అన్వేషించండి

Nagarjuna: టైమ్ వేస్ట్ చేశాడంటూ ఆ దర్శకుడిపై మండిపడ్డ నాగార్జున?

టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున తాజాగా ప్రముఖ రచయిత ప్రసన్నకుమార్ బెజవాడ పై ఫైర్ అయినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ లో ప్రస్తుతం సీనియర్ హీరోగా కొనసాగుతున్నారు కింగ్ నాగార్జున. 2022లో ఆయన నటించిన 'ది ఘోస్ట్' సినిమా తర్వాత ఇప్పటివరకు తన తదుపరి సినిమాని ప్రకటించలేదు. 'ది ఘోస్ట్' రిలీజై సుమారు 8 నెలలు దాటుతుంది. అయినా ఇప్పటివరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ లేదు. తాజాగా ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడతో నాగార్జున మూవీ చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. అటు రైటర్ ప్రసన్నకుమార్ కూడా నాగార్జునతో తాను డైరెక్టర్ గా సినిమా చేయబోతున్నట్లు ఇంటర్వ్యూలో స్వయంగా ప్రకటించారు. 'ధమాకా' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున సినిమాతోనే తాను దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నట్లు వెల్లడించాడు. కానీ ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు.

అయితే లేటెస్ట్ టాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం రైటర్ బెజవాడ ప్రసన్నకుమార్ మీద నాగార్జున ఫైర్ అయినట్లు తెలుస్తోంది. తనతో సినిమా చేస్తానని చెప్పి ఇప్పటివరకు తన సమయం వృధా చేసినందుకు నాగార్జున ప్రసన్నకుమార్ పై ఫైర్ అయ్యారట. రైటర్ ప్రసన్నకుమార్ నాగార్జున కోసం 'పురింజు మరియం బోస్' అనే మలయాళ సినిమా నుంచి ఇన్స్పైర్ అయి ఓ కథను రెడీ చేశారట. ఆ స్టోరీని నాగార్జునకు వినిపించగా ఆయనకు కథ బాగా నచ్చింది. ఇక ప్రసన్నకుమార్ దగ్గరే ఈ మలయాలను సినిమా రైట్స్ ఉన్నాయని నాగార్జున భావించారట. దాంతో వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ ని లక్ష్యంగా పెట్టుకొని సినిమా ప్రారంభించవచ్చని నాగార్జున అనుకున్నారు. కట్ చేస్తే  తాను అనుకున్నట్లు ఇవన్నీ జరగకపోవడంతో రైటర్ ప్రసన్నకుమార్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా రీమేక్ హక్కుల విషయంలో వివాదాలు తలెత్తాయి. ఈ సినిమా రీమేక్ రైట్స్ ని ఇప్పటికే ఇండస్ట్రీలో మరో అగ్ర నిర్మాత  కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

దాంతో బెజవాడ ప్రసన్నకుమార్ దగ్గర ఎటువంటి రీమేక్ రైట్స్ లేకపోవడంతో సినిమాని రీమేక్ చేయడానికి అతనికి అనుమతులు లభించలేదు. ఇదే ఇష్యూ సుమారు నెలల తరబడి కంటిన్యూ అవుతూనే ఉంది. నాగార్జున సమయం కూడా వృథా అయిపోయింది. దీంతో బెజవాడ ప్రసన్నకుమార్ తన టైమ్ అంతా వేస్ట్ చేశాడంటూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా వెంటనే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట నాగార్జున. ఇప్పుడు తన తదుపరి సినిమా కోసం ఇతర దర్శకుల స్క్రిప్స్ ని వింటున్నట్లు తెలుస్తోంది. రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ నాగార్జున దగ్గర రీమేక్ రైట్స్ లేవనే విషయాన్ని దాచి పెట్టారట. అందుకే నాగార్జున ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 'ది వారియర్', 'కస్టడీ' సినిమాలను నిర్మించిన ప్రొడ్యూసర్ శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మించాలని అనుకున్నారు. అంతేకాదు ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఇటీవల మొదలుపెట్టారట. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఆగిపోవడంతో ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి నాగార్జున తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్ తో ఉంటుందో చూడాలి.

Read Also: 'కెజియఫ్' కాదు, అంతకు మించి, 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' రేంజ్‌లో 'సలార్' - శ్రియా రెడ్డి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Also Read: ‘లియో’ ఫస్ట్ లుక్ - సుత్తితో పళ్లు రాలగొట్టేంత కసి, డెవిల్‌ను తలపిస్తున్న విజయ్!

టాప్ హెడ్ లైన్స్

పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
Eshwar Sai Madhuri Rathod : నా భర్తను వదులుకోను... అంతా సెటిల్ - ఇక అపేయండి... ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయి భార్య రియాక్షన్
నా భర్తను వదులుకోను... అంతా సెటిల్ - ఇక అపేయండి... ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయి భార్య రియాక్షన్
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Embed widget