Hi Nanna Song Glimpse : ‘హాయ్ నాన్న’ నుండి ‘సమయమా’ పాట గ్లింప్స్ వచ్చేసింది - ఫుల్ సాంగ్ ఎప్పుడంటే?
కేవలం హమ్మింగ్‌తో పాట గ్లింప్స్‌ను విడుదల చేసి అక్కడే మ్యూజిక్ లవర్స్‌లో ఆసక్తిని రేకెత్తించడం మేకర్స్‌కు అలవాటు అయిపోయింది. తాజాగా ‘హాయ్ నాన్న’ మూవీ మేకర్స్ కూడా అదే ఫార్ములాను ఫాలో అయ్యారు.
![Hi Nanna Song Glimpse : ‘హాయ్ నాన్న’ నుండి ‘సమయమా’ పాట గ్లింప్స్ వచ్చేసింది - ఫుల్ సాంగ్ ఎప్పుడంటే? Hi Nanna first single Samayama glimpse is out now Nani Mrunal Thakur latest Telugu news Hi Nanna Song Glimpse : ‘హాయ్ నాన్న’ నుండి ‘సమయమా’ పాట గ్లింప్స్ వచ్చేసింది - ఫుల్ సాంగ్ ఎప్పుడంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/15/18eeb705a045592c14584fb4934713421694777253232802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సినిమా విడుదల అవ్వక ముందే దాని నుండి బయటికి వచ్చే ఒక్క పాట చాలు... ఆ మూవీ మీద హైప్ క్రియేట్ చేయడానికి. అందుకే చాలా వరకు అప్ కమింగ్ మూవీలు అన్నీ తమ పాటలను విడుదల చేయడానికి క్యూ కట్టాయి. ముఖ్యంగా ఈ రెండు రోజుల్లో ఎన్నో కొత్త పాటలు ప్రేక్షకులను పలకరించనున్నాయి. అందులో నేచురల్ స్టార్ నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రం నుండి ‘సమయమా’ కూడా ఒకటి. సెప్టెంబర్ 16న ‘హాయ్ నాన్న’ నుండి మొదటి పాట విడుదల అవుతుంది అని ఇప్పటికే నాని తన సోషల్ మీడియాలో ప్రకటించగా.. దానికి సంబంధించిన గ్లింప్స్ తాజాగా విడుదల అయ్యింది.
‘సమయమా’ గ్లింప్స్ వచ్చేసింది
నేచురల్ స్టార్ నాని స్క్రిప్ట్ సెలక్షనే డిఫరెంట్. ‘దసరా’ లాంటి కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటించిన తర్వాత ‘హాయ్ నాన్న’ లాంటి ఒక క్యూట్ ఫ్యామిలీ కథతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతాడని ఎవరూ ఊహించలేదు. శౌర్యువ్ అనే డైరెక్టర్ ‘హాయ్ నాన్న’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు. మలయాళంలో పలు చిత్రాలకు అందమైన సంగీతాన్ని ఇచ్చి ఆకట్టుకున్న హేషమ్ అబ్దుల్ వాహబ్... ఈ మూవీకి కూడా సంగీతం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. కొన్నిరోజుల క్రితం నాని పుట్టినరోజు సందర్భంగా ‘హాయ్ నాన్న’ గ్లింప్స్ విడుదలయ్యి అందరినీ ఆకట్టుకుంది. ఇందులో మృణాల్ ఠాకూర్ కూడా మరింత అందంగా కనిపిస్తుందని ప్రేక్షకులు భావించారు. ఇక తాజాగా విడుదలయిన ‘సమయమా’ పాట గ్లింప్స్‌లో అయితే నాని, మృణాల్.. ఇద్దరూ మరింత క్యూట్‌గా కనిపిస్తున్నారని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
మరింత యంగ్‌గా నాని
ఇప్పటికే విడుదలయిన ‘హాయ్ నాన్న’ గ్లింప్స్‌లో నాని.. ఒక మధ్య వయసు వ్యక్తిగా, ఒక పాపకు తండ్రిగా కనిపించాడు. కానీ ‘సమయమా’ గ్లింప్స్‌లో మాత్రం ఒక యువకుడిగా కనిపించాడు. దీంతో ఈ సినిమాలో నాని.. వివిధ పాత్రల్లో కనిపించనున్నాడని ప్రేక్షకుల్లో సందేహం మొదలయ్యింది. మృణాల్ ఠాకూర్ కూడా గ్లింప్స్‌తో పోలిస్తే ఈ పాటలో చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇక సెప్టెంబర్ 16న ఉదయం 11.07 నిమిషాలకు ‘సమయమా’ లిరికల్ సాంగ్ విడుదల అవుతుందని మూవీ టీమ్ ప్రకటించింది. కేవలం హమ్మింగ్‌తోనే ఈ గ్లింప్స్ విడుదలయినా ఇందులో హేషమ్ ఫ్లేవర్ కనిపిస్తుందని మ్యూజిక్ లవర్స్ అంటున్నారు.
‘ఖుషి’తో గ్రాండ్ డెబ్యూ..
వైరా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘హాయ్ నాన్న’ చిత్రాన్ని మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. ఇప్పటికే మలయాళంలో ‘హృదయం’ అనే చిత్రానికి సంగీతం అందించి, భాషతో సంబంధం లేకుండా అందరు మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకున్నాడు హేషమ్ అబ్దుల్ వాహబ్.. తెలుగులో ఇప్పటికే ‘ఖుషి’తో గ్రాండ్ డెబ్యూ చేశాడు. విజయ్ దేవరకొండ, సమంత జోడీగా నటించిన ‘ఖుషి’ ఒక క్యూట్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. ఇలాంటి ఒక లవ్ స్టోరీకి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కావాలో.. అలాంటి పర్ఫెక్ట్ మ్యూజిక్‌ను హేషమ్ అందించాడని ఇప్పటికే చాలామంది మేకర్స్ తనను ప్రశంసించారు. ఇప్పుడు ‘హాయ్ నాన్న’తో మరోసారి తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేయడానికి వచ్చేస్తున్నాడు హేషమ్ అబ్దుల్.
Also Read: షారుఖ్ ఖాన్ కోసం దీపికా పదుకోన్ ఫ్రీగా నటించారా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)