రిలీజుల ట్రెండ్​కు ఎండ్ కార్డ్ పడినట్లేనా? 

అత్యధిక వసూళ్లు రాబట్టిన 'A' రేటెడ్ ఇండియన్ మూవీస్..
CBFC నార్మ్స్ ప్రకారం 'A' సర్టిఫికేట్ పొందిన చిత్రాలను పెద్దలు మాత్రమే చూడాలి. అందుకే వసూళ్ల పరంగా బాక్సాఫీసు వద్ద రికార్డులు క్రియేట్ చేసిన అడల్ట్ రేటెడ్ సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన 'ఏ' రేటెడ్ భారతీయ చిత్రాలని పరిశీలిస్తే.. ఇప్పటికి 2019లో వచ్చిన 'కబీర్ సింగ్' మాత్రమే టాప్ లో నిలిచింది. సందీప్ వంగా దర్శకత్వంలో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఈ హిందీ రీమేక్ మూవీ రూ. 380 కోట్ల గ్రాస్ వసూలు చేయగలిగింది. 

ఎన్నో కాంట్రవర్సీలకు తెర లేపిన 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 340 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. అలానే వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ' కూడా రూ. 300 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది. ఇక అక్షయ్ కుమార్ నటించిన 'OMG 2' మూవీ రూ. 225 కోట్ల వరకూ కలెక్ట్ చేసింది. ఈ లిస్టులో ఇప్పుడు 'యానిమల్' సినిమా కూడా చేరుతుందని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఈజీగా 'కబీర్ సింగ్' ని బీట్ చేసి టాప్ లోకి వెళ్తుందని భావిస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం రూ. 500 కోట్లు లేదా రూ. 600 కోట్ల క్లబ్ లో జాయిన్ అవడం గ్యారంటీ అని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

కాగా, 'యానిమల్' మూవీలో అర్జున్‌ గా రణ్‌బీర్‌, గీతాంజలిగా రష్మిక కనిపించనున్నారు. అనిల్ కుమార్, బాబీ డియోల్, తృప్తి దిమ్రి కీలక పాత్రలు పోషిస్తున్నారు. గుల్షన్ కుమార్ సమర్పణలో టీ సిరీస్ & భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భూషణ్ కుమార్ - ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Also Read: కాసుల వర్షం కురిపిస్తున్న కోస్టల్ బ్యాక్ డ్రాప్.. సముద్రం మీద పడ్డ టాలీవుడ్ హీరోలు!

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Credit Card Safety Tips: మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Embed widget