News
News
వీడియోలు ఆటలు
X

Happy Birthday RAPO: హీరో రామ్‌ పోతినేనికి శర్వానంద్ ఏమవుతాడో తెలుసా? రాపో సినీ, వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర విషయాలివే!

ఎనర్జిటిక్ స్టెప్పులు, స్టైలిష్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటున్న హీరో రామ్ నేడు పుట్టినరోజును జరువుకుంటున్నారు. 'దేవదాస్' తో హీరోగా పరిచయమై, ఉస్తాద్ హీరోగా మారిన రామ్ గురించిన ఆసక్తికరమైన విషయాలు మీకోసం.

FOLLOW US: 
Share:

టాలీవుడ్ లో ఎనర్జిటిక్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఉస్తాద్ రామ్ పోతినేని. సినీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఎంతో కష్టపడి తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఓ వైపు క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూనే, మరోవైపు మాస్ ప్రేక్షకులకు దగ్గరవ్వడం రామ్ కే చెల్లింది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో పాన్ ఇండియాని టార్గెట్ చేస్తున్న రాపో(RAPO).. నేడు (మే 15) తన 35వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

1988 మే 15వ తేదీన మురళీ పోతినేని, పద్మశ్రీ దంపతులకు జన్మించాడు రామ్. వీరు విజయవాడ ప్రాంతానికి చెందినవారు అయినప్పటికీ, హైదరాబాద్ కు వచ్చి సెటిల్ అయ్యారు. రామ్ కు టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ ‘స్రవంతి’ రవి కిశోర్ స్వయానా పెదనాన్న అవుతాడు. హీరో శర్వానంద్ తో కూడా బంధుత్వం ఉంది. రామ్ అక్క మధుస్మితను శర్వా అన్న కళ్యాణ్ వివాహం చేసుకున్నాడనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు.

చెన్నైలోని చెట్టినాడు విద్యాశ్రమంలో స్కూలింగ్ చేసిన రామ్.. పెదనాన్న అడుగుజాడల్లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. 2002లో 'అడయాళం' అనే తమిళ షార్ట్ ఫిల్మ్ తో తన యాక్టింగ్ కెరీర్ ని ప్రారంభించాడు. ఈ క్రమంలో 'కాదల్' (ప్రేమిస్తే) చిత్రానికి ఆడిషన్ ఇచ్చాడు. అయితే దర్శకుడు వైవీఎస్ చౌదరీ చేతుల మీదుగా 2006 లో 'దేవదాస్' సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. అప్పుడు రామ్ వయస్సు కేవలం 18 ఏళ్లు మాత్రమే.

‘దేవదాసు’ సినిమాతో తెరంగేట్రం చేసిన రామ్.. ఫస్ట్ సినిమాతోనే హిట్టు కొట్టడమే కాదు.. డాన్సులు ఫైట్లు స్క్రీన్ ప్రెజెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే రెండో చిత్రం ‘జగడం’ తో పరాజయం మూట గట్టుకున్నాడు. అయినప్పటికీ రామ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించిన ‘రెడీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.. అతనికి స్టార్ డమ్ ని తెచ్చిపెట్టింది.

'మస్కా' సినిమాతో మాస్ ఆడియన్స్ ని మెప్పించిన రామ్.. 'గణేశ్', ‘రామరామ కృష్ణకృష్ణ’ చిత్రాలతో ఫ్లాప్స్ చవి చూసాడు. 'కందిరీగ' చిత్రం హిట్టిచ్చినా.. ‘ఎందుకంటే ప్రేమంట’, ‘ఒంగోలు గిత్త’, ‘మసాలా’ మూవీస్ నిరాశ పరిచాయి. ‘పండగ చేస్కో’ చిత్రం పర్వాలేదనిపించగా.. 'నేను శైలజ' సినిమా రామ్ కు మంచి హిట్ ఇచ్చింది. 'శివం', ‘హైపర్’, 'ఉన్నది ఒకటే జిందగీ' ‘హలో గురు ప్రేమ కోసమే’ తదితర సినిమాలు ఆశించిన విజయాలు అందుకోలేదు.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా అతని కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఊర మాస్ గా నటించినందుకు, మాస్ లో తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. అయితే తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన 'రెడ్' ఓకే అనిపించినా.. తెలుగు తమిళ భాషల్లో నటించిన 'ది వారియర్' మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.

రామ్ కు నార్త్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. అతను నటించిన ప్రతీ సినిమా హిందీలోకి డబ్ కాబడి, మిలియన్ల కొలదీ వ్యూస్ దక్కించుకుంటున్నాయి. యూట్యూబ్ లో 2 బిలియన్ల వ్యూస్ ఘనత వహించిన మొదటి హీరోగా.. ఏకైక సౌత్ హీరోగా రామ్ పోతినేని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసాడు. దీంతో అతని సినిమాల డబ్బింగ్ రైట్స్ & డిజిటల్ రైట్స్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా మార్కెట్ ను విస్తరించుకోవడంపై దృష్టి సారించిన రాపో.. దీనికి తగ్గట్టుగానే ఫ్యూచర్ ప్రాజెక్ట్ లను సెట్ చేసుకుంటున్నాడు. 

రామ్ పోతినేని ప్రస్తుతం ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి #RAPO20 సినిమా చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో 2023 దసరా సందర్భంగా విడుదల కానుంది. దీని తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ కి సీక్వెల్ గా 'డబుల్ ఇస్మార్ట్' అనే సినిమా చేయబోతున్నాడు. ఇది 2024 మహా శివరాత్రికి పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలలో రామ్ మంచి విజయాలు 5అందుకొని సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగించాలని కోరుకుంటూ, ‘ABP దేశం’ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. 

Read Also: ఎన్టీఆర్, కొరటాల శివ చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్! జూనియర్ బర్త్ రోజున రివీల్?

Published at : 15 May 2023 02:07 PM (IST) Tags: Ram Pothineni RAPO20 Boyapati Rapo Double Ismart Happy Birthday RAPO Ustad

సంబంధిత కథనాలు

శర్వానంద్ పెళ్లి, ప్రశాంత్ నీల్ బర్త్‌డే అప్‌డేట్స్, ఓజీ షూటింగ్ వివరాలు - నేటి సినీ విశేషాలివే!

శర్వానంద్ పెళ్లి, ప్రశాంత్ నీల్ బర్త్‌డే అప్‌డేట్స్, ఓజీ షూటింగ్ వివరాలు - నేటి సినీ విశేషాలివే!

Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?

Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ  బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?

Agent Settlement - Surender Reddy : 'లైగర్' రూటులో 'ఏజెంట్' డిస్ట్రిబ్యూటర్ - సురేందర్ రెడ్డి దిమ్మ తిరిగే రిప్లై!

Agent Settlement - Surender Reddy : 'లైగర్' రూటులో 'ఏజెంట్' డిస్ట్రిబ్యూటర్ - సురేందర్ రెడ్డి దిమ్మ తిరిగే రిప్లై!

Flautist Naveen Kumar: ఏఆర్ రెహ్మాన్ ఫ్లూటిస్ట్ నవీన్ కుమార్‌కి బైడెన్ ప్రశంసలు, లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్‌తో సత్కారం

Flautist Naveen Kumar: ఏఆర్ రెహ్మాన్ ఫ్లూటిస్ట్ నవీన్ కుమార్‌కి బైడెన్ ప్రశంసలు, లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్‌తో సత్కారం

Ashish Vidyarthi : కష్టం కలిగినా అబ్బాయికి విడాకుల గురించి చెప్పక తప్పలేదు- ఆశిష్ విద్యార్థి

Ashish Vidyarthi : కష్టం కలిగినా అబ్బాయికి విడాకుల గురించి చెప్పక తప్పలేదు-  ఆశిష్ విద్యార్థి

టాప్ స్టోరీస్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?