News
News
వీడియోలు ఆటలు
X

నాకు జెండాలు, ఎజెండాలు లేవు - అమిత్ షా పిలిస్తే అందుకే వెళ్ళలేదు: హీరో నిఖిల్ 

'కార్తికేయ 2' తర్వాత ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా సినిమాలు చేస్తున్నాడనే కామెంట్స్ పై హీరో నిఖిల్ సిద్ధార్థ స్పందించాడు. కేంద్రమంత్రి అమిత్ షాను కలిసేందుకు ఆహ్వానం అందడం గురించి మాట్లాడాడు.

FOLLOW US: 
Share:

నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పై’ (SPY). ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన సీక్రెట్ ను కనుగొనే మిషన్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో నిఖిల్ ఒక RAW ఏజెంట్ గా కనిపించనున్నాడు. రీసెంట్ గా న్యూఢిల్లీలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం కర్తవ్య పథ్ వద్ద మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. 

'స్పై' టీజర్ కు ఆడియెన్స్ నుంచి అనూహ్య స్పందన లభించడంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేశారు. 'ఫస్ట్ మిషన్' పేరుతో మంగళవారం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ.. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, జెండాలు ఎజెండాలు లేవని కీలక వ్యాఖ్యలు చేశాడు. రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిదని కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసేందుకు ఆహ్వానం వచ్చినా వెళ్లలేదని చెప్పాడు. 

'ఇటీవల కాలంలో నేషనల్ ఇష్యూస్ మీద రూపొందే చిత్రాలపై ఎజెండా బేస్డ్ సినిమా అనే ముద్ర వేస్తున్నారు. మీ ఎజెండా ఏంటి?' అని విలేఖరులు ప్రశ్నించారు. దీనికి నిఖిల్ బదులిస్తూ.. "ఒక మంచి సినిమా చేద్దాం అనేదే మా అజెండా. అది తప్ప వేరే అజెండాలు ఏమీ లేవు. మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. జెండాలు లేవు.. ఎజెండాలు లేవు" అని అన్నారు. 

స్పై సినిమాతో ఎవరినీ కించ పరచడం లేదు, ఎవరినీ ప్రమోట్ చేయటం లేదు. అలానే ఎవరినీ క్రిటిసైజ్ చేయటం లేదని నిఖిల్ స్పష్టం చేశారు. ఇది ఫన్, యాక్షన్, రొమాన్స్, ఎంటర్టైన్మెంట్ తో కూడిన హానెస్ట్ ఫిలిం అని పేర్కొన్నాడు. ఈ మూవీ కోసం తనతో పాటుగా హీరోయిన్ ఐశ్వర్య, సాన్యా, అభినవ్ గోమటం రియల్ రా (RAW) ఏజెంట్ల మాదిరిగా ట్రైనింగ్ తీసుకున్నామని నిఖిల్ తెలిపాడు. 

'కార్తికేయ 2' తర్వాత ఒక పొలిటికల్ పార్టీకి అనుకూలంగా సినిమాలు చేస్తున్నాడనే కామెంట్స్ పై నిఖిల్ స్పందించాడు. "నేను లార్డ్ కృష్ణని బాగా నమ్ముతాను. కృష్ణుడి పట్ల భక్తి భావంతో 'కార్తికేయ 2' చేశాను. నేను ఏ పార్టీ కోసం సినిమా చేయలేదు. నన్ను ఏ పార్టీ వాళ్లు సినిమా చేయమని అడగలేదు. నేను చిన్నప్పటి నుంచీ సుభాష్ చంద్రబోస్ ను ఫాలో అవుతున్నాను. అలాంటి రెండు కథలు నా దగ్గరకు వస్తే, నేను వాటిని సెలెక్ట్ చేసుకున్నాను. అంతే తప్ప ఏ పార్టీ కోసమో, ఓ కులం మతం వారి కోసమో చేయలేదు. ఒక ఇండియన్ గా ఈ సినిమాలు చేస్తున్నాను. ప్రతీ భారతీయుడు ఈ స్పై మూవీ చూడాలని కోరుకుంటున్నాను" అని నిఖిల్ అన్నారు.

కేంద్ర మంత్రి అమిత్ షా నుంచి ఆహ్వానం అందడం గురించి నిఖిల్ మాట్లాడుతూ.. "నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. ఒక పబ్లిక్ ఈవెంట్ లో ఆయన్ని కలవాల్సింది. కానీ ఇలా ఏదొక అజెండా వుందని అనుకుంటారని, పాలిటిక్స్ కి దూరంగా ఉంటే మంచిదని వెళ్లలేదు. ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు మన సినిమానే ఉండాలని అనుకున్నాను. నన్ను ఆహ్వానించినందుకు అమిత్షాకు కృతజ్ఞతలు. నా సినిమాలను అప్రీసియెట్ చేసిన కేంద్ర మంత్రులు, ఇతర పార్టీల వారికి కూడా థాంక్స్. ఇప్పుడు స్పై చిత్రాన్ని కల్చరల్ మినిస్టర్, గవర్నమెంట్ అఫిషియల్స్ తో పాటుగా అపోజిషన్ లో ఉన్నవారికి కూడా చూపిస్తాం" అని నవ్వుతూ బదులిచ్చారు. 

కాగా, స్పై చిత్రాన్ని ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె రాజశేఖర్ రెడ్డి, సిఇఓ చరణ్ తేజ్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. దీనికి నిర్మాత రాజశేఖర్ రెడ్డి కథ అందించారు. ఇందులో నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించగా.. ఆర్యన్ రాజేష్, సన్యా ఠాకూర్, అభినవ్ గోమఠం, మకరంద్ దేశ్పాండే, జిషు సేన్ గుప్తా, నితిన్ మెహతా ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ స్పై థ్రిల్లర్ ను జూన్ 29న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. 

Read Also: దేవుళ్ళ చుట్టూ తిరుగుతున్న హీరోలు - టాలీవుడ్‌లో ఇప్పుడిదే నయా ట్రెండ్!

Published at : 17 May 2023 09:22 AM (IST) Tags: Nikhil Nikhil Siddhartha SPY Movie Spy Teaser Nikhil Comments on Amit Shah Nikhil skips Amit Shah meeting

సంబంధిత కథనాలు

LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!

LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!

Intinti Ramayanam Trailer: ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్ - ఇంతకీ, ఆ పని చేసింది ఇంటి దొంగేనా?

Intinti Ramayanam Trailer: ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్ - ఇంతకీ, ఆ పని చేసింది ఇంటి దొంగేనా?

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

'గృహం' సీక్వెల్ రెడీ, అందుకే ‘బొమ్మరిల్లు-2’ తీయడం కష్టం: సిద్ధార్థ్

'గృహం' సీక్వెల్ రెడీ, అందుకే ‘బొమ్మరిల్లు-2’ తీయడం కష్టం: సిద్ధార్థ్

కోలీవుడ్‌ కాలింగ్ - శ్రీలీల డేట్స్ కోసం తమిళ నిర్మాతలు వెయిటింగ్

కోలీవుడ్‌ కాలింగ్ - శ్రీలీల డేట్స్ కోసం తమిళ నిర్మాతలు వెయిటింగ్

టాప్ స్టోరీస్

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

YS Viveka Case :  వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!